[‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపరని అందిస్తున్నారు శ్రీ మైలవరపు సుధా మోహన్.]
కుడి-ఎడమకులాలు-వర్గపోరాటాలు:
పంచములు-బహిష్కృతులు-వెలివేయబడిన వారి గురించిన చర్చలో అందరూ తరచూ కులాలకు లేదా కాస్ట్ వర్ణనకు మాత్రమే పరిమితమవుతారు. కానీ పై వర్గాలు పూర్వం ఇతరులు తమ హక్కులను ఆక్రమించినప్పుడు పెద్ద పెద్ద గొడవలు చేసేవారని, ఆ గొడవల వలన సమాజమే స్తంభించి పోయేదని, అతి కష్టం మీద ఆ గొడవలను నియంత్రించాల్సి వచ్చేదని, ఈ గొడవలు చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయని, దీనివలన దక్షిణాది సమాజంలో అశాంతి నెలకొందని కేవలం పాశ్చాత్యులు మాత్రమే కాదు, దక్షిణాదివారు కూడా అప్పటి గ్రంథాలలో వ్రాసారు. ఆ వైనాన్ని చూద్దాం.
బ్రిటిష్ పూర్వపు దక్షిణభారతసమాజం కుడి-ఎడమ కులాలనే వర్గీకణతో ఉండేది. ఈ కుడి ఎడమ చేతి కులాలను తమిళంలో “వలంగై”,”ఇడంగై” అని, దక్షిణ కర్ణాటకలో “బలగేయ్”, “ఎడగేయ్” అని వ్యవహరిస్తారు (62). బళ్లారిలో ఈ విభజనను దవచారి మరియు దౌవాంగ అని పిలుస్తారని బ్రిటిష్ వారు వ్రాసారు (63). ఇందులో ఉండే జాతులు ఎప్పుడూ పరస్పరం తమలో తాము గొడవలు పడేవారని, వీరి గొడవలతో దక్షిణాది సమాజంలో తీవ్రమైన హింస నెలకొని ఉండేదని చాలామంది భారతీయులు, మిషనరీలు వ్రాసారు. ఈ కుడి-ఎడమ వర్గీకరణలు ధర్మశాస్త్రాలు ఏర్పరచినవి కావు. వీటిలో అస్పృశ్యులు-స్పృశ్యులు ఒకే వర్గంలో ఉండటాన్ని (64), ఒకరినొకరు కాపాడుకోడానికి ప్రయత్నించడాన్ని, ఒకరితోడుగా మరొకరు నిలబడటాన్ని స్పష్టంగా గమనించవచ్చు (65). కానీ బ్రిటిష్ పాలనలో ఆ వర్గాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. తమ వర్గీకరణల ద్వారా బ్రిటిష్ వారు హిందూ సమాజాన్ని స్పృశ్యులు-అస్పృశ్యులు అనే ద్వంద్వంగా చీల్చారు.
మరొక ముఖ్యవిషయమేమిటంటే హిందువులను విభజించాలని ఎప్పటినుండో మిషనరీలు-బ్రిటిష్ పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఆ అంశం1854 టార్చర్ కమీషన్ రిపోర్టులో స్పష్టంగా ప్రస్తావించబడ్డది. భారతీయులను అణచివేయబడినవారు, అణచివేసినవారు అనే రెండు వర్గాలుగా విభజించాలని ఒక జడ్జి చెప్పినట్లుగా ఈ రిపోర్టు పేర్కొన్నది (66). హిందువులను ఈ ద్వంద్వంలో ఇరికించడానికి పాశ్చాత్యులు ఎప్పటినుండో కృషిచేస్తున్నారని వారి గ్రంథాలే సూచిస్తున్నాయి.
ఈ విభజనకు చెందిన వివరాలు 1871 మద్రాస్ సెన్సస్ రిపోర్టు (67), 1877 మైసూర్, కూర్గ్ గజెటీర్ (68), 1885 మద్రాస్ అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్, 1891 మద్రాస్ సెన్సస్ రిపోర్టు (69) మొదలైన బ్రిటిష్ రిపోర్టులలో లభిస్తాయి (70). ఈ వర్గీకరణకు చెందిన పట్టికలు, వివరాలు ఫ్రాన్సిస్ బుకానన్ గ్రంథంలో (71), JSF మెకంజీ వ్యాసంలో (72) కూడా లభిస్తాయి.
బ్రిటిష్ ప్రభుత్వం జిల్లాలవారీగా భారతీయ ప్రజల గురించిన అనేక వివరాలు సేకరించి వాటిని ఆ జిల్లా మాన్యువల్ గా తయారు చేయించింది. అలాంటి కొన్ని మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన మాన్యువల్స్ లో కూడా కుడి ఎడమ విభజన గురించిన వివరాలు కనిపిస్తాయి. 1873లో నెల్లూరు జిల్లా కలెక్టర్ జాన్ ఏ.సి. బాస్వెల్ (John A.C. Boswel) ఇచ్చిన వివరాలు తెలుగు ప్రాంతంలో ఈ కుడి, ఎడమ వర్గీకరణను ధృవీకరిస్తున్నాయి (73). 1885 లో కర్నూల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ నరహరి గోపాలకృష్ణమచెట్టి, హిందువులలో బ్రాహ్మణులు తప్ప మిగతావారందరు కుడి, ఎడమ విభజన కిందకు వస్తారని పేర్కొన్నాడు (74).
18వ శతాబ్దపు చివర్లో దక్షిణాదిలో నివసించిన ఫ్రెంచ్ మిషనరీ అబ్బీ దుబాయిస్ (అబ్బి దుబ్వా-Abbe Dubois) గ్రంథపు రెండవ ముద్రణలో శూద్రులలోని కుడి-ఎడమ కులాలకు గొడవలు వర్ణించబడ్డాయి. పరియాలు కుడిచేయి విభాగానికి బలమైన గోడలాంటి వారనీ, వీరిని కుడిచేతి కులాల మిత్రులు అని సంబోధిస్తూ ఉంటారనీ, ఇక ఎడమచేతి వర్గంలో పాంచాలులు (5 చేతి వృత్తి కులాలు), చక్కిలియన్(తోలు పని చేసేవారు) మరికొన్ని కులాలు ఉంటారని పేర్కొన్నాడు. ఈ రెండు వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతాయని, అప్పుడు మధ్యవర్తిత్వం కోసం తటస్థంగా ఉన్న బ్రాహ్మణులను పిలుస్తుంటారని తెలిపాడు. ఈ గొడవలు ప్రధానంగా గౌరవాలకోసం జరుగుతాయని. అలా మొదలై అన్ని చోట్లకు వ్యాపించి తీవ్ర రక్తపాతానికి దారితీస్తాయని తెలిపాడు. ఒక సందర్భంలో హక్కులేని వ్యక్తి తలపాగాలో ఎర్ర రంగు పూలు పెట్టుకున్నందుకు తీవ్రమైన గొడవలు రేగాయని తెలిపాడు (75).
ఈ కుడి-ఎడమ కుల ఘర్షణల గురించి తెలుగువాడైన ఏనుగుల వీరాస్వామయ్య గారు 1830 దశకంలో వ్రాసారు. ఇందులో ఈ రెండు వర్గాల వారు వేరువేరు దేవుళ్ళను, వేరువేరు మతాచారాలను కలిగి ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవారని పేర్కొన్నారు (76). ఈ గొడవల గురించి గద్యచింతామణి అనే గ్రంథంలో 1842 నాటి వివరాలు లభిస్తాయి (77). (“యా జిల్లాలో నేమి యితరజిల్లాలో నేమి కుడియెడమ కులాలవారిలో కులాలవిషయమై స్వల్పసంగతులను గురించి గొప్ప కలతలున్ను ప్రాణహానిన్ని సంభవిస్తూ వున్నది గనుక యీలాగంటె దుర్మార్గములు జరగకుండా యే ప్రకారం జరిగిస్తే నిలచిపోతవో అందునగురించి ఆవలంబించ వలశిన యుక్తమయిన మార్గమును గురించి నా అభిప్రాయమున్ను ప్రతికులస్తులలో ముఖ్యమయిన వార్ని పిలివించి వారికి యేయే మర్యాదలు యేమేమి బిరుదులు జరగవలసినవో ఆబిరుదులు వారికి యేవిధంగా రాబడ్డవో అలాగంటె బిరుదులు అన్నిన్ని జరిగించే పక్షము వచ్చే లాభమేమో నిలిపివేసే పక్షముకు సంభవించే చెరుపు యేమో వారిని విచారించి జమిరుచేసెదనిన్ని”..)
మెకెంజి వివరాలు ఈ గొడవలు చోళుల కాలం నుండీ ఉండేవని సూచిస్తున్నాయి. ఆ వివరాలలో వర్తకం చేసే రెండు కులాల మధ్య ఎవరు గొప్ప అనే గొడవ మొదలయింది. ఈ గొడవ వలన సమాజం రెండు వర్గాలుగా చీలింది. గొడవల వలన అలిగిన ఒక వర్గం వర్తకాన్ని ఆపేయగా చోళ రాజు జోక్యం చేసుకుని, వారికి కాంచీపురం కామాక్షమ్మ వద్ద సంధి కుదిర్చి, అమ్మవారి ముందు ప్రమాణంచేయించాడని ఉంది (78). 1807 లో ఈ కుడి, ఎడమ చేతి వర్గాల మధ్య హెగ్గేదేవనకోట ప్రాంతంలో గొడవ జరిగినప్పుడు, అప్పటి కలెక్టర్ సమక్షంలో కాంచీపురంలో ఈ రెండు వర్గాల మధ్య రాజీ చేశారు. కలెక్టర్ కోల్మన్, దనపన్ శెట్టి సమక్షంలో జరిగిన ఒప్పందంలో వివిధ నాడు-దేశద కులాలకు ఇచ్చిన వివిధ గౌరవాల గురించి ప్రస్తావన ఉంది (79). ఫ్రాన్సిస్ బుకానన్ ఎడమచేతి వర్గం వారు ఆ హక్కులు తమకు కాళికాదేవి ఇచ్చినట్లుగా వాదిస్తారని తెలిపాడు (80). పై వివరాలలో ఈ కుడి-ఎడమల చరిత్రలో తరచూ కాళికాదేవి ప్రస్తావన కనపడటం గమనార్హం.
1868 లో మదురై మాన్యువల్ ని వ్రాసిన నెల్సన్ ఈ కుడి, ఎడమ వర్గాలకు తీవ్రమైన గొడవలు జరిగేవని, ఈ మధ్యకాలంలో బ్రిటిష్ వారి ప్రాబల్యం వలన ఈ గొడవలు తగ్గిపోయాయని, ఈ గొడవలు అంతరించడానికి బ్రిటిష్ వారు బలంగా కృషి చేశారని పేర్కొన్నాడు (81). బ్రిటిష్ వారు ఈ గొడవలను అరికట్టడానికి అవలంబించిన విధానాలను, వాటి పరిణామాలను లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఒకవేళ ఆ పద్దతులను హిందూ పాలకులు ఆయా కులాల పట్ల చూపడం ఆయా కులాలకు అంగీకారమా కాదా అన్న ప్రశ్నకు కూడా సమాధానాన్ని రాబట్టాలి (82).
