Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

2025 ఉగాది – పద్య కావ్య రచన పోటీ – ప్రకటన-అప్‌డేట్-1

వుల కోరికపై ఈ పోటీ గడువును 28 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించడమైనది.

మిగతా నియమ నిబంధనలన్నీ యథాతథంగా వర్తిస్తాయి.


‘పద్యరచన’ తెలుగు భాష నుదుటిపై ‘తిలకం’ అయితే- ‘వచన కవిత్వం’ తెలుగు భాషామతల్లికి కంఠాభరణం వంటిది.

ప్రపంచంలో ప్రతి భాషకూ తనదైన ఒక ప్రత్యేక వ్యాకరణం, భావవ్యక్తీకరణ, ప్రక్రియలు వుంటాయి.

పార్సీ భాషకు రుబాయీ,

ఉర్దూ భాషకు ఘజల్,

ఇంగ్లీషు భాషకు సానెట్,

జపానీయులకు హైకూలు ప్రత్యేకమైనవి. అయితే –

తెలుగు భాషకు ‘పద్యం’ ప్రత్యేకమైనది. తెలుగు భాషలో తప్పించి ఛందోబద్ధమైన పద్యాన్ని  ఇప్పటికీ సజీవంగాఇంత విస్తృతంగా రాస్తున్నవారు లేరు. .

ఈనాటి తెలుగు కవుల్లో చాలా మంది పర భాషలకు చెందిన ప్రత్యేక ప్రక్రియలకు ఇస్తోన్న ప్రాధాన్యం , వాటి రచనలో ఒరదర్శిస్తున్న  ఉత్సాహం మనదయిన  పద్య రచనకు ఇవ్వకపోవడం చింతించదగిన విషయం!

ఛందస్సును సర్పపరిష్వంగంగానో, భావవ్యక్తీకరణకు ప్రతిబంధకంగానో భావిస్తున్నంతకాలం పద్యానికి ప్రాధాన్యత లభించదు.

అందుకే – తెలుగు పద్యానికి కొంతైనా పూర్వ వైభవం కల్పించాలన్న సదుద్దేశంతో.. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా సంచిక-డాక్టర్ అమృతలత సంయుక్తంగా పద్య కావ్య రచన పోటీ నిర్వహిస్తున్నారు.

ఈ పోటీని సంచిక- డాక్టర్ అమృతలతల తరఫున నిర్వహిస్తారు మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారు.

పద్య కావ్య పోటీ నిబంధనలు:

పంపాల్సిన విధానం:

మెయిల్ ద్వారా పంపాల్సిన చిరునామా – sanchikapadyakaavyapotee2025@gmail.com

మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.

వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.

By Post (పోస్ట్ ద్వారా అయితే):

(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా ఒక కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).

Sachika Web Magazine

Plot no 32, H.No 8-48

Raghuram Nagar Colony.

Aditya Hospital lane

Dammaiguda, Hyderabad-500083

అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.

బహుమతి సొమ్ము ప్రకటన తరువాత వెలువడుతుంది.

ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు – శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయం, మామిడిపల్లి, నిజామాబాదులో ఉగాది – 2025’ పర్వదినం సందర్భంగా జరిగే కవి సమ్మేళనంలో బహుమతిప్రదానం జరుగుతుంది.

Exit mobile version