Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆ క్షణాలు..!!

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘ఆ క్షణాలు..!!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

జీవిత చరమాంకంలో
వయసు ఎట్లాగూ
చెప్పిన మాట వినదు!

అలాగే
అదుపు తప్పిన మనసు
గతంలోని
మంచినీ చెడునీ కూడా
తిరగ తోడుతుంది!

అన్ని విషయాలు
సింహావలోకనం చేసుకుని
మానసికంగా
క్రుంగదీస్తుంది.. మనిషిని
స్థిమితం లేకుండా
చిత్రహింసలకు
గురిచేస్తుంది..!

వర్తమానాన్ని
భవిష్యత్తును
భూతద్దంలో
భయంకరంగా చూపించి
మనోవ్యాధికి
మారాకు వేస్తుంది!
మరి.. ఎలా?
దీన్ని తట్టుకోడం?

మనకు మనమే
దీన్ని అధిగమించాలి
క్షణం తీరికలేకుండా
మనసును మనవైపుకు
తిప్పుకోవాలి..!
మనసులోకి
మరోటి చొరబడకుండా
వర్తమానంలో
ఆనందంగా సాగిపోవాలి!!

Exit mobile version