వివిధ రిపోర్టులు, వ్యక్తులు వ్రాసిన వ్యాసాలలో దక్షిణాదిలోని అన్ని ప్రాంతాలలోనూ పాంచాలులు, చర్మకారులు ఎప్పుడూ ఎడమ వర్గంలో ఉండగా, వ్యవసాయ సంబంధ కులాలు, పరియాలు కుడిచేతివర్గంలో ఉండేవి. వీరందరూ కుడి ఎడమ వర్గాల మధ్య తరచూ ఘర్షణలు జరిగేవని తెలిపారు. ముఖ్యంగా పరియా కులంవలంగై మట్టార్ అనగా కుడిచేతి వర్గపు స్నేహితులుగా పేర్కొనబడ్డారు. తెలుగు ప్రాంతాలలో వారు నియోగులకు, గ్రామపెద్దలకు, మహానాటివారికి మిత్రులుగా ఉండేవారు. దీనిని మార్క్సిస్టుల భాషలో చెప్పాలంటే బ్రిటిష్/మార్క్సిస్టుల ద్వారా అణచివేయబడిన వారు అణచివేసినవారుగా గుర్తించబడిన వర్గాల వారిరువురూ స్పృశ్యులు, అస్పృశ్యులు కలిసి వేయి సంవత్సరాలకు పైగా ఒకేవర్గంలో ఉండి ఒకరికొకరు సహాయం చేసుకునేవారని పాశ్చాత్యుల రిపోర్టులే స్పష్టంగా చెబుతున్నాయి. అస్పృశ్యులు అని బ్రిటిష్ వారు చేసిన వర్గీకరణలలోని వర్గాలు పరస్పరం గొడవలు పడుతూ దక్షిణాది సమాజంలో తీవ్రమైన అశాంతికి కారణమయ్యేవారని వారి రిపోర్టులే స్పష్టంగా చూపుతున్నాయి. కుడి-ఎడమ చేతి కులాలకు ప్రత్యేక వీధులుండేవని, ఆ వీధులలోనుండీ ఇతర వర్గాలకు చెందిన జాతులు పోతే గొడవలు చెలరేగేవని కూడా పూర్వపు గ్రంథాలలో ఉంది.
ఈ వివరాలు బహిష్కృతులు/వెలివేయబడిన వారు/పంచములు గా వర్గీకరించబడిన జాతులు గుర్రాలను ఎక్కి ఊరేగేవారని, అలా చేయడాన్ని ఆ బహిష్కృతులు/వెలివేయబడిన వారు/పంచములు గా వర్గీకరించబడిన వారిలో మరికొందరు ఆక్షేపించేవారని, మొత్తం దక్షిణాది సమాజంలో ఆయా వర్గాల మధ్య తమకున్న బిరుదులు, ప్రత్యేక అధికారాల మధ్య పోటీ ఉండేదని, వాటి కోసం వారందరూ కొట్టుకునేవారని, మధ్యవర్తిత్వం కోసం బ్రాహ్మణులను పిలిచేవారని తెలియజేస్తున్నాయి. కొన్ని బిరుదుల/గౌరవాల కోసం రక్తపాతాన్ని సృష్టించగలిగి, సమాజాన్ని స్థంభింప చేయగలిగినవారు బహిష్కృతులు/వెలివేయబడిన వారెలా అవుతారు?
పై వివరాలు హిందూసమాజంలో కులాల కుమ్ములాటలు ఉండేవని, కానీ అవి నేడు మనం చూస్తున్న వర్గీకరణలు, అంశాల ఆధారంగా జరిగేవి కావని, అన్ని కులాలు అందరినీ తాకకపోయినా వారు సమాజం నుండి బహిష్కృతులు కారని, సమాజరక్షణలో లేదా వివిధ జాతుల హక్కులను కాపాడటంలో బహిష్కృతులుగా ముద్రవేయబడిన వర్గాలు కీలకంగా ఉండేవారని, కానీ ఈ పద్ధతులన్నీ బ్రిటిష్ పాలనలో మార్చబడ్డాయని, నేడు మనం చూస్తున్న సమాజం పూర్వం వేరే రకంగా ఉండేదని, దానిని సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా మనం చేసే ఏ సంస్కరణ అయినా అది మన నాగరికతకు దీర్ఘకాలిక నష్టాలను కలుగజేస్తుందని చూపుతుంది. అలాంటి నష్టాలకు ఉదాహరణగా బ్రిటిష్ వారు సృష్టించిన స్పృశ్యులు-అస్పృశ్యులు అనే వర్గీకరణను చెప్పుకోవచ్చు.
గౌరవాలు, హక్కులు, ఆచారాల ఆధారంగా ఈ వర్గాల మధ్య ఘర్షణలు జరిగినప్పటికీ, అప్పటి సమాజం పూర్తిగా స్పృశ్యులు–అస్పృశ్యులు అనే ద్వంద్వంగా విభజించబడలేదు. కానీ నేటి సమాజంలోని వర్గీకరణలు పూర్తిగా మార్చబడ్డాయి. పూర్వపు జాతి-కుల అస్తిత్వాల ఆధారంగా పాశ్చాత్యులకు, విదేశీయులకు అనుకూలమైన నూతన వర్గీకరణలు సృష్టించబడ్డాయి. బ్రిటిష్ వారి ద్వారా అస్పృశ్యులుగా ముద్రవేయబడినవారి గతం ఆయా కాలాలలో వారి హక్కులను కాపాడుకోవడం కోసం తీవ్రమైన హింసకు వెనుకాడని వారిగా చూపుతుంది. కానీ బ్రిటిష్ వారు ప్రాచుర్యంలోకి తెచ్చిన వర్గీకరణలు మాత్రం సమాజాన్ని స్పృశ్యులు-అస్పృశ్యులు అనే ద్వంద్వంలోకి ఇరికించి, వారిని అణచివేయబడ్డవారిగా చిత్రించాయి. ఈ ఆధారాలను జాగ్రత్తగా గమనిస్తే నేడు అణచివేయబడిన వర్గాలని పాశ్చాత్యులు, కమ్యూనిస్టులు చెబుతున్న జాతులు గతంలో ఒక వర్గం, మరో వర్గాన్ని అణచివేసిందని, ఈ ప్రయత్నం రెండువైపులా సాగిందని సూచిస్తాయి. బ్రిటిష్ వారు, కమ్యూనిస్టులు సృష్టించిన నేటి వర్గీకరణలో ఒకప్పటి అణచివేసిన వర్గం-అణచివేయబడిన వర్గం కలిపివేయబడ్డాయి. ఇలా ప్రస్తుత హిందూ సమాజం పూర్తిగా పాశ్చాత్యులకు అనుకూలంగా వర్గీకరించబడి, ఆ ఆస్తిత్వాల ఆధారంగా హిందూ సమాజం ఒక యుద్ధరంగంగా మార్చబడ్డది.
వృత్తులలో భాగంగానే ఊరిబయట ఉంచబడ్డారా?
మునుపటి భాగాలలో పేర్కొనబడిన వివరాలు ఊరిబయట ఉండటానికి గల స్పష్టమైన కారణాలు వివరించడం లేదు. దీని అర్థం మనం సరైన చోట వెతకకపోవడం కూడా కావచ్చు. ఉదాహరణకు, కొన్ని జాతులను ఊరిబయట ఉంచే అమరిక గురించి కౌటిల్యుని అర్థశాస్త్రం ఇలా చెబుతున్నది, “సరిహద్దులలో సరిహద్దులు రక్షించే (అంతపాల) దుర్గాలు స్థాపించాలి. అవి జనపదంలోనికి ప్రవేశించడానికి ద్వారాలుగా ఉంటాయి. వాటికి అంతపాలుడు అధ్యక్షుడుగా ఉంటాడు. ఒక అంతపాలదుర్గానికీ మరొక అంతపాలదుర్గానికీ మధ్య నున్న ప్రదేశాన్ని వాగురికులు (పాశాలు – ఉచ్చులు – ఒగ్గి మృగాలను పట్టేవాళ్లు), శబరులు, పులిందులు, చండాలులు, అరణ్యంలో నివసించేవాళ్లు రక్షిస్తూ ఉండాలి. అనగా అంతపాలులు వీళ్ల సహాయంతో ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉండాలని” కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతున్నది (83). పై వర్ణనలో అంతపాల, అంటే రాజ్యం చివరిభాగాన్ని రక్షించేవాడని అర్థం. ఇక్కడ కూడా ‘అంత’ అన్న పదం చివరి భాగాన్ని లేక సరిహద్దును సూచిస్తున్నది. దీనినే గ్రామానికి అన్వయిస్తే, గ్రామ సరిహద్దులను కాపలాకాసేవాడు అని అర్థం.
అర్థశాస్త్ర దృష్టికోణంతో చూస్తే కొన్ని జాతులు ఊరిబయట ఉండటానికి రక్షణాపరమైన కారణాలున్నాయని తెలుస్తుంది. చారిత్రిక ఆధారాలు కూడా ఈ అభిప్రాయానికే మద్దతిస్తున్నాయి. ఎందుకంటే చారిత్రిక ఆధారాలు పలు జాతులను గొప్ప సైనికులుగా వర్ణించాయి. 12వ శతాబ్దానికి చెందిన పల్నాటి కథలో మాల కన్నమదాసు, బ్రహ్మనాయుడికి సైన్యాధ్యక్షుడిగా పనిచేసాడన్న విషయం తెలుగు వారందరికీ సుపరిచితం. 11వ శతాబ్దపు శాసనాలలో కూడా ఈ జాతులు సైనికులుగా పనిచేసేవారని ఉంది (84). చర్మకారజాతికి చెందినవారు గొప్ప సైనికులని, పలువురు పాలేగాళ్ల కింద సైన్యంలో పనిచేశారని 17వ శతాబ్దపు బ్రిటిష్ రిపోర్టులు (85), 1649 నాటి అబ్రహం రోజేరియస్ వంటి పాశ్చాత్యులు పేర్కొన్నారు (86). తమిళనాటి ప్రజలు నేటికీ అరుంథతియార్ సముదాయానికి చెందిన ‘ఒండివీరన్ పగడై’ అనే సైన్యాధ్యక్షుడికి నివాళులు అర్పిస్తారు (87). ఈయన సుమారు క్రీ.శ. 1750 ప్రాంతంలో తమిళనాడులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన నేర్కట్టుంసేవళ్ ప్రాంతానికి పాలయకారుడైన పులి తేవర్ కు సేనాధిపతిగా ఉన్నాడు. పరియాజాతి కూడా గ్రామాలను కాపలా కాసే పోలీసు వృత్తి చేసేవారని కూడా పలు గ్రంథాలలో ఉంది (88). ఇవి రెండూ రక్షణావ్యవస్థకు చెందిన వృత్తులు. ఈ కోణంలో చూస్తే పాశ్చాత్యుల ద్వారా ‘బహిష్కృతుడు’/‘వెలివేయబడిన’ వారుగా ముద్రవేయబడిన వారు, అప్పటి వాస్తవంలో మన దేశాన్ని, గ్రామాన్ని రక్షించే వృత్తులు కూడా చేసేవారు. ఇలా కేవలం దక్షిణాదిలో మాత్రమే కాదు, ఉత్తరాదిలో కూడా పలు జాతులు జగ్లాలుగా పనిచేసేవారు.
