Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

2024: శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

[శ్రీ సారధి మోటమఱ్ఱి రచించిన ‘2024: శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కసాన్ని అంటే ఆశలు
మనిషి మనసులో నిరాశలు…
మనిషి మనిషిపై అపోహలు –
మనిషి మనసులో చీకటి పొరలు…
అయిన వారిపై తేనెల జల్లులు
నడుమ నడుమ అల్లరి మాటలు…
కాని వారిపై క్రోధ జ్వాలలు
ఎచట చూసిన అసూయ అలలు…
పుడమి పై వెన్నెల లేదే ఎచట?
కొండపై వాగు నిలిచే దెక్కడ??
కోనేటిలో నింగినందే అల ఉండదే –
కడలిలో అలల దాటి కాచేదెట్ల!?
నీ హృదిలో చలువను చూడవదే?
నీ భృకిటి శక్తిని నిలదీసి –
ఆశల, అపోహాల, అసూయల క్రోధిని –
బూడిద చేయవోయ్ – వెలిగే ఉగాదికై!!

Exit mobile version