[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[ఆస్ట్రనామిక్ టవర్‌లో ఆర్యన్ తన వర్క్ స్టేషన్ వద్ద బిజీగా ఉండగా మాయ మెసేజ్ వస్తుంది. ఎలా ఉన్నావు అని ఉంటుంది దాంట్లో. గత కొన్ని నెలలుగా అతనికి తీరిక ఉండడంలేదు. ఓ విషయంలో తాను గొప్ప పురోగతి సాధించాననీ, ప్రజలకి దాన్ని ప్రకటించే ముందు కొన్ని నిర్ధారణలు అవసరమవుతాయి. కుర్చీలో కాళ్ళు జాపి కూర్చుని, కుర్చీనీ గది అద్దాల వైపు తిప్పి, ఆకాశంలోని నక్షత్రాలను చూస్తాడు. మాయ గురించి తలచుకుంటాడు. కానీ చేయాల్సిన పనులు గుర్తొచ్చి, పనిలో లీనమవుతాడు. చలికాలం ముంచుకొస్తుంది. ఆ సమయాన్ని మాయ సంగీతం సృజించి, తోటి కళాకారులతో పంచుకోడం ద్వారా ప్రభావవంతంగా మార్చుకుంటుంది. ఓ రాత్రి మంచు కురుస్తుండగా, మాయ పాట స్వరపరుస్తూంటుంది. అప్పుడు రియా వచ్చి తల్లి దగ్గర కూర్చుని మెర్జర్ ప్రాజెక్టు గురించి చెప్తుంది. అంటే ఏమిటని మాయ అడిగితే, మీరు మీ చైతన్యాన్ని ఒక యంత్రానికి బదిలీ చేసి శాశ్వతంగా జీవించగలగడం అని చెప్తుంది రియా. ఆ ప్రాజెక్టు వాళ్ళు వాలంటీర్ల కోసం వెతుకుతున్నారని చెప్తుంది. తాను వాలంటీరుగా వెళ్ళాలన్న ఉత్సాహం కనబరుస్తుంది మాయ. వద్దంటుంది రియా. బదులుగా, మానవులు అంతరిక్షంలో మరో గ్రహం కనుగొని, అక్కడికి వెళ్ళడం ఉత్తమం అని అంటుంది. రియా మరో గ్రహం కనుక్కోడం గురించి మాట్లాడితే, మాయకి ఆర్యన్ గుర్తొస్తాడు. శీతాకాలం ముగుస్తుంది. మానవ క్లోనింగ్ విజయవంతమైనట్టు వింటాడు ఆర్యన్. తన ఒంటరితనాన్ని, మాయ స్వేచ్ఛా ప్రవర్తనని పోల్చుకుంటాడు ఆర్యన్. లిఫ్ట్ తెరుచుకుని మాయ తన గదిలోకి రావడం చూస్తాడు. టెలిస్కోప్ పక్కన నిలబడి ఉన్న అతన్ని చూసి నవ్వుతుంది మాయ. – ఇక చదవండి.]
అధ్యాయం-4 – మాయ కథ – 3వ భాగం
ఆర్యన్ మాయను చూసి నవ్వాడు, ఆమె రాకతో అతని ముఖం వెలిగిపోయింది. ఆమె వచ్చి అతన్ని పలకరిస్తుండగా, ఆ గదిలో, ఆమె కొత్తగా స్వరపరిచిన పాటలు వినిపించాయి. అతని లేత పసుపు చొక్కా నుండి ఛాతి పైన ఒక చిన్న నలుపు-తెలుగు వెంట్రుక బయటకు కనబడుతోంది. మాయ అతనిని హత్తుకుంది. ఆమెలో ఏదో ప్రశాంతత.
“మాయా, నేను నీకు ఒక విషయం చూపించాలనుకుంటున్నాను.. టెలిస్కోప్ వ్యూఫైండర్ దగ్గరకు రా.”