అర్థశాస్త్రంలో చెప్పబడిన వృత్తులు ధర్మశాస్త్రాలలో కూడా కనబడుతాయి. అర్హతులు, బౌద్దులకు చెందిన సమూహాలను సంఘ అనీ, చండాల, శ్వపచులకు చెందిన వర్గాలను గుల్మాలు అంటారని కాత్యాయన స్మృతి చెబుతున్నది. (అర్హత సౌగతానాం తు సమూహః సంగ ఉచ్యతే చాణ్డాలశ్వపచాదీనాం సమూహో గుల్మ ఉచ్యతే -681) (89) మనుస్మృతిలో కూడా గుల్మాల గురించి ఉంది. (ద్యయోస్త్రయాణాం పంచానాం మధ్యే గుల్మమధిష్టితమ్ తథా గ్రామశతానాంచ కుర్యాద్రాష్టస్య సంగ్రహమ్ గ్రామస్యాధిపతిం కుర్యాద్దశ గ్రామపతిం తథా, వింశతీశం శతేశం చ సహస్ర పతి మేవ చ 7-114,115) ‘రెండు, మూడు లేక ఐదూళ్ళ మధ్య కావలివారి గుంపు నేర్పరచాలి. అట్ల ప్రతి గ్రామమునకు గ్రామపతిని పదిగ్రామాలకు దశగ్రామ పతిని ఇరువై గ్రామాలకు వింశతీశుని నూరు గ్రామాలకు ఒక పర్యవేక్షణాధికారి చొప్పున ఎర్పరచి రాజ్యాన్ని వృద్ధి చేయాలి.’ (90)
చండాలురు గుల్మాలతో సంబంధాన్ని కలిగి ఉన్నారన్నది నిశ్చయం. ఇతిహాస గ్రంథాలలో గుల్మాలు సైన్యంతో, రక్షణవ్యవస్థతో అనుసంధానమై కనిపిస్తాయి. అలాగే మహామహోపాధ్యాయ ఆచార్యపుల్లెల రామచంద్రుడు గారు తెలుగులోకి అనువదించిన ‘కౌటిలీయమ్ అర్థశాస్త్రమ్’ అనే గ్రంథపు అనుబంధంలో గుల్మ అనే పదానికి రాజభట స్థానము లేదా Police Station అనే అర్థం ఇవ్వబడ్డది (91). వామపక్ష చరిత్రకారుడైన వివేకానంద ఝా గారు, D.D కోసంబి అనే చరిత్రకారుడు గుల్మము అంటే పోలీసులు ఉండే స్థానము అనీ, వీరు జనపదాల్లో ఉంటూ గ్రామాలను కాపాడుతారని పేర్కొన్నాడు. R.S శర్మ అనే చరిత్రకారుడు గుల్మము అనే పదం పోలీసు వ్యవస్థకు, మిలిటరీ వ్యవస్థకు చెందినదని వివరించాడని తన గ్రంథంలో పేర్కొన్నారు (92).
దక్షిణాదిలో వీరు నివసించే పలు ప్రదేశాలకు పాళెం అనే పేరు ఉంది (93). చరిత్రనుబట్టి చూస్తే ‘పాళెం’ అంటే దండు దిగిన ప్రదేశం అని లేదా సైన్యం నివసించే ప్రదేశం అనీ, పాళెగాడి ఆధీనంలో ఉండే ప్రదేశమనే అర్థాలు కూడా ఉన్నాయి (94). వీరు నివసించే ఈ ప్రదేశాలు ఊరిబయట ఉన్నా కూడా ఆ ప్రాంతాలను పాళెం అని నేటికీ పిలుస్తారు. ఈ రకమైన సంబోధన కూడా సైన్యంతో వారికి గల సంబంధాన్ని సూచిస్తుంది.
పూర్వపు గ్రంథాలు కూడా సైనికులు, యామికులు ఊరిబయట ఉండేవారని సూచిస్తాయి. ఏ విధంగా నేడు సెక్యూరిటీ విభాగంలో పనిచేసేవారు, ఆయా కార్యాలయాల వెలుపల, ఆయా ప్రాంతాల సరిహద్దులలో కాపలాకాస్తున్నారో, అదే విధంగా పూర్వం గ్రామాలను కాపలా కాసేవారు ఆ గ్రామాలను చూసే విధంగా ఉండాలనే నియమం ఉంది (95). కాకతి ప్రోలరాజు కాలంలో కొన్ని కులాలను సైన్యంలోకి తీసుకొని వారిని ఊరిబయట కాపలాగా ఉంచారని కొన్ని గ్రంథాలలో ఉంది. దీని గురించి శ్రీ వేదుల సూర్యనారాయణశర్మ గారు 1962 లో ‘కాకతి ప్రోలరాజు’ అనే గ్రంథంలో వ్రాసారు (96).
క్రీడాభిరామంలో పేర్కొనబడిన మోహరివాడ అన్న పదానికి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ‘Military Cantonment వంటిది’ అనే అర్థాన్ని వ్రాసారు (97). ఆచార్య ఎన్.జి. రంగా గారి గ్రంథపు తెలుగు అనువాదంలో ‘సైనికుల వీధి’ అనే అర్థం ఇవ్వబడ్డది (98). మహారాష్ట్రలో మహర్వాడ ఉంది, ఇందులో మహర్ జాతి వారుంటారు. మహర్లు తలారులుగా/గ్రామకాపలాదారులుగా పనిచేసేవారు. వీరు గ్రామాల బయట నివసిస్తూ గ్రామాలను కాపలాకాసేవారు. వీరికి సుమారు వెయ్యి సంవత్సరాలనుండీ 52 హక్కులు ఉండేవి. వీటి గురించిన శాసనాలు ఉన్నాయి. ఆ వివరాలు అంబేద్కర్, కాంబ్లే ఇత్యాదుల రచనలలో లభిస్తాయి.
ఈ జాతుల అభ్యున్నతికోసం హిందూ సమాజాన్ని తీవ్రంగా విమర్శించిన అంబేద్కర్ గారు కూడా ఈ జాతుల గత సైనిక చరిత్ర గురించి లోతుగా పరిశోధించి విశ్లేషించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హిందువుల చరిత్రను వక్రీకరించిన జేమ్స్ మిల్ ప్రభావం అంబేద్కర్ గారిపై స్పష్టంగా కనిపిస్తుంది. జేమ్స్ మిల్ ఊహించిన విధంగా (99) ఇతర ప్రాచీన సమాజాల మాదిరిగానే హిందూ సమాజం సంచార జాతులతో నిండి ఉండేదని అంబేద్కర్ గారు నమ్మారు. దాంతో ఆ ఊహను హిందువులకు కూడా వర్తింపజేసి, హిందూ సమాజంలో స్థిరపడిన తెగలు, యుద్ధంలో ఓడిపోయి చెల్లాచెదురైన దళిత తెగలు అని రెండు వర్గాలు ఉండేవని ప్రతిపాదించారు. జేమ్స్ మిల్ యొక్క ఈ ఊహే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి కూడా భూమికగా మారింది. సంచారజాతులనుండి రక్షణ కోసం ఆ దళిత తెగలను స్థిరపడిన తెగలు ఉపయోగించుకున్నాయని, ఆ సందర్భంగా వారిని ఊరికి వెలుపల ఉంచారని ఊహించాడు. పైగా మహాభారతం శాంతి పర్వం (109.9)లో అంత్యులను గూర్చిన ప్రస్తావన ఉందని, అందులో వారు సైనికులుగా పేర్కొనబడ్డారని కూడా పేర్కొన్నాడు. కానీ ఈ అంశాన్ని లోతుగా పరిశీలించలేదు. అహింసను ప్రబోధించిన బౌద్ధం, భారతీయరక్షణా వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని చరిత్రకారులు చెబుతారు. రక్షణావ్యవస్థలో పని చేసిన నిమ్నవర్గాలపై దాని ప్రభావం ఎలా ఉండేదోనన్న పరిశోధన నేటికీ జరుగలేదు!
ఆయన రక్షణావ్యవస్థకు చెందిన అంశాలను అక్కడక్కడా ప్రస్తావించినా, వాటిని కౌటిల్యుని అర్థశాస్త్రం వంటి శాస్త్రాలతో, హిందూ చరిత్రతో పోల్చిచూడలేదు, సరికదా, వాటిని తాను ముందే ఊహించిన జేమ్స్ మిల్ వంటి పాశ్చాత్యులు ప్రచారం చేసిన స్థిరపడిన తెగలు-యుద్ధంలో ఓడిపోయి చెల్లాచెదురైన తెగలు అనే సిద్ధాంతంలోకి ఇరికించాడు (100). దీంతో అసలు అంశం కాస్తా మరుగున పడి, చర్చ మరో వైపుకు తిరిగింది.
ఇలా ఈయన అంత్యజులను సవర్ణ హిందువులు తమ రక్షణకోసం ఉపయోగించారని అంగీకరించారు. అంటే హిందూ సమాజాన్ని కాపాడే రక్షకులు ఈ అంత్యజులు అని చెప్పకనే చెప్పారు. హిందూ సమాజంలోకి పరాయి వారు రావాలంటే వీరిని దాటే రావాలి. మరి ఇస్లామిక్ దండయాత్రలను, క్రైస్తవ దండయాత్రలను ఎదుర్కోవడంలో అంత్యజుల పాత్ర కూడా ఉందిగా, మరి ఈ దాడులు, ఆ తరువాత వారి పాలనా విధానాలు ఈ అంత్యజులపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయోనన్న విషయాన్ని అసలు లోతుగా స్పృశించినట్లుగానే కనబడదు.
భారతీయ రక్షణా వ్యవస్థలపై దాడి గురించి శ్రీ ఖండవల్లి సత్యదేవప్రసాద్ గారు ఈ విధంగా వ్రాసారు. “మొట్టమొదటగా బ్రిటిష్ దుష్పరిపాలన వల్ల నిరాశ్రయులైన వారు స్థానిక సైనిక సమూహాలు (Local Militia), స్థానిక రక్షక ఉద్యోగాలు (Police). బ్రిటిష్ వారు తమ ఆక్రమణ వ్యూహంలో ప్రథమ చర్యగా స్థానిక రక్షక వ్యవస్థను ఎందుకు నాశనం చేశారో సులభంగా అర్థం చేసుకోవచ్చును. ఏ విదేశీ ఆక్రమణదారుకైనా ఎదురయ్యే ప్రతిఘటన ముందుగా రక్షణ వ్యవస్థ నుంచి వస్తుంది. దానిని తొలగిస్తే ఆక్రమణను అడ్డులేకుండా కొనసాగించవచ్చు. అందుకే బ్రిటిష్ వాళ్ళు ముందుగా మన స్థానిక రక్షక సమూహాలను నిరాశ్రయులను చేశారు.” (101)
శ్రీ సత్యదేవ ప్రసాద్ చెప్పింది అక్షర సత్యం. భారతదేశాన్నే కాదు ఇతరదేశాలను లేక ప్రాంతాలను ఆక్రమించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడి రక్షణా వ్యవస్థలను నాశనం చేస్తే తప్ప, వాటిని ఆక్రమించుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించడానికి పెద్ద పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. ఇది సామాన్యమైన యుద్ధనీతి. అక్షరాలా జరిగింది కూడా ఇదే. కానీ ఈ వ్యవస్థల నాశనం గురించి అతి కొద్ది గ్రంథాలలోనే చర్చించబడటం వలన, భారతీయుల చరిత్ర వక్రీకరించబడటం వలన, కమ్యూనిస్టు మేధావులు చేసిన మోసం వలన, పూర్వపు రక్షణ వ్యవస్థలో కీలకంగా పనిచేసిన కులాలలో అధికశాతం మందికి తమ గతానికి చెందిన గొప్పదనం తెలియక బ్రిటిష్ పాలనలో సృష్టించబడిన వర్గీకరణలే వాస్తవాలనే భ్రమలో ఉన్నారు.
