[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఆట’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మాట వినని మనసు
అక్షరాల తోట పూసిన పూలు
కొత్త ఫలాలు పులుపు
రుచిచూసే నాలుకకు
కలం స్నేహం లేదు పరిచయం అసలే లేదు
రెపరెపల గాలి వీచిన కవిత
అద్దంలో చూపు కోసం తట్టిన తలుపు
మూసుకున్నది
‘మనవి’ మాట వినని ఆటలో వాకిలి
ఆభరణాల మెరుపులు లేవు
సలాం సంభాషణ లేదు
ప్రతిబింబించకుంటే కవిత
కవిని కానలేరు ఎవరూ!
దర్పణమే జీవితమైన
ఇంకెన్ని చిత్రాలు కనులు తెరుచునో మరి
కొత్తగా కనిపించింది నిన్నటి చంద్రగ్రహణంలా తరం మారి
కానీ పాత తరం కలమే ఇది
అయినా
దరువులో బంతి ఎప్పుడెలా దరిజేరునో
ఎగిరే అద్దం ఎవరిని ఎంచుకునునో
కవిత్వానికే తెలియని రహస్యం
స్థిరత్వమే కలం నడక కవిత్వ మైదానంలో
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
