Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏయ్

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ఏయ్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


య్
నిన్నటి వరకు
అది తిట్టు అనుకున్నా
బెదిరింపు అనుకున్నా
అది ఓ అందమైన పిలుపని
తీయని కోయిల స్వరమని
ఇపుడే తెలుసుకున్నా
అదేమిటో తిట్లు కూడా
ఇష్టమైపోతున్నాయి
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నాయి
గుడిలో గంటా నాదంలా
మెల్లగా సాగే గోదారి వేదంలా
వినిపిస్తున్నాయి
మైమరిపిస్తున్నాయి
నీతో ఏయ్
అనిపించుకోవడానికే
ఎన్ని తప్పులైనా
చేయాలనిపిస్తొంది
అందమైన తిట్టు కోసం
అది తప్పనిసరి అనిపిస్తోంది
బడిలో బెత్తంతో నన్ను తరిమే
పంతులయ్య అనే ఏయ్
నన్ను జీవితంలో ఎదగనిస్తే
నీ చూపుల బెత్తంతో
ఏయ్ అని అంటూంటే
మనసు పొరల్లో అలా
ఒదిగిపోవాలనిపిస్తోంది
ఏయ్ అన్న మాట కోసం
ఎందాకైనా పోవాలనిపిస్తోంది..

Exit mobile version