కొందరు గ్రామం వెలుపల ఉంటూ కాపలా కాయడమనే ఏర్పాటు కనీసం 10-11వ శతాబ్దాల కాలంలో, లేదా అంతకన్నా మునుపే ఏర్పడటం వలన కొన్నికులాలు ఊరి పొలిమేరలో ఉండటం జరిగిందని, కాలాంతరంలో ఆయా కులాలు తమ వృత్తులను, ఊరి పొలిమేరలలో ఉండటానికి గల కారణాలను మరచిపోయినా చరిత్రలో ఈ వివరాలు నమోదై ఉన్నాయని పై వివరాలు సూచిస్తున్నాయి.
భారతీయ వ్యవస్థలో అన్ని ప్రాంతాల్లో ఈ విధమైన అమరిక ఉండటానికి కారణం ఆయాప్రాంతాలు అర్థశాస్త్రం ఆధారంగా పాలించబడటం వల్ల అనీ, కొన్ని జాతులు ఊరిబయట ఉండటానికి కారణం వెలివేయబడటమూ, అంటరానితనమూ కాదని, అది రక్షణావ్యవస్థకు చెందిన ఏర్పాటని కౌటిల్యుని అర్థశాస్త్రం, చారిత్రిక ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ అంశాన్ని లోతుగా పరిశోధించకుండా, ఆయా కులాలకు అంత్యజులు అంటే వెలివేయబడినవారని, అంటరానివారనే కొత్త పేర్లని ప్రాచుర్యంలోకి తేవడం మాత్రం హిందువులకు స్వాతంత్రం నిరాకరించి, విభజించి పాలించిన పాశ్చాత్యులకే లాభాన్ని చేకూర్చింది.
అందువలన అంత్యజ, అంతేవాసి అనే పదాలకు బ్రిటిష్ వారు, మిషనరీలు, వామపక్షీయులు ఊరిబయట ఉండేవారనే అర్థాన్ని సృష్టించినా, హిందూ వైదిక, తాంత్రిక గ్రంథాలలో ఆ పదాలకు వేరే అర్ధాలున్నాయని, వారు సైన్యంలో, రక్షణావిభాగంలో పనిచేసేవారని పై వివరాలు, చారిత్రిక ఆధారాలు సూచిస్తున్నాయి. అంత్యజ అనే పదాన్ని బ్రిటిష్ వారు తరచూ వినియోగించడం వల్లనే ఆ పదానికి విపరీతమైన ప్రాచుర్యం/ప్రాముఖ్యం లభించింది. దీనికి ప్రధాన కారణం హిందూ సమాజాన్ని బైబిల్ చట్రంలో, క్రైస్తవ చరిత్రలో ఇరికించి వ్యాఖ్యానించడం!(102). ఈ నేపధ్యంలో ఆయా జాతుల గురించిన వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది.
(ఇంకా ఉంది)
Footnotes:
- త్రిపురనేని వెంకటేశ్వరరావు-1992-విశ్వదాభిరాముడు వేమన-p 22-23 & T. Ananda Row-Census of India 1901 Vol.24 (Mysore)- Part1 (report)- p508-509, ‘Phanas:- In Table D, there have been tabulated the Phana divisions of the castes who have claimed that attribute. From time immemorial, the leading agricultural artisan and labouring classes of Southern India have been divided into groups known as Balagai (right hand) and Yedagai (left hand) and in this Province the parties are respectively known as 18 Phanas and 9 Phanas, the epithets “ right hand” and “ left hand ” being “ indignantly repudiated by all the superior castes on either side” (ride, page 309 of Census Report of 1891). The word ‘Phana ’ is a corruption of ‘Banaa’, the Kanarese form of the Sanskrit Verna meaning colour and used for caste, so that “ 18 Phanas ” means the group of 18 castes, and “9 Phanas” means the group of 9 castes. On the other hand, of the castes which are commonly supposed to belong to the Phana factions, several have ignored the distinction and returned themselves as belonging to no Phanas.’ H V Nanjundayya-1906-The Ethnographical Survey of Mysore-p2.& JE Padfield-The Panchamas, or the Lower Classes of South India-Aug 1900- The Church Missionary Intelligencer-Vol LI-p581 There is one great cleavage, especially, as I gather, in the Tami? Country, into the two sections of so-called right-hand and left-hand worshippers. The Hindu sects, especially those who favour Siva, are divided on the question of the mode of worshipping the active energy of the deity as personified in his wife. The right-hand section adopt what may be called the exoteric side and they worship in public, whilst the left-hand section adopt an esoteric or secret worship, into details of which it were impossible to proceed further than to say that it has been characterized as the very soul of obscenity and bestiality. The castes are divided into these two camps, and whilst the Pariahs range themselves on the right hand, the Madigas attach themselves to the left. One outcome of this division is great enmity and sometimes faction fighting that would surprise those who speak of the “mild” Hindu; and when there is fi hting to do, it is the Pariahs and Madigas who usually do it. If t e religion of the upper castes is of this nature, it is not difficult to see how very low indeed must be that of the Panchamas.
- Edward Balfour-1885-The Cyclopaedia of India and of Eastern and Southern Asia, Commercial Industrial, and Scientific Products of the Mineral, Vegetable, and Animal Kingdoms, Useful Arts and Manufactures · Vol 1-P602
- దిగవల్లి వెంకటశివరావు-మనచెన్నపట్టణము:దాని పూర్వచరిత్ర-1941-42-శివలెంక శంభుప్రసాద్(సం)- ఆంధ్రపత్రిక-వృష సంవత్సరాది సంచిక-p 119-126 కుడిచెయ్యి కులముల వారిలో చాలామంది భూస్వాములు, గ్రామ లెక్కలు వ్రాయు పిళ్లలును, కొందరు అంటరాని కులములవారును నుండిరి. ఎడమ చెయ్యి కులములలో వర్తకము చేయువారు, కులవృత్తులు చేయు పారిశ్రామికులు, తెలికల వారు, నేతగాండ్రు, తోళ్ళపని చేయువారు నుండిరి.
- Noboru Karashima-2001- History And Society In South India The Cholas To Vijayanagar-p147 -‘The Elavanasur inscription, which is dated one month later, belongs to the same region (Valudilampattu) and tells us for the first time of the involvement of sabhaiyar (Bráhmanas), which shows us two other aspects of the matter: the relations between the Valangai/Idangai groups as the lower section of society and the Brahmana kaniyalars as the landlords who controlled them: the other concerns the relations between the Valangai /Idangai groups and the Brahmana kaniyalars on one hand, and the invading rulers and their allies such as the irajagarattar, Vanniyar and jivitakkarar on the other. According to these inscriptions the kànryalars were also oppressed by the invading rulers and this explains the joint efforts of the Valangai/Idangai groups and the kaniyalars to defend themselves against the oppression.’
- Report of Commission for Investigating Alleged Cases of Torture at Madras-1855-p. 40.‘…..so much so that one judge declares the whole people are to be divided into the governing and the governed, “the oppressor and the oppressed”
- Census Report Of Madras Presidency-1871- W.R. Cornish-p130
- Mysore and Coorg Gazeteer-Vol1-Lewis Rice-p318
- Census of India 1891-Vol 13- H. A. Stuart-p280
- C.D. Maclean-1885- Manual of The Administration of The Madras Presidency Vol.1-p 69 & C.Hayavadana Rao-1927-Mysore Gazetteer Compiled for Government Volume I-Descriptive-p179-180, ‘According to one tradition, it arose from the fact of the Goddess Kali at Conjceveram placing certain castes on her right hand and certain others on her left. The parties have ever since disputed as to the relative honour accorded to each side. Mr. Rice, in the last edition of this Gazetteer, suggested that the division was apparently a comparatively modern one as no mention of it is to be found in any ancient work except for a doubtful passage in the Mahawanso, The Abbé Dubois took a similar view. Another writer puts forward the suggestion that the distinction was the creation of a Chola King. Recently, Sir Edward Gait has suggested that the division nay be a survival of a dual exogamous grouping which existed before the development of the caste system. There is also a right-hand and left-hand division of Sakti worshippers, the rites of the former being principally magical, of the latter bloody and licentions. But as pointed out by Dr. W. H. Wilson, there seems to be no connection between the cases. As the Abbé Dubois points out, the division is mainly a struggle for precedence between the artisans and the traders, or between the followers of the old established handicrafts and innovators who brought in exchange of commodities with other parts supported by producers and ministers of luxuries. Whether this is so or not, cach party undoubtedly insists on its exclusive rights to certain privileges on all public festivals and ceremonies, and it not infrequently happens that one side usurps the supposed and jealously guarded rights of the other. On such occasions, a faction fight is sure to occur.’
- A Journey from Madras-Francis Buchanan M D-Vol1-p77 & డా ఆరుద్ర-1985-మనవేమన-p 140 ‘ఎడమచేతికులాలు 1 కంచరి 2 కంసాలి 3 కమ్మరి 4. కాసే 5 దేవాంగులు 6 బేడర్లు 7 బేరి సెట్లు 8 వడ్రంగులు 9 మాదిగలు వీళ్లుకాక ఇంకో 89 కులాల వాళ్ళు ఈ వర్గంలో ఉన్నారు. మొత్తం 98 ‘జాతులవారు ఈ “ఎడమచేతి వర్గంగా ఉండడానికి ఒప్పందం చేనుకొన్నారు. కుడిచేతికులాలు 1 అద్దకంవారు 2 ఓడ నావికులు 3 ఓడ వడ్రంగులు 4 కుమ్మరులు 5 కోమట్లు 6 గొల్లలు 7 చాకళ్లు 8 జాండ్రవాళ్లు 9 జైనులు 10 పట్టుసాలెలు 11 పద్మసాలెలు 12 పల్లకీ బోయీలు 18 మంగళ్లు 14 యానాదులు 15 రెడ్లు 16 మాలలు. ఈ వృత్తులవాళ్ళే కాక భోగంవారు కూడా కుడిచేతి భోగంవారూ, ఎడమచేతి భోగంవారూ అని రెండు తెగలుగా ఏర్పడ్డారు బ్రాహ్మణులూ, సాతానులూ మొదలైనవారు తటస్టులు అయితే అధికార వర్గాన్నే బల పరుస్తారని భావించటం తప్పులేదు.’
- Indian antiquary Vol 4- 1875-Jus burges-p344-346 & The Indian Antiquary- Vol5- Jas Burgess-1876-p354) &(Ostindien seine Geschichte, Cultur und seine Bewohner, von Philipp van Mokern)
- A Manual of the Nellore District in the presidency of Madras John A.C. Boswel – p242
- A Manual of the Kurnool District in the presidency of Madras- N.G.Chetty- p141,224
- Abbe J.A.Dubois- Henry Beauchamp (Ed)-2nd ed-1899-Hindu Manners, Customs-p25-27 To the Right-hand faction belong most of the higher castes of Sudras. The Pariahs are its chief support, as a proof of which they glory in the title Valangai-Mougattar, or friends of the Right-hand. In the disputes and conflicts which so often take place between the two factions it is always the Pariahs who make the most disturbance and do the most damage. The Brahmins, Rajahs, and several classes of Sudras are content to remain neutral, and take no part in these quarrels. They are often chosen as arbiters in the differences which the two factions have to settle between themselves. ………….When one faction trespasses on the so-called rights of the other, tumults arise which spread gradually over large tracts of territory, afford opportunity for excesses of all kinds, and generally end in bloody conflicts. The Hindu, ordinarily so timid and gentle in all other circumstances of life, seems to change his nature completely on occasions like these. There is no danger that he will not brave in maintaining what he calls his rights, and rather than sacrifice a tittle of them he will expose himself without fear to the risk of losing his life. I have several times witnessed instances of these popular insurrections excited by the mutual pretensions of the two factions and pushed to such an extreme of fury that the presence of a military force has been insufficient to quell them, to allay the clamour, or to control the excesses in which the contending factions consider themselves entitled to indulge……. ..I once witnessed a dispute of this nature between the Pariahs and Chucklers, or leather-workers. There seemed reason to fear such disastrous consequences throughout the whole district in question, that many of the more peaceful inhabitants began to desert their villages and to carry away their goods and chattels to a place of safety, just as is done when the country is threatened by the near approach of a Mahratta army. However, matters did not reach this extremity. The principal inhabitants of the district opportunely offered to arbitrate in the matter, and they succeeded by diplomacy and conciliation in smoothing away the difficulties and in appeasing the two factions, who were only awaiting the signal to attack each other. One would not easily guess the cause of this formidable commotion. It simply arose from the fact that a Chuckler had dared to appear at a public ceremony with red flowers stuck in his turban, a privilege which the Pariahs alleged to belong exclusively to the Right-hand faction.
