Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆహారో హి ప్రాణాధారః

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆహారో హి ప్రాణాధారః’ అనే రచనని అందిస్తున్నాము.]

గవద్గీత 15వ అధ్యాయం, 14వ శ్లోకం

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్॥

“ఓ అర్జునా, ప్రాణుల దేహంలో వుండే జఠరాగ్నిని నేనే. నేనే జీవులు సేవించే ప్రాణాపాన వాయువులతో కూడి నాలుగు విధాలైన ఆహారమును పచనం చేస్తున్నాను” అని పై శ్లోకం భావం.

జీవులు సేవించే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉదరములో జఠరాగ్ని అనబడే అగ్ని వుంటుందని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది.

జఠరాగ్ని అనేది మన జీర్ణవ్యవస్థలో పనిచేసే ముఖ్యమైన శక్తి. ఇది ఆహారాన్ని జీర్ణం చేసి, పోషకాలను శరీరానికి అందించే మూలాధారం. ఆయుర్వేదం ప్రకారం జఠరాగ్ని సమతుల్యత ఆరోగ్యానికి ప్రధాన కారణం. జఠరాగ్ని బలంగా ఉన్నవారికి మంచి ఆకలి, శక్తి, ఉత్సాహం ఉంటాయి. జఠరాగ్ని బలహీనమైతే అజీర్ణం, వాయువు, అలసట, రోగాల పుట్టుకకు అవకాశం ఉంటుంది. సమయానికి భోజనం చేయడం, మితాహారం, శుద్ధమైన ఆహారం, మానసిక శాంతి కలిగి ఉండటం ద్వారా జఠరాగ్ని సమతుల్యతను కాపాడుకోవచ్చు.

ఆ అగ్ని తగిన మోతాదులో ప్రజ్వరిల్లినప్పుడు మాత్రమే జీవులకు ఆకలి వేస్తుంది. ఈ జఠరాగ్ని మోతాదు తక్కువ అయినా, ఎక్కువ అయినా అది వివిధములైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ అగ్ని భగవంతుని అనుగ్రహం వలనే కలుగుతోంది. జీర్ణ ప్రక్రియలందు భగవంతుని అనుగ్రహం లేనిదే జీవులకు అన్నం సేవించే అవకాశం కలగదు. ఈ విధంగా భగవంతుడు జీవుల ఉదరపోషణార్థం ఆహారాన్ని సృష్టించడం, వాటిని పచనం చేసేందుకు జఠరాగ్నిని ఉదరంలో సృష్టించడం వంటి కార్యకలాపాలకు కారణభూతుడవుతున్నాడు.

బృహదారణ్యక ఉపనిషత్తు కూడా ఇలా పేర్కొంటుంది:

అయం అగ్నిర్ వైశ్వానరో యో ఽయం అంతః పురుషే
యేనేదం అన్నం పచ్యతే (5.9.1)

జీవ ప్రాణులు ఆహారమును జీర్ణము చేసుకునేందుకు వాటి కడుపులో ఉన్న జఠరాగ్ని ఆ భగవంతుడే అని పై శ్లోకం భావం.

Exit mobile version