[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఆమె ఎత్తుగా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆమె మబ్బులా పట్టినప్పుడల్లా
నా మనసు పగుళ్లలో
ఆమె జ్ఞాపకాలే
బొట్లు బొట్లుగా కురుస్తాయి.
ఒకనాడు నీడనిచ్చిన
ఇంటి కప్పులా ఆమెపై
బహుశా నా పిడుగు లాంటి మాటలే
పడి ఉండవచ్చు
ఆమె కురిసి
నేను తడిసినప్పుడల్లా
నా తప్పుల్ని ఆరబెట్టుకోవడంలోనే
జీవితం ఎంతో నేర్పింది.
ఆమె ఎత్తుగా
నేను లోతట్టుగా
అంతటా ఆమెకు కనిపిస్తాను
నాకే ఎంత వెతికినా ఆమె కనిపించదు.
