Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అయిదు కందములు

యుక్తాయుక్తాలను గ్రహించగలిగే వివేకం ఎంత అవసరమో, భయాన్ని విడిచి తెలియని దాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, మూఢతని వీడి జ్ఞానుల సాంగత్యంలో గడపడం వల్ల లభించే ప్రయోజనాన్ని అయిదు కంద పద్యాలలో వివరిస్తున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి.

కం.
యుక్తము కానిది యెయ్యద,
యుక్తము కానిదది యేదియొ, తెలుపు సరియౌ
క్తినొసంగు వివేకము
ముక్తి నొసంగును జగతిని ముమ్మాటికినిన్.

డిగియు తెలియందగు, నీ
డుపును మొగమాటమియును ప్పున విడుమా!
విడుమిక యజ్ఞానమ్మును
డిగా జ్ఞానుల పదముల ట్టుము సుమ్మా!

గాడిద భంగిని పనులను
నేడులు గడువగ, పనితనమెంతగనున్నన్
పాడియు గాదది, జ్ఞానము
నేడుగడగ తెలియక నరుడెచ్చట నున్నన్.

చెప్పిన శ్రద్ధగ వినిననె,
ప్పున యవగతమగునను క్కని మాటన్
ప్పియు మరువగరాదది
యొప్పుగ నడవడి గలిగిన నొజ్జయు నేర్పున్.

తెలివిడి యున్ననె విషయము
తెలియును మూఢత మునుగగ తేలగ గలమే?
లువురు జ్ఞానులు జగతిని
రని తెలిసిన యడుగులు దుపగ రాదే?

Exit mobile version