1
తేనెటీగలకు
పూలమీద ఆశ
తమకు మకరందాన్ని
అందిస్తవని
2
నిరాశ నిస్పృహలతో
జీవితం నిస్సారం
వానిని
దరిచేరనివ్వకు
3
పేరాశే పెను
తుఫాన్లు సృష్టించు
పరిమితాశే
సుఖప్రదం
4
ఆశల పల్లకిలో
వూరేగుతా
ఆనందాల అంచున
చేరుతా
5
ఆశ నిరాశలతోనే
జీవితం
సాగి పోతుందలా
తుది శ్వాస వరకు
6
ఆశే బ్రతుకును
నడిపించు
ఆశతోనే సుఖంగా
జీవించు
7
దురాశ
దుఃఖానికి దారి
మంచి ఆశతో
మహదానందకరం
8
ఆశించింది
దక్కాలి
మహదానందంలో
వూగిసలాడిపోవాలి
9
ఆశ లేనిదే
జీవితమే లేదు
ఆ జీవితమే
మహా సాగరం
10
ఆశకు
అంతూ పొంతూ ఎక్కడ?
దానికి
పరిమితులుండాలి
11
ఆశ తీరకపోతే
నిట్టూర్చకు
మరొక్క ఆశ
నీ వెంటనే ఉంటుంది
12
ఆశ నిరాశల
పోరాటం
చివరకేది గెలుస్తుందో
ఎవరికి ఎరుక
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.