- Digavalli Venkatasiva Rao-1941-Enugula Viraswamayya Gari Kasi Yatra Charitra- 3rd print-(Telugu)-p370 “వైష్ణవ బ్రాహ్మణులలో వడగలి, తెంగళి తెగలవలెనే ద్విజేతర కులములందు కుడి ఎడమ కులకక్షలు చాలాకాలము వరకూ అతి తీవ్రముగానుండేవి. కుడిచెయ్యి కులకక్షిలో లింగధారణము చేసిన నేతగాండ్రు, తెలికలవాండ్లు, కుట్రపు పనివాండ్రు, బలిజలు, గొర్రెల కాపరులు, కుమ్మరులు, మేదరులు, చాకళ్లు, మంగళ్ళు, జోగులు, బుడబుక్కల వాండ్రు, మాలలు నుండిరి. ఈ కుడికులము వారిని కొన్నిచోట్ల దైవాచారులనిన్ని, కొన్నియు చోట్ల మహానాటి వారనిన్ని వ్యవహరించిరి. ఎడమచేయి కులములను పాంచాలులనిన్నీ, మత్తులనిన్ని వ్యవహరించిరి. వీరిలో జందెములు వేసికొని ఐదు తెగల బత్తులు, వెండి బంగారు పనిచేయు కంసాలి బత్తులు, రాగి ఇత్తడి పనిచేయి కంచరి బత్తులు. రాతి పనిచేయు శిల్పులు , రంగులువేయు హట గారులు, నేతనేయు దేవాంగులును, గొల్లలు, ఘత రాచలు, మాదిగలు మొదలుగువారుండేవారు. ఈ రెండు కక్షలలోని కులములవారు నొకరికన్నా నొకరెక్కువ వారమనిన్నీ తమకు ముందుగా మర్యాదలు జరుగవలెననిన్ని తగవులాడుచుండేవారు. ఈ రెండు తెగలకు వేరు వేరు మతాచారములుండెను. దేవతలు దేవుళ్ళు నుండిరి. వీరి వివాహములందు, మరణములందు, కొలుపులందు, జాతరలందు ఒక కులకక్షివారి వీధులనుండి రెండవ కక్ష కులములవారూరేగింపులు చేయకూడదని కులకట్టులు నిషేధములు ఆనాదిసిద్ధముగానుండి తగవులకును దెబ్బలాటలకును కారణమగుచుండెను. పెండ్లిండ్లలో, మహానాటి వారిలో మాలలు గుఱ్ఱమునెక్కి యూరేగుటకు కొన్ని గ్రామములందభ్యంతర ముండెను. తక్కినవారిలో ఆయాకులముల తారతమ్యములను బట్టి పల్లకీలు మొదలైనవి ఎక్కి భజంత్రీలు మేళతాళములతో నూరేగినచో నెడమకులములవారభ్యంతర పెట్టకుండిరి. ఇంకను చిత్రవిచిత్రములైన యాచారాలుండెను. ఇవి మీరినట్లయితే రెండవవారు ఆటంకపరచుచుండేవారు. చాలాకాలము వరకు నింగిలీషు కుంపిని ప్రభుత్వమూ వారీ కులమర్యాదలను కాపాడుచునేయుండిరి. సివిలు క్రిమినలు కోర్టులీ తగవులతో నిండుచుండెను. దేశము తెలుగు మీరిన తరువాత రోడ్లు మొదలగు బహిరంగ స్థలములలోనందరినీ సమానమైన హక్కులు కలవను సిద్ధాంతము స్థాపించబడినది. చెన్నపట్టణమున 1652, 1707, 1716 సంవత్సరములందిట్టి తగవులు వచ్చినట్లు కుంపినీవారి రికార్డులలోనే వివరింపబడియున్నది. ఈ రెండు కులముల వారికీ పెద్దనాయకుని పేట ముత్యాలపేటలలో ప్రత్యేక వీధులేర్పాటు చేయబడెను”
- గిడుగు వెంకటరామమూర్తి పంతులు-1933-గద్యచింతామణి మొదటిభాగము-p 149-151 అర్జీ-Local records. vol. 62 (అన 1842 సం॥ ది 3 నవంబరు) మకాం దాచెపల్లి. మహారాజ శ్రీ గుంటూరుజిల్లా మేజిస్ట్రేటువారి సముఖానకు తమ నవుకరు వెలిదండ్ల దాసప్ప హెడ్డాపు పోలిను ఠాణే దాచేపల్లి వ్రాసుకున్న అర్జీ విన్నపము I-యా జిల్లాలో నేమి యితరజిల్లాలో నేమి కుడియెడమ కులాలవారిలో కులాలవిషయమై స్వల్పసంగతులను గురించి గొప్ప కలతలున్ను ప్రాణహానిన్ని సంభవిస్తూ వున్నది గనుక యీలాగంటె దుర్మార్గములు జరగకుండా యే ప్రకారం జరిగి స్తే నిలచిపోతవో అందునగురించి ఆవలంబించ వలశిన యుక్తమయిన మార్గమును గురించి నా అభిప్రాయమున్ను ప్రతికులస్తులలో ముఖ్యమయిన వార్ని పిలివించి వారికి యేయే మర్యాదలు యేమేమి బిరుదులు జరగవలసినవో ఆబిరుదులు వారికి యేవిధంగా రాబడ్డవో అలాగంటె బిరుదులు అన్నిన్ని జరిగించే పక్షము వచ్చే లాభమేమో నిలిపివేసే పక్షముకు సంభవించే చెరుపు యేమో వారిని విచారించి జమిరుచేసెదనిన్ని పోయిన నెల ది 21 తారీఖున దయచేయించిన 15 నంబరు సరికిలేరు హుకుంది 11 తారీఖున రాత్రి నాకు చేరి అందుల సంగతులు గ్రహించి మనవి వ్రాసు కొనేది యేమంటే- ఠాణా మజుకూరు యిలాకాలో కుడియెడను కులాలు అనేవాడిక లేదుగాని యితరజిల్లా యిలాకాలో యీ వాడిక కలిగి వున్నట్టున్ను కుడి అనగా మహనాటివారు అనిన్ని యెడమ అనగా మత్తులలో చేరిన కంసాలులు గొల్లలు ముతరాచలు మాదిగలు వగయిరాలు అనిన్ని తెలియవస్తూ వున్నది. యీరెండు విధాలవారిలో పెండ్లిండ్లు మొదలైన వాటిలో యేమేమి కలతలు వుంటూ వున్నవోనని విచారించి నంతల్లో-మహానాటి కులస్తులలో మాల కులస్తులు గుర్రాన్ని యెక్కి వూరేగడముకు మాత్రం కొన్ని గ్రామాదులలో కలతలు వున్నట్టున్ను తతిమ్మా కులాలలో వారివారి కులాచారం తారతమ్య ప్రకారం గుర్రాలు పాలకీలు మొదలయినవి యెక్కి భజంత్రీలు వగయిరా మేళాలతోకూడా పెండ్లిండ్లలో వూరేగడం మొదలైనవి జరిగించుకునే యెడల యెడమ కులస్తులవల్ల అటంకమయి వున్నట్టున్ను తెలియలేదు. మాలవాండ్లు గుర్రాని యెక్కి వూరేగీయెడల కొన్ని గ్రామాదులలో’ హరిషించి వున్నట్టున్ను కొన్ని గ్రామాదులలో యెడమ కులస్తులు మొదలయిన వాండ్లు కలతలు చేస్తూ వున్నట్టున్నూ తెలియవస్తున్నది. యెడమ కులస్తులలో కంసాలీలు మొదలయిన పంచదాయీల వాండ్లు పెండ్లిండ్లు చేసుకునే యెడల గుర్రాన్ని యొక్కి వూరేగడముకు వచ్చిన మేళం బొడ్రాయి అనగా గ్రామం కట్టేటప్పుడు స్థంబ ప్రతిష్ట కాలమప్పుడు పాతబడ్డ రావిస్థంభం దగ్గిర నాదార్చకపోయినా మహనాటివారు ఆటంకం చేసి కల్త జరిగిస్తూ వున్నట్లు తెలియ బడుతూ వున్నది. విశేషించి వీండ్ల గురువు అనే యికుస్తుడే సంచారం వచ్చేయెడల పగలు కంచుదివిటీలు మొదలయిన బిరుదులు వేసుకుని వచ్చిన పక్షముకు ఆటంక పెట్టడమున్ను యిందువల్ల వుభయులకు కల్త సంభవిస్తూ రావడమున్ను వున్నట్టు తెలియబడుతూ వున్నది. గొల్ల వాండ్లున్ను గుర్రాన్ని యెక్కి వూరేగే పక్షముకు కల్త సంభవిస్తూ వున్నట్లు తెలియవస్తున్నది. యీ యెడమ కులాల్లో చేరిన మాదిగవాండ్లు నాలుగు తట్లా పట్టుకునే వుల్లెడ తెల్లకత్తి కాలికి గజ్జ కట్టుకుని గ్రామంలోకి వచ్చే పక్షముకు మహానాటివారు ఆటంకము చేయడమున్నూ వుభయులకు కల్త జరుగుతూ వున్నట్టున్ను తెలియవస్తున్నది. తతిమ్మా ముతరాచలు మొదలయినవాండ్లు పెండ్లిండు చేసుకునే యెడల గుర్రాన్ని యెక్కి వూరేగడం మొదలయినవి జరిగించుకోవడంలో మహానాటివారు ఆటంక పెట్టటమే కాని ఆందువల్ల కల్త సంభవించడమే కాని లేనట్టు తెలియబడుతూ వున్నది. యీలాగున సంభవించడముకు అనగా యీవుభయవారలకు వుండే విరోధములు పూర్వోత్తరం తెలియడముకు యెంత దూరం విచారించినా రూడి ఆయిన సంగతి తెలియబడదు.
