Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. అమృతలత-మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్త నిర్వహణలో కథల పోటీ -2026 ప్రకటన

ఇతివృత్తం:

‘ఈనాటి కుటుంబ సంబంధాలు – విలువలు’ అనే అంశం అంతర్లీనంగా వుండాలి.

నిబంధనలు:

నిడివి: కథ డిటిపిలో నాలుగు పేజీలకు మించకుండా ఉండాలి.

హామీ:

కథలు పంపేవారు కథ తమ స్వంతమేననీ, అనువాదం, అనుకరణా కాదనీ, మరే ఇతర ప్రింట్, అంతర్జాల పత్రికల్లోగానీ, సాంఘిక మాధ్యమాల్లో గానీ వెలువడలేదనీ, మరే ఇతర పోటీలకి పంపబడి పరిశీలనలో లేదనీ ఓ హామీ పత్రాన్ని జత చేయాలి.

కథ మీద తమ పేరు లేకుండా –

ఆ హామీ పత్రంలోనే విడిగా తమ పేరూ, చిరునామా, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటి వివరాలు ఇవ్వాలి.

బహుమతులు:

బహుమతి ప్రదానోత్సవం:

తేదీ 23.08.2026 ఆదివారం రోజు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 5 గంటలకు జరగనున్న డా.అమృతలత విరచిత ‘నా ఏకాంత బృందగానం’ సచిత్ర స్వీయ చరిత్రకు

శ్రీ పి. శ్రీరామ మూర్తి గారి ఇంగ్లీష్ అనువాదం ‘My solitary Chorus’ పుస్తకావిష్కరణ సందర్భంలో విజేతలకు బహుమతులు అందజేయబడతాయి.

ఈ కథలన్నీ మయూఖ అంతర్జాల పత్రికలో వీలువెంట ప్రచురింపబడడమే కాకుండా – త్వరలో పుస్తకం రూపంలో కూడా వెలువడుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం.

కథలు పంపవలసిన చిరునామా:

కథలు వర్డ్ ఫైల్‌లో

amruthamayukha.26@gmail.com

మెయిల్ ఐడి కి గానీ,

లేదా 98488 48866, 98663 60082, 94406 22781 మొబైల్ ఫోన్స్ కి గానీ వాట్సాప్‌లో పంపించాలి.

చివరి తేదీ: 31.7.2026

(ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబడదు)

తెలుగు కథకులందరూ ఈ కథల పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.

నిర్వాహకులు:

-డా. అమృతలత  – డా. కొండపల్లి నీహారిణి  – శ్రీమతి నెల్లుట్ల రమాదేవి

Exit mobile version