టెలిస్కోప్ వ్యూఫైండర్ వద్దకు వెళ్ళింది మాయ. తన ముక్కుని గాజు పలకకు నొక్కి ఉంచి, ఆర్యన్‌ను ఆకర్షించిన ఆ ప్రపంచాన్ని చూస్తోంది. ఆర్యన్ తనకు చూపిస్తున్న నల్లటి ఆకాశంలో చెల్లాచెదురుగా అనేక మెరుస్తున్న వస్తువులు గోచరించాయి. మాయ టెలిస్కోప్ ద్వారా ఆర్యన్ ప్రపంచంలోకి చూసినప్పుడల్లా, విశ్వంలో తేలియాడుతున్న వాటన్నింటినీ కప్పి ఉంచే కాస్మిక్ సింఫొనీని ఆమె గ్రహించింది.
“ఆ పెద్ద గ్రహం నీకు కనిపిస్తుందా? నీలిరంగు రంగులో ఉన్నది..? అది ఎడమ వైపున ఉంది?” అని ఆర్యన్ అడిగాడు.
“అవును, నాకు కనబడింది, ఆర్యన్,” అని మాయ అతని వైపు తిరిగి చెప్పింది. అతను టెలిస్కోప్‌పై చేతులు ఉంచి ఆమె వెనుక నిలబడి ఆమెను కౌగిలించుకున్నాడు. అతను మెల్లగా ఆమె తలని వ్యూఫైండర్ వైపుకు తిప్పాడు.
“మాయా, అది మానవాళి భవిష్యత్తు నివాసం. అది మరొక గెలాక్సీలో ఉన్న గ్రహం. మన నుండి కాంతి సంవత్సరాల దూరంలో ఉంది, కానీ అది మనకు తెలిసినట్లుగా జీవాన్ని నిలిపి ఉంచగలదు. దీనికి మన గ్రహం కంటే పెద్దదైన, ప్రకాశవంతమైన భారీ సూర్యుడు ఉన్నాడు. దీనికి మన గ్రహం లాగే అందమైన మూడు చందమామలు కూడా ఉన్నాయి. దాని నేల కూడా మన నేల లాగే ఉంది. నీరు, పర్వతాలు, మనం పీల్చుకోగలిగే గాలి ఉన్నాయి. ఒకే ఒక పెద్ద తేడా సమయం. ఆ గ్రహం దాని సూర్యుని చుట్టూ ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి మన కాలంలో ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. అంటే పగలు, రాత్రుళ్ళ నిడివి ఎక్కువ. ఋతువులు కూడా మనకంటే చాలా ఎక్కువ కాలం కొనసాగుతాయని నేను నమ్ముతున్నాను. మాయా, ఆ గ్రహంలో, కాలం మరొక అర్థాన్ని సంతరించుకుంటుంది. మనం దానిపై ఒక ప్రపంచాన్ని నిర్మించగలం, మాయా. అది అక్కడే ఉంది, విశ్వంలో దాగి, మన కోసం వేచి ఉంది,” అని ఆర్యన్ ఊపిరి పీల్చుకోకుండా అన్నాడు.
వారిద్దరూ టెలిస్కోప్ ద్వారా నీలిరంగు చుక్కను చూశారు. అది గెలాక్సీల మీదుగా దారి చూపుతున్న ఒక దీపస్తంభంలా అనిపించింది.
“మాయా, నేను నా జీవితమంతా దీని కోసమే పని చేస్తున్నాను. కొంతకాలం తర్వాత నేను దీని గురించి ప్రజలకు తెలియజేయబోతున్నాను. అందుకే, దాన్ని మొదట చూసేది నువ్వే అవ్వాలని నేను అనుకున్నాను.”
ఆ సుదూర గ్రహం వైపు చూస్తుండగా మాయకి తన దృష్టి మసకబారినట్లు అనిపించింది. గర్వించదగ్గ ఆ క్షణం ఆమెను ఓ గొప్ప భావనలో ముంచెత్తడంతో ఆమె బుగ్గల మీదుగా కన్నీళ్లు కారాయి. గాజు పలక గుండా చూస్తుంటే, ఆ గ్రహం చాలా దూరంగా ఉన్నట్లు అనిపించింది, అది దాదాపు అవాస్తవంగా అనిపించింది.