మల్లంపల్లి సోమశేఖర శర్మ(సం)- ముఖ్యమతవర్గములు-1958-తెలుగు విజ్ఞాన సర్వస్వము- మూడవ సంపుటం-p 14-17.. ..ఇది యిట్లుండగా దక్షిణహిందూ సంఘమువారు కుడి చేతికులమువారని, ఎడమచేతికులమువారని రెండు తెరగులు. కుడిచేతికులములు, ఎడమచేతికులములు అను విభేదము ఈనాటిది కాదు; ఇప్పటికి రమారమి వేయి సంవత్సరముల క్రిందటి నుండి వచ్చుచున్నట్లు శాసనముల వల్ల తెలియవచ్చుచున్నది. కుడిచేతి, ఎడమచేతి కులములను విభేదము హిందూసంఘమువారిలో ఒక్క దక్షిణ హిందూ దేశమునందే కాని, ఉత్తరహిందూస్తానమున కానరాదు. దక్షిణహిందూ దేశమునందయినను తమిళ, కన్నడ, ఆంధ్రదేశములలోనే కాని మలయాళ దేశమున లేదు. కుడిచేతి, ఎడమచేతి జాతులకు వలంగై, ఇడంగై జాతులని తమిళములో వ్యవహారము. ఈ కుడి, ఎడమచేతి విభేదములు ఎప్పటినుండి మొదలో, ఎట్లు ఎందులకు వచ్చినవే తెలిసి కొనుటకు ఆధారములు లేవు. హిందూసంఘములో ఎడమచేతికులమువారికంటే కుడిచేతికులములవారికి గౌరవమర్యాదలు, పరువు ప్రతిష్టలు, హోదా ఎక్కువ. ఈ కుడి ఎడమచేతి విభేదము ముఖ్యముగా వ్యావసాయిక జాతులవారికిని శిల్పులకును, అనగా విశ్వబ్రాహ్మణులకును కలిగినదిగా గన్పట్టును. ఎడమచేతికులమువారికి పంచాణము వారు (పంచాననమువారు – విశ్వ బ్రాహ్మణులు) నాయకులు. కుడికులములవారిని ‘మహానాటి’వారని, ‘మానాటి వా’రని అందురు. కుడికులములవారు ప్రధానముగ వ్యావసాయకులు. పెండ్లిండ్లు మొదలైన శుభ కార్యావసరములలోను, అశుభ కార్యముల సమయమునను తమకు పరంపరగా రాని, రివాజులేని కులమర్యాదలను, సాంఘిక గౌరవ బిరుదములను, వాహనాదికములను ఈ యుభయ కులములలో ఏకులమువారు వాడుక చేసినను, రెండవ కులమువారు అడ్డు పెట్టుచుండిరి. ఈ సందర్భముననే కుడి, యెడమకులములకు తరచుగా కలహములు సంభవించుచుండెడివి. ఇట్టికలహములు హిందూ రాజన్యుల పరిపాలనమున చాల తక్కువ. హిందూ ప్రభుత్వములున్నంత కాలము ‘మంత్రి మహానాటివారు’ ఎడమ కులముల వారిని అదుపులో ఉంచుచువచ్చిరి. హిందూప్రభుత్వమంతరించిన వెనుక ఇట్టి కలహములు అధికమైనవి. ఇటువంటి కలహములు 1786, 1790 సంవత్సరముల నడుమ మద్రాసులోను, తెలుగుదేశములో, కుంఫిణీ ప్రభుత్వమారంభమయిన క్రొత్తలోను అధికమైనవి… ……… తెలుగు దేశములో కుడి, ఎడమ విభేదములు కుల మర్యాదల విషయమున ఉభయులకు కలహములు కొంత కాలము క్రిందటివరకు ఉండెడివనుటకు ఇంకను ఉదాహరణము లీయవచ్చును కాని యది అనవసరము.
మహమ్మదీయ పరిపాలన కాలమున మంత్రి మహనాటి వారు ఎంత జాగ్రత్తగా ఆయాకులములను హద్దులో ఉంచి కులగౌరవమర్యాదాతిక్రమణము జరుగకుండ కాపాడుటకు ప్రయత్నించినను క్రమక్రమముగా అవి బిగువు సడలినవి. బ్రిటిషు ప్రభుత్వము మన దేశములో వేరు తన్ని వర్ధిల్లి అన్నికులములవారిని, అన్నిమతముల వారిని సరిసమానముగ ఆదరించి ప్రభుత్వోద్యోగములు ఇచ్చినకొలదియు ఇంగ్లీషు విద్య, పాశ్చాత్య నాగరికత మనదేశములో బాగుగా వ్యాపించి దృఢ పడిన కొలదియు సాంఘికులలో కులగౌరవమర్యాదల విషయమున పట్టుదలలు, అభిమానములు క్రమముగా సమసిపోయి అన్ని కులములవారు, అన్నివర్ణములవారు ఒకటేమట్టమునకు వచ్చిరి. సాంఘీకముగ కులములకు, కులములకు ఉండిన నూనత్వాధిక్యములును, వర్ణమునకు వర్ణ మునకు ఉండిన సాంఘీకాచార మతవిభేదములును చాలవరకు అంతరించినవి. నేడు ఇండియన్ యూనియన్ ప్రభుత్వము వారి లక్ష్యము కులరహిత సంఘనిర్మాణమగుటచేతను, ఈలక్ష్యమునకు అనుగుణముగ శాసనములు చేయబడుచుండుట చేతను ఈవిభేదములు సాధ్యమైనంత శీఘ్ర కాలములో అంతరించిపోవుటకు అనువయిన మార్గములు చక్కనగుచున్నవి.”
- Journal of the Andhra Historical research Society- vol4- July & October 1929-The Origin of the Right and Left Hand Caste Divisions-C. S. Srinivasachari- p 85’
- The Indian Antiquary- Vol5- Jas Burgess-1876-p353,354, Indian antiquary Vol 4 – Jus burges-p344-346-1875
- A journey from Madras-Francis Buchanan M D-Vol 1- p 79
- The Madura Country- A Manual- J.H Nelson- part2-ch1- page 4-9
- ఆంధ్రపత్రిక-1941 సెప్టెంబరు 19 శుక్రవారము-మద్రాసు హైకోర్టు:వాడపల్లి దొమ్మికేసు-నల్గురకు ఉరిశిక్ష,30 మందికి ద్వీపాంతరవాసం-(న్యాII బర్న్, న్యాII కింగ్ గారలు) చెన్నపురి, సెప్టెంబరు 19:- వాడపల్లి దొమ్మీకేసులో ముద్దాయిలు హత్యానేరము చేయలేదని సదరు నేరమునకు శిక్షవిధింపనందున తూర్పుగోదావరి జిల్లా జడ్జి తీర్పుపై ప్రభుత్వము తరపున గొడితి వెంకడు మరి 19 గురి సందర్భమున దాఖలు చేయబడిన అప్పీలుకు న్యాయమూర్తులు అనుమతినిచ్చును, 14,15,16,17 ముద్దాయిలకు ఉరిశిక్షను, మిగిలిన 30 మంది ముద్దాయిలకు యావజ్జీవశిక్షను విధించుచు నేడు తీర్పునిచ్చిరి. కేసు వివరములు-ప్రాశెక్యూషనువారి కధనమిట్లున్నది:-ఈ కేసు మాదిగలకుమాలలకు జరిగిన దొమ్మీకి సంబంధించినది. ప్రతిఏటా ఏప్రిల్ మాసంలో వాడపల్లిలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. అక్కడికి చుట్టుప్రక్కల ఊళ్ళనుండి చాలమంది మాలవాళ్ళు మాదిగవాళ్ళు వస్తారు. అయిదేళ్ళపూర్వం వరకు మాలవాళ్ళు ఉత్సవంలో ‘గారడీ’ చేస్తూ ఉండేవాళ్లు. అయిదేళ్ళక్రితం మాదిగవాళ్ళు తాము గూడ చేస్తామని ‘గారడీ’ మొదలుపెట్టేటప్పటికి మాదిగవాళ్ళకి భయపడి మాలవాళ్ళు గారడి చెయ్యటం మానుకున్నారు. మాదిగవాళ్ళ మీద కోపం కలిగింది. కులపెద్దల సలహాపై 1940 సంII లో కొన్ని ఊళ్ళ మాలవాళ్ళు మళ్ళీ ‘గారడీ’చేద్దామని నిర్ణయించుకున్నారు. చాలమంది మాలవాళ్ళు ఉత్సవానికిపోతే, మాదిగవాళ్ళకు భయపడనవసరంలేదని కులపెద్దలు చెప్పారు. 18-4-1940 తేదీన చుట్టుపట్ల ఊళ్ళనుండి చాలమంది మాలవాళ్ళు, మాదిగవాళ్ళు వాడపల్లి ఉత్సవానికి వెళ్లారు. వాడపల్లికి పోయేమార్గంలో చేళ్ళూరు మాలవాళ్ళు రోడ్డుప్రక్కన్న అన్నపుమూటలు విప్పుకుతిననారంభించారు. ఇంతలో ఏడిద మాదిగవాళ్ళు ఆ దారిని పోతూంటే ఉద్దేశపూర్వకంగా గాని, అజాగ్రత్తవల్ల గాని మాలవాళ్ళు తినే అన్నాల్లో దుమ్ము పడ్డది. తమకంటె తక్కువ కులపు వాళ్లయిన మాదిగవాళ్ళు తమమీద నుంచి పోవటంవల్ల మాలవాళ్ళు తాముతినే అన్నాలు మైలపడ్డాయనుకున్నారు. ఆ సాయంత్రం ఉత్సవంలో ఈ మాదిగవాళ్ళు ఏడిద గ్రామం వాళ్ళని తెలుసుకొన్నారు. పెద్దవాళ్ళ జోక్యంవల్ల అప్పటికి తగవుతప్పింది. మర్నాడు సూర్యోదయంవేళ మాలలు, మాదిగలు ఇళ్లమొఖం పట్టారు. 200 పైగా మాలవాళ్ళు ముందు బయలుదేరారు. 200 పైగా మాదిగవాళ్ళు వెనుక బయలుదేరారు. క్రిందటిరోజున ఏడిద మాదిగవాళ్ళ మూలాన్ని అన్నం లేకుండా పోయిన చేళ్ళూరు మాలవాళ్ళు ఏడిద మాదిగ వాళ్ళను బాగా తిట్టనారంభించారు. ఇది విన్న మాదిగవాళ్ళు మండిపడి బల్లాలు, కత్తులు, కర్రలు పుచ్చుకొని విజృంభించారు. ఈ సందర్భంలో అయిదుగురు మాలవాళ్ళు చచ్చిపోయారు. కొంతమందికి ప్రమాదంగా గాయాలు తగిలాయి. ఈ సందర్భంలో 34గురు మాదిగల పై దొమ్మీచేశారని, గాయపరిచారని, హత్యచేశారని ప్రాసిక్యూషను వారు నేరం మోపారు. అస్సెసర్లలో ఒకరు 1,2,14 ముద్దాయిలు దొమ్మీ జరిగినచోట ఉన్నారనీ, కాని దొమ్మీ నేరం చేయ్యలేదనీ, ఏ ముద్దాయిగూడా ఏ నేరం చెయ్యలేదని, రెండవ అస్సెసరు ముద్దాయిలు నిర్దోషులని అభిప్రాయపడ్డాడు. అడిషనల్ సెషన్సుజడ్జి దుళ్ళశేషిగాడు (14 వ ముద్దాయి) కూదెళ్ళ సత్తిగాడు (29 వ ముద్దాయి) కూదెళ్ళ వీరన్న (30 వముద్దాయి) లు దొమ్మీ చేశారని, గాయపరిచారని, మొత్తం రెండేసి ఏండ్లు కఠినశిక్ష విధించారు. మిగిలిన ముద్దాయిలు నిర్దోషులని విడచి పుచ్చారు. దానిపై ప్రభుత్వము తరపున గొడితి వెంకడు మరి 19 గురిని హత్యనేరానికి శిక్షించక విడుదల చేసినందుకు తూర్పుగోదావరి అడిషనల్ శెషన్సు జిల్లా జడ్జి తీర్పుపయి అప్పీలు హైకోర్టులో దాఖలు చేయబడ్డది. హైకోర్టువారి తీర్పు-న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేయబడ్డ అప్పీలుకు అనుమతినిస్తూ దుళ్ళశేషిగాడు (14 వ ముద్దాయి) దుళ్ళ పుల్లిగాడు (15 వ ముద్దాయి) గొట్టిముక్కల తాతయ్య (16 వ ముద్దాయి) చంద్రమళ్ళ సుబ్బడు (17 వ ముద్దాయి) తీవ్రంగా విజృంభించి ప్రబల దౌర్జన్య ప్రయోగం చేశారని గట్టిగా సాక్ష్య మున్నదనీ వారి నలుగురికి ఉరిశిక్షను, మిగిలిన వారంతాగూడ హత్యానేరం చేశారని యావజ్జీవశిక్షను విధించారు. ముద్దాయిల వరుస నెంబర్లు:పేర్లు-1. గొడితి వెంకడు 2. గొడితి శామ్యూల్ 3. గొడితి గన్నిగాడు 4. తాతపూడి పనిసిగాడు 5. అంగరసత్తిగాడు 6. పోసిపోలు పొలిగాడు 7. గెడ్డం వెంకయ్య 8. బొంగతుక్కడు 9. పోసిపోలు పెంటయ్య 10. బొంగపిల్లి వెంకడు 11. తాతపూడి జానకిగాడు 12.తాతపూడి మాలిగాడు 13. పలివెల పట్టాభి 14.దుళ్ళశేషిగాడు 15.దుళ్ళశేషిగాడు 16.గొట్టముక్కల తాతయ్య 17. చంద్రమళ్ళ సుబ్బడు 18. మండపల్లి చినవెంకడు 19. మండపల్లి గన్నిగాడు 20. తాతపూడి సత్తిగాడు 21. చంద్రమళ్ళ సూరిగాడు 22. రాయికొండడు 23. పువ్వుల తాతయ్య 24. యామగిరి సత్తిరాజు 25. మడికి ముసిలిగాడు 26. మడికి గన్నిగాడు 27. లంక గంగడు 28. దూళి ఎల్లిగాడు 29. కూడెళ్ళ సత్తిగాడు 30. కూడెళ్ళ వీరన్న 31. పైడిమళ్ళ ప్రకాశం 32.కాపనల్ల గన్నయ్య 33.ఉండ్రాజవరపు చంద్రయ్య 34.చాపాల వెంకడు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లికు ప్రాసిక్యూటరు, ముద్దాయిల తరపున కే.పి. సర్వోత్తమరావు, వివి చౌదరి, ఎం. శ్రీనివాసరావు గారలు వాదించిరి.
