[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘ఆనాటి ఉపాధ్యాయుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆనాటి ఉపాధ్యాయుడికి
అలనాటి విద్యార్థుల
పూర్వ విద్యార్థుల సమ్మేళన ఆహ్వానం
తెచ్చేను నూతనోత్సాహం
సమ్మేళన వేళ విద్యార్థుల
ఆత్మీయ పలకరింపులు
యోగక్షేమాల పరామర్శలు
జరిపిన సన్మాన సత్కారాలు
బడిలో వసతులే లేని వేళ
చేసిన నిస్వార్థ సేవా త్యాగాలకు
కాలం తెచ్చిన ఈ పూర్వ విద్యార్థుల
అపూర్వ సమ్మేళనాలు
గురువుల హృదయాలకు
ఇచ్చేను కొండంత బలం
మరువలేని వన్నె తెచ్చేను
ఉపాధ్యాయ వృత్తికి గౌరవం
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్