ఆమె వెనక్కి తిరిగింది, ఆర్యన్‌కు ముద్దివ్వాలనుకుంది. అతనామెను స్వల్పకాలం పాటు ముద్దాడాడు. ఆ ముద్దులో అతని శ్రమ, కన్నీరు వ్యక్తమయ్యాయి, తరువాత ఆమెను సుదీర్ఘంగా, గట్టిగా చుంబించాడు. వాళ్ళిద్దరూ చేయి చేయి కలిపి, టెలిస్కోప్ నుండి దూరంగా కదిలారు. ఆమె స్వరపరిచిన పాటలు ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో నెమ్మదిగా ప్లే అవుతున్నాయి.
“ఆ గ్రహాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసే ముందుగా, నువ్వు దానికో పేరు పెట్టాలి, ఆర్యన్. ఇది నీ ఆవిష్కరణ. సరే కానీ, మనం ఆ గ్రహానికి ఎప్పుడు వెళ్ళచ్చు? ఎందుకంటే నేను అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను,” అంది మాయ, గదిలోని ఒక మూలలో ఉన్న పెద్ద సోఫాలో పడుకుని చెప్పింది. ఆస్ట్రోనమీ టవర్‌లో ఆర్యన్ ఆఫీసుకు వచ్చినప్పుడల్లా దాని మీదే వాలుతుంది.
ఆర్యన్ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు గదిలో ప్రతిధ్వనించింది. అతను నవ్వినప్పుడు అతని ముఖం పూర్తిగా మారిపోయింది. ఒక కొంటె, బాల్యపు అమాయకత్వం అతని గంభీరమైన ముఖాన్ని ఆక్రమించింది.
“మాయా, మానవులు అంత దూరం ప్రయాణించి, అక్కడ జీవించడానికి అవసరమైన సాంకేతికతను మనం కనుక్కోడానికి చాలా సమయం పడుతుంది. వాస్తవానికి అక్కడికి వెళ్ళడానికి తగినంత కాలం జీవించే వ్యక్తులు, వారు అక్కడికి చేరుకున్నప్పుడే దానికో పేరు పెట్టవచ్చు. నేను దానిని ఎర్త్ క్లోన్ అని పిలుస్తాను, ఎలోన్ (1) అని మనం అనుకుందాం. ఆ గ్రహాన్ని కనుగొన్నది నేనేనని ప్రజలు గుర్తుంచుకుంటే నాకంతే చాలు” చెప్పాడు ఆర్యన్
వచ్చి ఆమె పక్కన పడుకున్నాడు.
వారిద్దరూ అక్కడే ఉండిపోయారు, ఒకరినొకరు హత్తుకొని, స్కైలైట్ ద్వారా మెరిసే నక్షత్రాలను చూస్తూ. మాయ అతని జుట్టులో వేళ్లు నడిపింది.
“నేను అలసిపోయాను, మాయా. ఇప్పటివరకు జరిపిన ఈ ప్రయాణం నన్ను అలసిపోయేలా చేసింది. ఇక ముందు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాను. మనం మన కలను సాధించిన తర్వాత చేయడానికి ఇంకేం ఉంటుంది? ఎవరూ దాని గురించి ఎప్పుడూ ఆలోచించరు,” అన్నాడు ఆర్యన్.
మాయ తలని తన మోచేయిపై ఆనించింది. తన పక్కన పడుకున్న ఆర్యన్ వైపు చూసింది. అతన్ని అంత దగ్గరగా చూడటం ఆమెకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
తన అలవాటు ప్రకారం, ఆర్యన్ ఆమెను తన భుజంపైకి లాక్కున్నాడు.