ఆంధ్రపత్రిక-1921-ఆగష్టు-15 ‘స్లాటరు హౌసు వద్ద ఆదిద్రావిడులకును మహమ్మదీయులకును ఏప్రిలు మాసములో కొట్లాట జరిగెను. ఒక ఆదిద్రావిడు చంపబడెను’….. ‘కిలాఫతు దినములందు అంగళ్ళను పెట్టగూడదని మహమ్మదీయులు ఆది ద్రావిడులను నిర్బంధించుచుండిరి. మిల్లులు సమ్మెకాలములోనే, స్లాటరు హౌసులోకూడ సమ్మెజరిగినది.’ ఆంధ్రపత్రిక-1921-ఆగష్టు-21 ‘ఇన్స్పెక్టర్ పిలుచుకొనివచ్చిన, మాల మాదిగల దగ్గర కత్తులు, కర్రలు నున్నవి. వారు రాళ్లు రువ్విరి. ఇన్స్పెక్టరు పిల్లలను, పెద్ద వారిని పిలిచి పిస్తోలు కాల్చెను. సార్జెంట్ కూడా పిస్తోలు ప్రేల్చెను. ఇన్స్పెక్టర్ 20, 30 సార్లు కాల్చెను. నలుగయిదుగురు పడిపోయిరి.’-‘ముత్తువేలిట్లు సాక్ష్యమిచ్చెను:-నేను 6 1/2 గంటలకు వచ్చితిని. 2,3 వందల మంది మాలమాదిగలు కత్తులు కర్రలు పట్టుకొనివచ్చిరి. వారు గోలచేయుచుండిరి. వారి ముందర సార్జంటులుండిరి. అరవలమీద మాలలు రాళ్లురువ్వ పిల్లలు వారిమీద రాళ్లతోగొట్టిరి. పాపమప్పుడొక స్త్రీ మరుగుదొడ్డిలోనుండి వచ్చుచుండెను. సార్జంటు పోలీసు వారిని కాల్చుమని ఉత్తరువు చేసెను. పాపమాస్త్రీకి దెబ్బతగిలెను. అప్పుడందరు ఆమెదగ్గరకు వెళ్లిరి. అప్పుడొక మాల ఎదో ఎర్రటిది గ్లాసులో పోసి సార్జంటున కిచ్చెను. అతడు దానిని త్రాగి మళ్ళీ కాల్చెను. ఒకనికి తలమీద తగిలి క్రింద పడెను. కాల్పు పదిపదిహేను నిమిషములవరకు నుండెను.
- పుల్లెల శ్రీరామచంద్రుడు-1999-కౌటిలీయమ్ అర్ధశాస్త్రమ్- (ఆంధ్రవ్యాఖ్య బాలానందినితో)-p 97-98, 235 &
https://bharatdiscovery.org/india/%E0%A4%85%E0%A4%82%E0%A4%A4%E0%A4%AA%E0%A4%BE%E0%A4%B2
అన్తేష్వన్తపాలదుర్గాణీ జనపదద్వారాణి అన్తపాలాధిష్టితాని స్థాపయేత్.
తేషామన్తరాణి వాగురికశబరపులిన్దచన్డాలారణ్యచరా రక్షేయుః
సరిహద్దులలో సరిహద్దులు రక్షించే (అంతపాల) దుర్గాలు స్థాపించాలి. అవి జనపదంలోనికి ప్రవేశించడానికి ద్వారాలుగా ఉంటాయి. వాటికి అంతపాలుడు అధ్యక్షుడుగా ఉంటాడు. ఒక అంతపాలదుర్గానికీ మరొక అంతపాలదుర్గానికీ మధ్య నున్న ప్రదేశాన్ని వాగురికులు (పాశాలు – ఉచ్చులు – ఒగ్గి మృగాలను పట్టేవాళ్లు), శబరులు, పులిందులు, చండాలులు, అరణ్యంలో నివసించేవాళ్లు రక్షిస్తూ ఉండాలి. అనగా అంతపాలులు వీళ్ల సహాయంతో ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉండాలి. సరిహద్దులు రక్షించే అధికారి (అంతపాలుడు) సరుకు తీసికొని వచ్చిన బండి మొదలైనవాటిలో ఒక్కొక్కదానిమీద ఒకటింపావు పణాలు తన వర్తనిగా (భృతిగా, తన జీతంగా -గ.శా.) (వర్తని అనగా రోడ్డు పన్ను-కాంగ్లే) గ్రహించాలి. ఒక డెక్క ఉన్న అశ్వాదులకు ఒక పణం, గోవులు మొదలైన పశువులకు అర్ధపణం, మేకలు మొదలైన చిన్న పశువులకు పణంలో నాల్గవవంతును, బుజం బరువుకు మాషికను వసూలు చెయ్యాలి. ఎ వర్తకుల సరుకైనా నష్టమైనా, అపహరించబడినా దానిని ఏదో విధంగా మళ్లీ సంపాదించి అంతపాలుడు వాళ్లకి అప్పగించాలి. ‘अंतपाल प्राचीन समय में मौर्य साम्राज्य की सीमाओं की रक्षा करने वाले राजकर्मचारियों को कहा जाता था। कौटिल्य के ‘अर्थशास्त्र’ से भी अंतपालों के विषय में जानकारी प्राप्त होती है। ‘अंतपाल’ शब्द साधारणत: सीमांत प्रदेश के शासक या गवर्नर को निर्दिष्ट करता है। यह शासक सैनिक, असैनिक दोनों ही प्रकार का होता था।-’
Vivekananda Jha-2018,2022-Candala (Untouchability and caste in Early India)-p64 ‘Kautilya represents the Candala as quite useful to society. In addition to working at and staying near the crematorium, widely considered an old trait, he is to be engaged in punishing the offenders in criminal cases and in defending the new settlements in the countryside. To enable him to discharge his public responsibilities without hinderance, his polluting capacity is placed within reasonable limits. Thus although he cannot be allowed to desecrate the blood of groups higher in the varna hierarchy, he is not deemed a person who cannot be seen, spoken to or approached.’
- M.Srinivasa Iyengar-1914-Tamil Studies-p106-107 రాజేంద్ర చోళుడు వేంగీనాడు, రెట్టైపడి, గంగైపడి, కొల్లం, కళింగం, ఇల్లం (శ్రీలంక), మధురై, ఇత్యాది ప్రాంతాలపై దండయాత్రచేసి ఆక్రమించుకున్నాడు. ఈయన కాలంలో తన సైన్యాన్ని బలంగా మలచడమే కాకుండా, ఆక్రమించిన రాజ్యాలను కాపాడుకోడానికి సైన్యాన్ని రెండు గొప్ప భాగాలుగా విభజించాడు. అంతవరకూ ఆక్రమించిన ప్రాంతాలను గెలవడానికి సహాయపడిన సైన్యం ఒకవైపు ఉండగా, మరోవైపు ఆక్రమించబడిన పాండ్య, తెలుగు, కనరా ప్రాంతాలకు చెందిన సైన్యం ఉండేది. ఈ సైన్యం గతంలో చోళుల ఆక్రమణను వ్యతిరేకిం చారు. మొదటి వర్గంలో ఎక్కువగా వేదన్, నట్టామన్, మలయమన్ మరియు పరియా అనే జాతులుం డేవి. దీనిని ఆయన కుడిచేతి సైన్యమని పిలిచాడు. రెండో వర్గంలో పల్లన్, పల్లిస్, మాదిగ, బేదర్ అనే జాతులను ఎడమచేతి సైన్యంగా పిలిచాడు. బహుశా దీనివలనే కావచ్చు బేదర్ జాతి (కనరాకు చెందిన వేటగాళ్లు) ఎడమచేతి వర్గంలో ఉండగా, తమిళనాడులో వారి సోదరులైన వేదన్ జాతి కుడిచేతి వర్గంలో ఉంది. పల్లన్ , మల్లర్ జాతు లు పాం డ్యరాజు సైన్యం లో ఉండగా, పల్లి అనే జాతి పల్లవుల సైన్యం గా ఉండేది. కళింగం ఇత్యాది రాజ్యాల సైన్యంలో ఎక్కువగా బేదర్ , మాదిగ లేక చక్కిలియాన్ జాతులతో నిండి ఉండేదని చరిత్రకారులు వ్రాసారు.
- Shri Dharampals Compilations-2000-Vol 9-British Narrations on India, Its Conquest, Dominance, and Destruction 1600-1900AD-The Answer of the Tribes or People of the Left Hand Castes inhabitants of Madraspatnam to the people preferred by the Right Hand Castes and called by them on an Authentic Ancient Sundry Innovations & C-Madras Public consultation VOL. 106. B, pp. 948-959, and 959-971. (p.794)-Right and Left hand dispute (Enquiry revenue ….) so very intricate(p.943-948)-p22 ‘The chacklie or the shoemakers: The shoe makers are generally the best soldiers and armed men in the country, who always serve the Polygars and are employed to guard the entrance of their woods, besides the usefulness of their profession to mankind, both directly to themselves and also to making of harness for horses and cattle, etc.’
