Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపర ప్రారంభం – ప్రకటన

 

‘శివస్యకులమ్’, ‘మిషనరీ మాయాజాలం’, ‘కుహానా మేధో నియంతలు’, ‘గంగలో విషనాగులు’(అనువాదం) వంటి ప్రసిద్ధ గ్రంథాల రచయిత మైలవరపు వి.ఎల్.ఎన్. సుధా మోహన్ గారు సంచికకు ప్రత్యేకంగా వ్రాస్తున్న వ్యాస పరంపర ‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’.

భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు క్రైస్తవులు, 800 సంవత్సరాల పాటు ముస్లింలు ఏలారన్న విషయం అతి స్పష్టం. హిందువులపై ఈ పాలనల ప్రభావాన్ని లోతుగా పరిశోధించి, పరిశీలించకుండా నేటి సమాజంలో హిందువుల మధ్య నెలకొన్న పరిస్థితులకు మాత్రం హిందూయిజాన్ని దోషిగా చాలామంది చూపుతున్నారు. ఆయా విదేశీపాలనల పర్యవసానాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం నేటి స్థితిని తీసుకొని దానిని పూర్వకాలానికి వర్తింపజేయడం సరికాదు. ఇది ప్రస్తుతం గురించి, గతం గురించి సరైన అవగాహనను కలుగజేయదు సరికదా అనేక అపోహలకు దారితీసి భవిష్యత్తును అంతర్గత కలహాలతో, రక్తపాతంతో నింపే శక్తికలిగినది. ఆ అపోహల మూలాలలో ఉన్న కొన్ని వర్గీకరణలను ఎవరు ఎప్పుడు వ్యవస్థీకృతం చేశారో, ప్రాచుర్యంలోకి తెచ్చారో ఈ వ్యాసాల ద్వారా తెలుసుకోవచ్చు.

~

ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపర

సంచికలో..

త్వరలో ..

చదవండి.. చదివించండి..

~

రచయిత మైలవరపు వి.యన్.యల్. సుధామోహన్ గారు ఒక పరిశోధనాత్మక రచయిత. ఆయన వృత్తి రీత్యా వైమానిక రంగంలో పనిచేస్తున్నా, ప్రవృత్తి రీత్యా ధార్మిక సిద్ధాంతాలను, దర్శనశాస్త్రాలను నేర్చుకుంటున్న నిత్య విద్యార్థి, వాటితోబాటుగా పాశ్చాత్య భావదాస్య విముక్తిపై (De-colonization) కూడా అధ్యయనం చేస్తున్నారు. భారతదేశం ధార్మిక నాగరికతగా కొనసాగాలని, భారతీయులందరూ ఆర్షపరంపర ద్వారా లభించిన జ్ఞానామృతాన్ని గ్రోలాలన్నదే ఆయన ఆకాంక్ష.

Exit mobile version