Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

16వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీల విజేతలు – ప్రకటన

ఇటీవల ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న కథల పోటీలలో127 కథలు రాగా, వాటిలో సోమేపల్లి సాహితీ పురస్కారాలు పొందిన విజేతల వివరాలు ప్రకటిస్తున్నాము.

అత్యుత్తమ కథగా రూ.2500/- పొందిన ప్రథమస్థాయి పురస్కారం శ్రీ శింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు) గారికి ‘గెలుపు’ అనే కథకు; ఉత్తమ కథగా రూ.1500/- పొందిన ద్వితీయ స్థాయి జి.రంగబాబు (అనకాపల్లి) గారికి ‘ఇకనైనా మారండి’ అనే కథకు; మంచి కథగా రూ. 1000/- తృతీయస్థాయి పురస్కారం పొందిన జి.యస్‌.కె. కరీముల్లా (నరసరావుపేట) గారికి ‘బేరం’ అనే కథకు లభించాయి.

శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి (కాకినాడ) గారికి ‘మార్పు రావాలి’ అనే కథకు, శ్రీ సింహప్రసాద్‌ (హైదరాబాద్‌) గారికి ‘సామాజిక నేరం’ అనే కథకు, శ్రీ ఎం.వెంకటేశ్వరరావు (హైదరాబాద్‌) గారికి ‘అమూల్యం’ అనే కథకు గాను ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున ప్రత్యేక బహుమతులు లభించాయి.

ఈ కథల పోటీకి ప్రఖ్యాత కథకులు శ్రీకంఠస్ఫూర్తి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. త్వరలో గుంటూరులో జరిగే ప్రత్యేక సభలో జ్ఞాపిక, శాలువా, నగదుతో విజేతలను సత్కరించడం జరుగుతుంది.

వశిష్ఠ సోమేపల్లి,
అవార్డు కమిటీ

చలపాక ప్రకాష్‌
ఎడిటర్‌, రమ్యభారతి

Exit mobile version