“నీకు మరో కల దొరుకుతుంది, ఆర్యన్. జీవితం అంటే అదే,” అని చెప్తూ, మాయ లేచి కూర్చుంది. ఆమె హెయిర్ క్లిప్ ఊడిపోయింది, దాంతో ఆమె భుజం వరకు ఉన్న కేశాలు ఆమె ముఖాన్ని కప్పేసాయి. ఆమె గంభీరంగా, ఉత్సాహంగా కనిపించింది, “ఆర్యన్, నీకీ విషయం తెలుసా, ‘మెర్జర్’ (2) ప్రాజెక్ట్ కోసం వాలంటీర్లను వెతుకుతున్నారట. వాళ్ళు మన చైతన్యాన్ని యంత్రాలకు బదిలీ చేస్తారు. ఇది జరగడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. అప్పటికి మనం ముసలివాళ్ళం అయిపోతాం, జీవితకాలం పొడిగింపు కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, బహుశా మరణానికి దగ్గరలో ఉంటామేమో. కాబట్టి, మనమిద్దరం వాలంటీర్లమై, మెషీన్లతో మెర్జ్ కావచ్చు కదా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు మనం – మనుషులు ఎలోన్‌కు తరలివెళ్ళడం గమనించగలుగుతాము, బహుశా మనం కూడా వారితో వెళ్ళవచ్చేమో. ఊహించుకో, ఆర్యన్, ఇది నీ తదుపరి కల కావచ్చు.” అంది. మాట్లాడున్నప్పుడు మాయ ఆలోచనలు ఆమె వదనానికి మెరుపునిచ్చాయి.
“మెర్జర్ కోసం దశాబ్దాల పాటు ఎందుకు ఎదురుచూడాలి? కలయిక ఇప్పుడే జరగాలని నేను అనుకుంటున్నాను” అని మాయను తిరిగి తన చేతుల్లోకి లాక్కుంటూ అన్నాడు ఆర్యన్.
మెత్తగా, మృదువుగా, మళ్ళీ మళ్ళీ చుంబించాడామెను. గోడకి ఉన్న ఓ బటన్‌ని నొక్కడంతో గదిలోని లైట్ల కాంతి బాగా తగ్గింది. ఇద్దరు వివస్త్రలై, ఒకరినొకరు హత్తుకుపోయారు. మాయ తన వీపు అతనికి అభిముఖంగా ఉంచి, అతని పొడవాటి చేతివేళ్ళను స్పృశించింది. కొన్ని క్షణాల తరువాత అతని చేతులు ఆమె ఎదపైకి ప్రాకాయి, ఆమెకి నచ్చేలా, సుతారంగా నిమిరాడు.
ఆమ అతనివైపుకి తిరిగింది. “నన్ను నిలువెల్లా తడిమెయ్ మాయా, నాకు నీ స్పర్శ నచ్చుతుంది. నువ్వు నన్ను తాకి చాలాకాలమైంది” అన్నాడు ఆర్యన్.
అతను కోరినట్టే, అతని శరీరమంతా స్పర్శించింది. అతను సమాగమనానికి సిద్ధమయ్యాడని గ్రహించింది.
ఆర్యన్ తన మీదకి వంగి, వక్షాన్ని ముద్దాడుతుంటే, తనలోనూ కోరిక తీవ్రమై, తాను రతికి సన్నద్ధమైనట్టు గ్రహించింది మాయ. అతన్ని మరింత గట్టిగా హత్తుకుపోయింది. ఆర్యన్ ఆమె చుట్టూ తన చేతులను బిగించాడు.
వాళ్ళిద్దరూ ఒకరినొకరు అల్లుకుపోతున్నారు, పెదవి పెదవీ, ఎద ఎదా, ఊరువులు, వేళ్ళూ అన్నీ కలయికకై తపించిపోతున్నాయి. మన్మథకేళిలో ఓలలాడారిద్దరూ. చిన్న మూలుగు ఆమె నుంచి.. వాళ్ళిద్దరి మధ్య ఎడమనేదే లేదు. ప్రణయ లోకంలో విహరించారిద్దరూ.
