ఇతివృత్తం:
‘ఈనాటి కుటుంబ సంబంధాలు – విలువలు’ అనే అంశం అంతర్లీనంగా వుండాలి.
నిబంధనలు:
నిడివి: కథ డిటిపిలో నాలుగు పేజీలకు మించకుండా ఉండాలి.
హామీ:
కథలు పంపేవారు కథ తమ స్వంతమేననీ, అనువాదం, అనుకరణా కాదనీ, మరే ఇతర ప్రింట్, అంతర్జాల పత్రికల్లోగానీ, సాంఘిక మాధ్యమాల్లో గానీ వెలువడలేదనీ, మరే ఇతర పోటీలకి పంపబడి పరిశీలనలో లేదనీ ఓ హామీ పత్రాన్ని జత చేయాలి.
కథ మీద తమ పేరు లేకుండా –
ఆ హామీ పత్రంలోనే విడిగా తమ పేరూ, చిరునామా, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటి వివరాలు ఇవ్వాలి.
బహుమతులు:
- ప్రథమ బహుమతి- 10,000/-
- ద్వితీయ బహుమతి-5,000/-
- తృతీయ బహుమతి-3,000/-
- కన్సోలేషన్ బహుమతులు(22 ) ఒక్కొక్కటీ 1000/-
బహుమతి ప్రదానోత్సవం:
తేదీ 23.08.2026 ఆదివారం రోజు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 5 గంటలకు జరగనున్న డా.అమృతలత విరచిత ‘నా ఏకాంత బృందగానం’ సచిత్ర స్వీయ చరిత్రకు
శ్రీ పి. శ్రీరామ మూర్తి గారి ఇంగ్లీష్ అనువాదం ‘My solitary Chorus’ పుస్తకావిష్కరణ సందర్భంలో విజేతలకు బహుమతులు అందజేయబడతాయి.
ఈ కథలన్నీ మయూఖ అంతర్జాల పత్రికలో వీలువెంట ప్రచురింపబడడమే కాకుండా – త్వరలో పుస్తకం రూపంలో కూడా వెలువడుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం.
కథలు పంపవలసిన చిరునామా:
కథలు వర్డ్ ఫైల్లో
amruthamayukha.26@gmail.com
మెయిల్ ఐడి కి గానీ,
లేదా 98488 48866, 98663 60082, 94406 22781 మొబైల్ ఫోన్స్ కి గానీ వాట్సాప్లో పంపించాలి.
చివరి తేదీ: 31.7.2026
(ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబడదు)
తెలుగు కథకులందరూ ఈ కథల పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.
నిర్వాహకులు:
-డా. అమృతలత – డా. కొండపల్లి నీహారిణి – శ్రీమతి నెల్లుట్ల రమాదేవి
డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త. ‘మయూఖ’ అంతర్జాల ద్వైమాసిక సాహిత్య పత్రిక సంపాదకురాలు. ‘తరుణి’ స్త్రీల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు.
కవితా సంపుటులు, కథాసంపుటి, వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, యాత్రా చరిత్ర, పరిశోధన గ్రంథం, సంపాదక పుస్తకాలు వంటి 13 పుస్తకాలను ప్రచురించారు. ఇరవై సంవత్సరాలు బోధనా రంగంలో ఉద్యోగం చేశారు.

