సంచిక-సాహితీ ప్రచురణలు వెలువరించే రెండవ కథల సంకలనం క్రీడ కేంద్ర బిందువుగా ఉన్న కథలను ఒక చోట చేరుస్తుంది. అంటే, ఉగాదికి విడుదలయ్యే కథల సంకలనం క్రీడా కథల సంకలనం అన్నమాట. రైలు కథలు , దేశభక్తి కథలు, తెలుగుకథల్లో మహాత్మా గాంధీ కథల సంకలనం తరువాత నేను, కోడీహళ్ళి మురళీమోహన్ రూపొందిస్తున్న నాలుగవ కథల సంకలనం ఇది. క్రీడలు కేంద్ర బిందువుగా సృజించిన తెలుగు కథల సంకలనం తయారీలో తోడ్పడండి. క్రీడలు కేంద్ర బిందువుగా ఉన్న కథలు మీకు తెలిసినవి వివరాలు చెప్తే ఆ కథలను సంకలనంలో ప్రచురణకు పరిశీలిస్తాము. అలాగే మీరు రాసిన కథలుంటే, ప్రచురితమయినా, అముద్రితమయినా, పంపిస్తే వాటినీ ప్రచురణకు పరిశీలిస్తాము. అముద్రితమయిన కథలను సంచిక వెబ్ పత్రికలో ప్రచురిస్తాము. ఒకవేళ ఈ సంకలనం కోసం ప్రత్యేకంగా కథ రాసి పంపితే, వాటినీ పరిశీలిస్తాము. ఒకవేళ ఆ కథ మేము అనుకున్న పరిథిలో ఇమడకపోతే, దాన్ని సంచిక పత్రికలో ప్రచురిస్తాము. కథను పరిశీలనకు పంపటమే, వాటి ప్రచురణకు అనుమతిగా భావిస్తాము.
కథలు పంపవలసిన ఆఖరు తేదీ- 10 మార్చ్ 2019. కథలను ఈమెయిల్ ద్వారా అయితే kmkp2025@gmail.com కు, వాట్సప్ ద్వారా అయితే- 9849617392 కు, కొరియర్/పోస్ట్ ద్వారా అయితే, కస్తూరి మురళీకృష్ణ ప్లాట్ నెం: 32, ఇంటినెంబరు: 8-48,. రఘురామ్ నగర్ కాలనీ, ఆదిత్య హాస్పటల్ లేన్, దమ్మాయిగూడ, హైదరాబాద్ 500083 అనే చిరునామాకు పంపించండి. ఇతర కథా సంకలనాలను విజయవంతం చేసినట్టే, ఈ సంకలనం కూడా విజయవంతమవటంలో తోడ్పడండి.
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
ప్రతి ఒక్కరూ అవసరమే
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 27: తూములూరు
మహాభారతం మరోమారు
తిరుమలేశుని సన్నిధిలో – శ్రీనివాస వైభవం-1
పోస్టు చేయని ప్రేమలేఖ
All rights reserved - Sanchika™