అతని వేగం పెరిగింది, క్షణకాలం ఆగి, మరింత వేగం పుంజుకున్నాడు. ఆరోహణ, అధిరోహణల రాసక్రీడ పరాకాష్టకు చేరింది. ఇద్దరికీ తమ తనువులు గాల్లో తేలుతున్నట్టుంది. ఇరువురికీ భావప్రాప్తి ఒకేసారి కలగడంతో వారి సమాగమం సంపూర్ణమైంది. అనాది కాలపు కార్యం నిర్ధారిత విధంగా సమాప్తమయింది. కళ్ళు మూసుకుని తన పక్కన పడుకున్న ఆర్యన్ కేసి చూసింది మాయ. అతను మెల్లగా కళ్ళు తెరిచాడు, చిన్నగా నవ్వి, ఆమెను తన బాహువుల్లోకి తీసుకున్నాడు. జంటగా ఆస్వాదించిన మధురమైన రతికేళిని తలచుకుంటుండంతో ఇద్దరి ముఖాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అలసిసొలసి, ఒకరినొకరు హత్తుకుని ఉండగా, “ఇప్పుడైనా ‘మెర్జర్’ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తావా?” అని అడిగింది మాయ.
ఆర్యన్ మౌనంగా ఉండిపోయాడు. కొత్త విషయాలు కనుక్కోడానికి, జీవితంలో ముందుకు సాగడానికి, వదిలేయాల్సినవాటిని వదిలేయడానికి మాయ ఎల్లప్పుడూ ఎలా సిద్ధంగా ఉంటుందా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. తాము ఇప్పుడే అనుభవించిన క్షణంలో ఉండిపోవాలనుకున్నాడు, కానీ ఆమె అప్పటికే చాలా ముందుకు వచ్చేసింది.
“ఆర్యన్, నువ్వు నీ జీవితంలో ఎక్కువ భాగం మానవాళి భవిష్య ఆవాసం కోసం అన్వేషించావు. ఇప్పుడు, భవిష్యత్తులో ఏదో ఒక రోజు దాన్ని నువ్వు చూడాలనుకోవడంలేదా? నీకు ఆ కోరిక ఎందుకు కలగదు? నన్ను చూడు; అందరినీ, ప్రతి ఒక్కరినీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను”.
ఆర్యన్‌కి ఎప్పుడైనా ఎక్కువ కాలం జీవించాలనే, ఇంకా కొంత అనుభవించాలనే కోరిక అసలు కలుగుతుందా అని ఆశ్చర్యపోయింది మాయ. అతను ఎప్పుడైనా విశ్వం యొక్క పరిమితుల నుండి బయటపడి భూమిపై జీవపు ఉత్కృష్టతని అనుభవించగలడా?
“మాయా, నేను దాని గురించి ఆలోచిస్తాను. గత కొన్ని నెలలుగా నేను చాలా బిజీగా ఉన్నాను, దీని గురించి జరుగుతున్నవేవీ నాకు తెలియవు, నేను అప్‌డేటెడ్‌గా లేను. నువ్వు చెప్పినట్లుగా, దాని గురించి నిర్ణయించుకోవడానికి మనకింకా చాలా ఏళ్ళ సమయం ఉంది. ఏమైనా, మానవ క్లోనింగ్ ప్రారంభమైందని నేను ఈ రోజు విన్నాను! మాయా, స్త్రీపురుషులు ఇకపై ప్రేమించుకోరు. మనం ఇప్పుడే పంచుకున్న దాని సంపూర్ణ సౌందర్యం, ఆనందం తెలియకపోతే ఎంత నష్టమో ఊహించు, మాయా.”
మాయ నవ్వుతూ అతని జుట్టుని తన చేత్తో సవరించింది.
