[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘10x లెక్కలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
1x 2x 5x 10x
ఉత్పాదకత
శిక్షణ వెబినార్లు
మాస్టర్ క్లాసులు
బాల్యంలోనే
ఐఐటీ, ఐఐఎం
ఫౌండేషన్లు
యుక్తవయస్సు లోనే
ఇంటిగ్రేటెడ్ యూజీలో
పీజీ బోధనలు
వీటి మూలంగా
మారుతున్న
జనజీవన వేగం
నలభైలోనే
పదవీ విరమణ
అంటూ కంపెనీలు
పర్యవసానంగా
మారుతున్న
వయస్సు, మేధస్సు
10x లెక్కలు
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్