- Abraham Rogerius-1649, 1915-De Open-Deure Tot Het Verborgen Heydendom-p8 & A.V.Williams Jackson-History of India-Vol9-p248-249 & Encyclopaedia Britannica-vol XV-1823-p773 ‘Of this caste there are two sorts, the first whereof is called simply Perreaes, and the other Siriperen. Tlie handiwork of the latter is to go about with leather and to prepare it, making bridles thereof and other more things for beasts. Some of them serve as soldiers.’
- https://timesofindia.indiatimes.com/city/madurai/leaders-pay-homage-to-ondiveeran/articleshow/102886078.cms & Sir George Campbell-1852- Modern India; a sketch of the system of civil government-p55-56. ‘The other is the actual outcast class, who are not admitted to be Hindoos at all, and whom good Hindoos regard with abhorrence and dread of their very touch. In the south of India these people seem to be in great numbers, of inferior personal appearance, and to be regarded as the aboriginal race, but in the north they are not so numerous, and have not the same personal characteristics : on the contrary, I think that, when in good circumstances, they are by no means physically inferior ; and what chiefly distinguishes them from the Chamars is that they make capital soldiers. When there is anything very daring or desperate to be done, they are the men to do it. It is probable that, although the class may have originated in the aborigines, the latter have disappeared from the north, and their place may have been supplied by outcasts, men of desperate characters from all classes, and so become a hardy mixed race.’
- Dharampal Collected writings-Vol 5-Essays on Tradition Recovery and Freedomp24 ‘The Karnam or Conicoply (which really implied the office of the registrar of the village, a sort of secretariat, rather than a single individual) generally had an allocation of 3-4% while the Taliar (i.e. the village police, which may have included several persons) generally had an allocation of around 3%. Incidentally, it may be useful to know that the offices of the Taliar, the CornMeasurer, the settler of boundary disputes, and a few other village offices, were generally filled by persons from the Pariah and allied castes. As many will know in Maharashtra, it was the Mahars who constituted the village police. It is also worth noting that in cases of theft etc., if the police, or the Palegar (the head of the militia and perhaps one who also acted as a modern Inspector General of Police for his area) were unable to recover the stolen property, they were expected to compensate the aggrieved party from the incomes allocated to their offices.’
- P V Kane-Katyayana Smrti-Vyavahara (Law and Procedure)-p 84, 258
- నల్లతిం ఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు-2000-మనుస్మృతి-p172
- పుల్లెల శ్రీరామచంద్రుడు -1999 – కౌటిలీయమ్ అర్ధశాస్త్రమ్ – (ఆంధ్రవ్యాఖ్య బాలానందినితో)-p304,417
- Vivekananda Jha-2018,2022-Candala (Untouchability and caste in Early India)- p10
- శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు-1958-అయిదవ సంపుటము-p404-405 పాలెము=పాళెము పరివారము, సేన-పాలెంబులుండు-కావలియుండు, పాలెముండు-కావలి యుండు, కాపుడు
- జనమంచి శేషాద్రిశర్మ-1927-కడపమండల చరిత్రము-p51 పాళెగాండ్రు -……ఈ కడపమండలమున జాలమంది పాళెగాండ్రుండిరి. ఈ శబ్దమునకర్థమేమో విచారింతము. పాళెమనగా దండు దిగుచోటు. దానియధికారి పాళెగాడు అని పిలువబడును. అనగా సేనలుదిగుటకు నాయాచోటుల నేర్పాటుచేసికొనుట రాజులయాచారము. అట్టితావుల దండుదిగినపుడు ఆ దేశరహస్యముల దెలుపుటకును, వారికి భోజనపదార్థముల నాయత్తపరచియుంచుటకును నొక పెద్దమనుష్యునియమింతురు. అతనికి గొంతయధికారముండును. అతడు పాళెగాడని పిల్వబడును. కొన్ని గ్రామములయందతని కధికారమునిరంకుశముగా సాగుటంబట్టి యతడు తానే రాజనని యెంచుకొనుచు దనయిష్టానుసారము ప్రజలనుండి దండులంగైకొనుచు నుండును. ఆతనిగ్రామములకు జుట్టుపట్లనుండు గ్రామముల నుండి రావలసిన ద్రవ్యమును రాజుననుమతిని దానే రాబట్టి ప్రభువునకు బంపుచుండు నధికారము కొందరకుండును. ఆతడు తానారాజునకు సామంతరాజునని డంబములు పలుకుచు బ్రభుత్వము చేయుచుండును. యుద్ధమునకు సహాయము చేయునిమిత్తమే ఈతనికి గొన్నిగ్రామములీయబడును గాని వేరుగాదు. ఇదియే పాళెము. పాళెగాడు అను శబ్దముల కర్థము.
- M. Somasekhara Sarma-1946- History Of The Reddi Kingdoms-p228-229 ‘The Sukranitisara, a work on polity calls the police man a yamika, and details his duties clearly. According to this work a yamika had his station either at the beginning or at the end of the residential quarters, and kept strict watch over all persons who arrived at and departed from the village, purticularly strangers. It was his duty to study the character of each person, allow only those of good character and well-noted persons entering into the village, and others only after they provided surety or security. Once in every ardha-yama he had to patrol the vstreets during nights. The policemen in Telngu are called or Talarulu. Even during the period under review the policemen continued to do this duty of patrolling streets day and night. In the period of dark fortnights they used to patrol the streets with torches in their hands. Policemen were remunerated for their services by periodical fees and other emoluments by villagers. If the village was a big one, there were more than one yamika to discharge the police duties.’
- శ్రీ వేదుల సూర్యనారాయణశర్మ-1962-కాకతి ప్రోలరాజు-p 203 & కొత్త భావయ్యచౌదరి – 1939, 1989 – కమ్మవారి చరిత్ర – p67 ‘‘శత్రువులు లోపలికి జొరకుండుటకై మాలమాదిగలను. బోయలను, పాలెగాండ్ర ను సైన్యములుగా నేర్పరచి ప్రతిగ్రామమునకు తూర్పు దిక్కు న నెడముగా పాళెములేర్పఱచి శత్రువులు వచినంత కొమ్ములతో పింజలతో, తప్పట్లతో బ్రజల మేల్కొలిపి కఠారులతో యుద్ధము సేయుటకు నిలువరించె ను.’ ‘రాజులు అన్ని కులములవారిని సేవలలో జేర్చుకొనుచు వచ్చిరి. గొల్లలు,వైశ్యులు, విశ్వకర్మలు, మాలలు, మాదిగలు, బ్రాహ్మణులు, వెలమలు, కమ్మలు, రాజులు, రెడ్లు మొదలగువారు యుద్ధములు చెలరేగినప్పుడెల్లను పాల్గొనుచువచ్చిరి. వీరందరి శాసనములు అచటనచట కనపడుచున్నవి.’. చిల్లరిగె శ్రీనివాసరావు-1909-మహారాష్ట్రచరిత్ర-p162 ప్రతి దుర్గమునందును సామాన్య కాల్బలములో కొంత కావలి సైన్యముగ నుంచబడును. వీరు గాక దుర్గమునందు బ్రాహ్మణులు మహారాష్ట్రులు రామూసీలు, మహరులు (మాలలు) మాంగులు (మాదిగలు) మొదలైన వారితో గలసిన వేరైన యస్టాబ్లిషుమెంటు యుండును. వీరందరును గడేకారులనబడుదురు. వీరు దుర్గమును, తన గర్భమునందుంచుకొని రక్షించుమాతగా వర్ణింతురు. వీరందరు చుట్టుప్రక్కల నీనాములనియ్యబడి వానివలన జీవనము చేయుచుందురు.
- శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు-1950-ఆంధ్రుల సాం ఘీక చరిత్ర-p 38 & ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆచార్య బాలేం దుశేఖరం-1965-ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి-p 273 ‘ఈ వాడయందే కుట్రపువాడు (దర్జీ) రవికలు కుట్టు చూ, వారికి కాన్పించె ను. దీనిని మోహరివాడయని కూడ యందురు. ఇందు యుద్ధభటులు నివసించుచుండిరి.’ (శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు -‘ఓరుగంటి నగరములో “మోహరివాడ” (Military Cantonment వంటిది) యుండెను. బహుశా ఆ సైనికులకు మాత్రమే మిలిటరీ యూనిఫారం దుస్తులు కుట్టుటకు కుట్రపువారేర్పాటైయుం డిరేమో, ఆనాటి సైనిక యూనిఫారంలో ఆంగీ, చెల్లా డము. నడుముపట్టి చేరినట్లుండెను. కాకతీయ రాజులకు 9 లక్షల సైన్యముం డెను’ “నవలక్ష ధనుర్థిరాధి నాథే, పృథివీంశంసతి వీర రుద్రదేవే” అని విద్యానాథుడు వర్ణించె ను. ఈ సైన్యములో ఎక్కు వ భాగము సరిహద్దుల కాపాడు పాలెగార్లు లేక సామంతరాజులవద్ద నుండెను. ఈ పాలెగారు పద్ధతియే ఆంధ్రరాజ్యాల నాశనమునకు కారణమయ్యెను. పాలెగార్లు కేంద్ర పభుత్వ బలహీనతకై చూపెట్టుకొని సమయము దొరకగానే తిరుగుబాటు చేయుచుండిరి.’)
- ఆచార్య ఎన్. జి. రంగా- డా జెక్కం పూడి సీతారామారావు (అను)-1997-కాకతీయ నాయకులు-p41
- Kundan Singh, Krishna Maheshwari-2024-Colonial Discourse and the Suffering of Indian American Children
- డా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-1994-ప్రసంగాలు-సంపుటం 7-p 262-263, 265, 336 …. “భారతదేశచరిత్రలో ఏదో ఒక దశలో దళితులు స్థిరపడిన తెగల వద్దకు వచ్చి (తమ తెగవారు కాని) వారితో ఒప్పందం చేసుకుని ఉంటారని తేటతెల్లమవుతుంది. ఆ ఒప్పందం ప్రకారం వారికి గ్రామ శివార్లలో నివాసం ఏర్పరచుకునేందుకు అనుమతి లభించింది.”
- ఖండవల్లి సత్యదేవ ప్రసాద్- 2012-చదువుల చెట్టు-p72
- John Wilson (Missionary of the free Church of Scotland)- 1877-Indian Caste- Vol2- p 43
రచయిత మైలవరపు వి.యన్.యల్. సుధామోహన్ గారు ఒక పరిశోధనాత్మక రచయిత. ఆయన వృత్తి రీత్యా వైమానిక రంగంలో పనిచేస్తున్నా, ప్రవృత్తి రీత్యా ధార్మిక సిద్ధాంతాలను, దర్శనశాస్త్రాలను నేర్చుకుంటున్న నిత్య విద్యార్థి, వాటితోబాటుగా పాశ్చాత్య భావదాస్య విముక్తిపై (De-colonization) కూడా అధ్యయనం చేస్తున్నారు. భారతదేశం ధార్మిక నాగరికతగా కొనసాగాలని, భారతీయులందరూ ఆర్షపరంపర ద్వారా లభించిన జ్ఞానామృతాన్ని గ్రోలాలన్నదే ఆయన ఆకాంక్ష.
