Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అద్దము

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘అద్దము’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కుంభాకారంకాదు
పుటాకారం కాదు
సమతల దర్పణం
దాని ముందు నిలబడి
తీక్షణంగా తిలకిస్తుంటే

సవాలక్ష వంకర్లను
సరిదిద్దుకోను చక్కని
అవకాశాన్ని కల్పించి
వన్నెను చేకూర్చింది
అందానికి అద్దము

జుట్టుకు రంగద్దుకోను
కేశాలంకరణ చేసుకోను
ఈ ముడుతల దేహానికి
గొప్ప రహస్యాన్ని నేర్పింది
ముందరున్న అద్దము

ఎన్నో కోణాల్లో చూసుకోను
లేపనాలు ఎన్నో పూసుకోను
ముఖకాంతిని పెంచుకోను
వక్రాలెన్నో కప్పిపుచ్చుకోను
అద్దం చాలా దోహదపడింది

బాహ్య అవలక్షణాలన్ని
అద్దము చూపించినట్లే
మనస్సులోని మలినాలను
చూపగల్గే వస్తువుంటే బాగుండు
వేలెత్తి చూపి వెక్కిరించడానికి
అన్యద అవకాశం దొరికేది కాదు

Exit mobile version