Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

2026 పతంజలి సాహిత్య పురస్కార ప్రదానం – ప్రకటన

కె.ఎన్.వై. పతంజలి సాహిత్య పురస్కారాన్ని, 2026 సంవత్సరానికి గాను ప్రముఖ స్త్రీవాద రచయిత్రి కుప్పిలి పద్మకు అందజేస్తున్నట్లు పతంజలి సాంస్కృతిక వేదిక కార్యదర్శి తెలిపారు.

ఈ పురస్కారాన్ని పతంజలి జయంతి సందర్భంగా మార్చి 29న అందజేస్తున్నట్లు తెలియజేశారు.

పురస్కార గ్రహీత, కుప్పిలి పద్మ సాహిత్యం పైన ప్రముఖ రచయిత ఖదీర్ బాబు మాట్లాడుతారు, పతంజలి సాహిత్య పరామర్శను డా. ఆల్తి మోహనరావు చేస్తారు.

ఈ పురస్కార సభ, మార్చ్ 29 సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు విజయనగరం స్థానిక గ్రంథాలయంలో జరుగుతుంది.

సాహితీ మిత్రులందరూ ఈ సాహితీ సమావేశానికి తప్పనిసరిగా హాజరై సభను సుసంపన్నం చేయగలరని ఆకాంక్షిస్తున్నాను. ఇదే మా సాదర ఆహ్వానం. ధన్యవాదాలు.

ఎన్.కె. బాబు,

కార్యదర్శి

కె.ఎన్.వై. పతంజలి సాంస్కృతిక వేదిక, విజయనగరం.

Exit mobile version