“ఆర్యన్, నువ్వు ఎప్పుడూ అలాంటి వాటి గురించే ఆలోచిస్తావు. సంతానోత్పత్తి కోసం స్త్రీ పురుషులు ఒకరినొకరు అవసరం లేకుండాపోతే, ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించు. స్త్రీ పురుషుల మధ్య యుగాల తరబడి ఉన్న సంఘర్షణ, క్రోధం అంతా అంతమవుతుంది.”
“ఊఁ’ మగతగా అన్నాడు ఆర్యన్.
“రియా దీని గురించి మాట్లాడటం నువ్వు వినాలి.” చెప్తున్న మాయా, ఆర్యన్ వైపు చూసి ఆగిపోయింది. అతని కళ్ళు మూసుకుపోయాయి, అతని పొడవైన కనురెప్పలు స్పష్టంగా కనిపించాయి.
“ఆర్యన్, ప్రపంచం చాలా మారిపోయిందని నీకు తెలుసు. ఇక్కడ కూడా, ఈ ఇన్సులేటెడ్ ఆస్ట్రోనామిక్ టవర్‌లో, నువ్వు ఈ వాస్తవికత నుండి తప్పించుకోలేవు. సాంకేతికత కీలకంగా మారినందున, స్త్రీ పురుషుల పట్ల దాని తటస్థత – మన మధ్య శక్తియుక్తులను మార్చేసింది. సాంప్రదాయ జెండర్ స్ట్రక్చర్స్ కూలిపోయినందున, విభేదాలు, ఇంకా చర్చలు తీవ్రమయ్యాయి. జీవశాస్త్రంలో పాతుకుపోయిన పరిణామ పదకోశంలోనే స్త్రీపురుషులు నిమగ్నమై ఉన్నారు. జీవశాస్త్రంలో మార్పు వస్తే అన్ని సంఘర్షణలు ఆగిపోతాయి!”
“కొన్నిసార్లు నువ్వెంత తప్పుగా మాట్లాడతావో మాయా., సరే ఇప్పుడు కాసేపు నిద్రపోదాం. నా వీపు మీద కొట్టవా, నాకు నచ్చేటట్టు” అని వెనక్కి తిరిగి అన్నాడు ఆర్యన్.
🚀
ఈవీ ఆశ్చర్యంగా లేచి నిలబడింది. ఆమె ఇప్పుడే ప్రాసెస్ చేసినది తన ప్రపంచంలో ఊహించలేనిది, ఆలోచించలేనిది లేదా కల కనలేనిది. అది ఆశ్చర్యకరంగా, కలవరపెట్టేదిగా, ఇంకా కొంత స్థాయిలో, రోతగా ఉంది. ఫెన్స్‌కి (3) అవతలి వైపు ఉన్న ఆ జీవులతో ఇంత పరస్పర చర్య ఎప్పుడైనా జరిగి ఉండేదా? బహుశా అది, పురుషులు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక వింతైన పుకారు కావచ్చు. చీకటిలో నిలబడి ఉన్న ఈవీ తల అడ్డంగా ఊపుతోంది. ఆమె వింతగా, దిక్కుతోచనిదిగా అనిపించింది. మాయ కథ ఎటువంటి ఆధారం లేని ఫాంటసీలా అనిపించింది.
“నేనింక ఏమీ తెలుసుకోవాలనుకోవడం లేదు మాయా”, చెప్పింది ఈవీ, “నువ్వు వర్ణించిన జీవులు ఫెన్స్‌కి అవతలి వైపు ఉన్న జీవులలా కనిపించవచ్చు, కానీ ఆ జాతి భూమిపై చనిపోయిన జాతి అనేది స్పష్టం” అంది. కిటికీ దగ్గర చీకటిలో నిలబడి, చుట్టూ ఉన్న నగరాన్ని రాత్రి ఆవరించుకుంటుండగా, అలవాటైన ఆ చీకటిని అనుభవించడానికి ప్రయత్నించింది.
