“ఏదో ఒక ఉత్తమ సందేశం మనసుకు హత్తుకొనేటట్లు చేయడానికి కథకన్నా ఉత్తమమైన సాధనం వేరొకటి లేదు”. సామాజిక స్పృహగలిగి, సాహితీ విలువలతో కూడిన కథలను రచయిత(త్రు)ల నుండి ‘విశాఖ సాహితి‘ ఆహ్వానిస్తోంది.
- ప్రథమ బహుమతి: 5,000 రూపాయలు
- ద్వితీయ బహుమతి: 3,000 రూపాయలు
- తృతీయ బహుమతి: 2,000 రూపాయలు
ఈ మూడు బహుమతులు కీ.శే. ఆచార్య వెలమకన్ని భరద్వాజ గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేయబడినవి. సాధారణ ప్రచురణకు ఎన్నికైన పది కథల రచయిత(త్రు)లకు ‘విశాఖ సాహితి’ పుస్తకాలు బహూకరిస్తుంది.
సౌలభ్యం కోసం కొన్ని నియమాలు:
- కథల నిడివి సుమారు 1000 నుండి 1200 పదాల వరకు ఉండాలి.
- కథలను యూనికోడ్ లో కాని, ఎమ్మెస్ వర్డ్ (MS Word) లో కానీ పంపాలి. ఒక రచయిత ఒక కథ మాత్రమే పంపాలి.
- కథలు వాట్సాప్ లో గాని, ఈమెయిల్ కి గాని పంపాలి. వాట్సాప్ నంబర్ 8464935739; ఈ మెయిల్: sailisp@gmail.com
- ఇతివృత్తం తెలుగువారి జీవన స్రవంతిలోనిదై ఉండాలి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల చిత్రణ వాంఛనీయం.
- కథ మొదటి పేజీ మీద ‘విశాఖసాహితి జన్మదిన ప్రత్యేక సంచిక కథల పోటీకి’ అని రాయాలి. రచయిత పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, రచయిత వివరాలు వేరే పేజీలో ఉండాలి. కలం పేరు ఉపయోగించినప్పటికీ పూర్తి పేరు పేర్కొనాలి.
- కథ దేనికీ అనువాదంగాని, అనుసరణగాని కాదని, ఇతర సామాజిక మాధ్యమాలలో ప్రచురింపబడలేదని హామీ పత్రం జత చేయాలి.
- ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన కథలు ‘విశాఖసాహితి’ జన్మదిన సంచిక (ఏప్రిల్, 2023) లో ప్రచురిస్తాము.
- కథలు పంపుటకు ఆఖరి తేదీ: 5, మార్చి 2023; రాత్రి 10 గం.ల వరకు (10 PM, IST).
- కథల ఎంపిక విషయంలో సంపాదకవర్గానిదే తుది నిర్ణయం.
- మొదటి మూడు బహుమతులు గెల్చుకున్న కథకులు, 4-4-2023 తేదీన జరుగబోవు ‘విశాఖ సాహితి’ వ్యవస్థాపక దినోత్సవ సభకు విచ్చేసి, బహుమతులు స్వీకరించగోరుతున్నాము.
- స్వీకరించని కథలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పి పంపబడవు.
కార్యదర్శి, విశాఖ సాహితి