
ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ రచనలకు పురస్కారం అందించే క్రమంలో ఈ సంవత్సరం ‘విమలా శాంతి కథాపురస్కారం’ ఉత్తమ కథాసంపుటికి ఇవ్వాలనుకొని, జాతీయస్థాయిలో కథాసంపుటాలను ఆహ్వానిస్తున్నాం.
1-7-2022 – 30-6-2026 మధ్య కాలంలో ప్రచురింపబడిన కథా సంపుటాలను, నాలుగు కాపీల వంతున,
అడవాల శేషగిరి రాయుడు,
సంగీతవాణి, 1-3-21,
రిషిత స్కూల్ ఎదురుగా,
మోతీలాల్ స్ట్రీట్,
శాంతినగర్, న్యూటౌన్,
అనంతపురం – 515004
అనే చిరునామాకు 31-7-2026 తేదీ లోగా పంపాలని కోరుతున్నాం.
డా. శాంతి నారాయణ
ఛైర్మన్
విమలాశాంతి సాహిత్య సాంఘిక సాంస్కృతిక సేవా సమితి,
ప్లాట్ నెం. 202, ఎస్.ఎస్. అపార్ట్మెంట్స్, రామ్ నగర్, అనంతపురము – 515001.
Cell: 8074974547
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