ఎలోన్‌ను కనుగొన్నది ఓ పురుషుడా? ఇప్పటి దాకా తనకి ఎవరూ ఎందుకు చెప్పలేదు? అదే నిజమైతే, పురుషులు ఆడవాళ్ళని కూడా ఎలోన్‌కు ఎందుకు తీసుకువచ్చారు? మొత్తం కథ ఒక కుట్ర లాగా ఉంది. టియోనీ అక్కడే ఉండిపోయింది. ఈవీ ఆకస్మిక కదలిక – మాయ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. స్త్రీపురుషులు ఇంత నాటకీయమైన శారీరకంగా తీవ్రమైన కార్యకలాపాలను పంచుకున్నారా. ఇది ఊహించలేనిది. అలాంటిది చేయమని వారిని ఏది ఒత్తిడి చేసింది? ఆ శారీరక చర్య వారిద్దరికీ ఆ కార్యాచరణలో మునిగిపోతున్నప్పుడు వింత ఆనందాన్ని కొంత అందించినట్లు అనిపించింది. ఇది పరాయిదిగా, కొత్తగా, అర్థం చేసుకోలేనిదిగా అనిపించింది.
టియోని స్క్రీన్ దగ్గర కూర్చునే ఉంది. భూమిపై సృష్టి ఎలా జరిగిందో కథలో స్పష్టం కాలేదు. అదొక ఫాంటసీ అయినప్పటికీ, మాయ కథ మనోహరంగా ఉందని టియోనీ భావించింది.
“మాయా? అప్పుడు సృష్టి ఎలా జరిగేది? రియా పదే పదే ప్రస్తావిస్తున్న ఈ ‘నాన్న’ ఎవరు? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? మీ క్రియేషన్ (4)?”
జవాబుగా యంత్రపు నిశ్శబ్ద హమ్ మాత్రమే వెలువడింది.
“మాయా, వెళ్ళిపోవద్దు. దయచేసి నీ కథను పూర్తి చేయ్”, టియోనీ పట్టుబట్టింది.
“నేను ఎక్కడికీ వెళ్ళలేదు. ఈవీ ఆకస్మికంగా వెళ్ళిపోయేసరికి, కథ లో ఊపు పోయింది. సరే, స్త్రీ శరీరం పిల్లల్ని కనేందుకు సిద్ధమయ్యాకా, ఒక పురుషుడు, స్త్రీ ప్రేమలో పడితే, సృష్టి జరిగేది. శారీరక సాన్నిహిత్యం సంతానోత్పత్తికి దారితీసింది. కొన్నిసార్లు ఫలదీకరణాలు బయట కూడా జరిగేవి, కానీ స్త్రీలు ఎల్లప్పుడూ తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి బాధాకరమైన, శ్రమతో కూడిన ప్రక్రియ ద్వారా జన్మనిచ్చేవారు. ‘నాన్న’ అనేది పిల్లలు తమ తండ్రి అయిన పురుషుడిని సూచించడానికి ఉపయోగించే పదాలలో ఒకటి. సృష్టికి స్త్రీపురుషులు ఇద్దరూ అవసరం, టియోనీ. అనాది కాలం నుండి మేము సంతానోత్పత్తి కోసం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉన్నాం. ఎక్కడో, అది మారిపోయింది. కాబట్టి, ఇప్పుడు తార నువు మాత్రమే అందించిన కణం నుండి సృష్టించబడి, ఇన్‌క్యుబేటర్‌లో పెంచబడుతోంది. ఆమె రూపం పూర్తిగా ఏర్పడిన తర్వాత ఆమెను మీకు అప్పగిస్తారు. మరోవైపు, పురుషులు కూడా అదే చేయగలరు. పునరుత్పత్తి కోసం మీకు ఇకపై ఒకరినొకరు అవసరం లేదు. నాగరికతకు ఆధారం మారిపోయింది.”
టియోనీ ఈ సమాచారాన్నంతా గ్రహించింది. ఆమె తలలో చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి.
