Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అదిగదిగో.. క్రొత్త సంవత్సరం..!!

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘అదిగదిగో.. క్రొత్త సంవత్సరం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

2024-
సంవత్సరాంతానికి,
సిగ్నల్ యిచ్చే
క్రిస్మస్ పండుగ
అలావచ్చి-
ఇలా వెళ్లిపోయింది!
2025-
నూతన సంవత్సరం వైపు,
రోజులు వడివడిగా
పరిగెడుతున్నాయ్..!
క్రొత్త సంవత్సరంలో
ఏదో క్రొత్తజీవితానికి
ఒకటే ప్రాకులాట..!
ఆశ-ఆలోచనల్లో..
దిద్దుబాటులేని
బద్దకపు జీవితాల్లో
ఎన్ని కొత్త సంవత్సరాలు
వచ్చినా..
పెద్దగా మార్పంటూ వుండదు!
నూతన చైతన్యంతో
ఆశాజీవిగా-
కష్టపడుతూ-క్రమశిక్షణతో
ముందుకు సాగిపోయే వారికి
ప్రతి నిముషం
క్రొత్తదనమే..!
ప్రతి రోజు ఆశాజనకమే..!!

Exit mobile version