Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

[ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పిన మాటల్లో ఎంతో గూఢార్థం ఉందని, సంపదలు, బంధుత్వాల కన్నా శారీరక, మానసిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనదనిసూచించే కవితని అందిస్తున్నారు శ్రీ కరణం నారాయణ స్వామి పిళ్లై.]

~
జంక్ ఫుడ్ రుచి మరగకోయి
హాస్పిటల్ బెడ్ తర్వాత తప్పదోయి
బజ్జీలు, సమోసాలు తినకోయి
తింటే కడుపులో వింత విన్యాసాలేనోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

పండ్లు చూస్తే కళ్ళు తిరుగుతుందోయి
కూరగాయలు తింటే మొహం వంకరవుతుందోయి
కూల్ డ్రింక్లు తాగుతూ కూర్చోకోయి
టైరులా పొట్ట పెరుగుతుందోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

వేళకు వేడి వేడిగా తిండి తినాలోయి
కడుపుబ్బ తిండి తినకోయి
మితాహారమే ఔషధమోయి
వైద్యున్ని దరి చేర్చకోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి -దాన్ని అటకెక్కించకోయి

జిమ్ కెళ్తానని షూస్ కొన్నావోయి
కానీ సోఫాలోనే కూర్చుంటున్నవోయి
పొట్టేమో బానలా ఉంటున్నదోయి
బాహుబలిలా నీ పోజు లాపవోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

డైటింగ్ చేస్తానని డూపులే కొడతావోయి
బిర్యానీ పక్కనుంటే మొత్తం లాగించేస్తవోయి
పిజ్జా,బర్గర్లు తినకుంటే నిదురే రాదంటవోయి
నీ కండరాలు చూస్తుంటే బేజారావుతుందోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

నడక కోసం ట్రాక్ డ్రస్ కొన్నావోయి
నడవమంటే నడుము నొప్పంటవోయి
మెట్లు ఎక్కమంటే ఆయాసమంటవోయి
వ్యాయాయమంటే మాయమౌతావోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

ఉదయాన్నే లేవాలని అలారం పెడతావోయి
అది మ్రోగితే నొక్కి ప్రక్కకి నెడుతావోయి
యోగా చేయాలని మెగా మ్యాట్ తెచ్చావోయి
ఇపుడేమో దానిపై దుప్పటేసి పడుకున్నవోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి -దాన్ని అటకెక్కించకోయి

పార్క్ లో కొంత సేపైన పరుగెత్తవోయి
బరువును కాస్త కంట్రోల్ చేయవోయి
ఉప్పు, చక్కెర తగ్గించ వోయి
కొంత హుషారును పెంచవోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

నిమ్మ రసం తాగాలని షాప్ లోకి వెళతావోయి
ఐస్ క్రీమ్ బండి చూడగానే రూటు మారుస్తావోయి
సన్నబడాలని తెగ మురిసిపోతావోయి
చేతిలో చిప్స్ పాకెట్ తో దర్శనమిస్తావోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

ఆరోగ్యమన్నది ఆన్‌లైన్ యాప్ చూస్తూ కూర్చుంటే రాదోయి
మనం జాగ్రత్తగా కష్టపడితేనే వస్తుందోయి
బేజారు పడితే వైద్యుల బిల్లులే జేబు చిల్లులవుతావోయి
మన గుండె ధీమా ఆగుతుందోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

గుర్తించుకో నేస్తమా – మన దేహం ఒక దేవాలయమోయి
దాన్నిచెత్త కుప్పగా మార్చడంలో న్యాయమెంతోయి
మన ఆయుష్షు పెంచుకోవడం మన చేతిలోనే వుందోయి
మన ఆరోగ్యం బాగుంటే జీవితమే మహా మజానోయి
ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి

Exit mobile version