“రియా ఎక్కడ ఉంది? ఆమె నాన్న అని పిలిచిన వ్యక్తి ఎవరు?” టియోనీ మళ్ళీ అడిగింది.
మాయ సమాధానం చెప్పేలోపు, ఈవీ అకస్మాత్తుగా వచ్చి వర్క్‌స్టేషన్ దగ్గర కూర్చుంది.
“ఆ స్త్రీ పురుషుల మధ్య ఈ ‘ప్రేమ’, దాని అర్థం ఏమిటి? నేను లెక్సికాన్‌ను చూసాను, అది ‘ప్రేమ’ను ‘ఎవరి కోసమైనా లేదా దేనికోసమైనా కలిగే లోతైన అనుభూతి’గా నిర్వచిస్తోంది. అది ఏమిటి, మాయా?” అని అడిగింది.
గలగలమంటూ మాయ నవ్విన నవ్వు గదిలో పేరుకున్న ఒత్తిడిని చెదరగొట్టింది. బయట, రాత్రి అదృశ్యమవుతోంది మరియు ఒక మసక కాంతి నగరాన్ని ఆవహిస్తోంది.
‘అదో పరిహాసం అమ్మాయిలు. లక్షలాది కాంతి సంవత్సరాల దూరంలో, ఇకపై ఆ పదాన్ని కూడా ఉపయోగించని ప్రపంచంలో, ప్రేమ అనే పదం అర్థం ఇప్పటికీ మానవాళిని అయోమయంలో పడేస్తుంది. ప్రేమను అనుభవించే వ్యక్తికి అది ఏదైనా సరే; అది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఇది గాయపరచవచ్చు, బాధపెట్టచ్చు. కానీ నాకది శక్తి, సానుకూల శక్తి. స్వీకరించేందుకు ఇష్టం లేని వ్యక్తులకు కూడా, అది జీవితంలోని వివిధ కోణాలకు ఇంధనంగా మారుతుంది.” చెప్పింది మాయ.
“మాయా, ఆర్యన్‌ది తప్పు. మనమందరం అతను ఈ గ్రహానికి ఇచ్చిన పేరు ‘ఎలోన్’ను ఉపయోగిస్తున్నప్పటికీ, దానిని ఎవరు కనుగొన్నారో ఎవరికీ తెలియదు” అంది ఈవీ.
టియోనీ కొంచెం ఆశ్చర్యపోయింది. మాయ కథ గురించి ఈవీ మనకుకి తాకిన విషయాలు భిన్నంగా ఉన్నాయి, ఆమెను ప్రభావితం చేసిన వాటికి చాలా భిన్నంగా ఉన్నాయి.
“అవును, ఈవీ, కొన్ని విషయాలలో అతనిదే తప్పు. మరికొన్నింటి విషయాలలో తప్పు నాది” అంటూ నిట్టూర్చింది మాయ. ఆమె స్వరం నెమ్మదిగా మందగిస్తోంది; ఆమె మళ్ళీ వ్యవస్థ యొక్క చీకటి గుహలలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది.
“ఏ విషయంలో నీది తప్పు అని అనుకుంటున్నావా, మాయా?” అనే ప్రశ్న వేసి, ఆమెను వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నించింది ఈవీ.
“సంతానోత్పత్తి కోసం స్త్రీ పురుషుల అవసరం ఒకరినొకరికి లేకుండా పోయాకా, సంఘర్షణ ఆగలేదు. అది రెక్కలు తొడిగింది, మన ఊహకు అందని విధంగా పెరిగింది. అది మనలో ఎవరూ ఊహించలేని రూపాన్ని తీసుకుంది. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి!” అంది మాయ.
(సశేషం)
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(2) Merger, మెర్జర్ = మనుషులు తన చైతన్యాన్ని యంత్రాలకు బదిలీ చేసి శరీర రహితంగా సజీవంగా ఉండిపోయే ప్రక్రియ
(3) Fence ఫెన్స్= సరిహద్దు
(4) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
