Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ఆలంగీర్ ఔరంగజేబ్ అను అబుల్ ముజఫర్ మొహి-ఉద్-దీన్-ముహమ్మద్!!!!’ కొత్త ధారావాహిక – త్వరలో

రంగజేబ్ గొప్ప దయాళువు.

టోపీలు కుట్టి బ్రతికాడు. హిందుస్తాన్ సమస్తానికి రాజయినా నిరాడంబరంగా, సన్యాసిలా బ్రతికాడు.

ఔరంగజేబ్ హిందువులకు దానాలిచ్చాడు. దేవాలయాలకు దానాలిచ్చాడు.

ఔరంగజేబ్ గొప్ప ముఘల్ రాజు….

~

ఔరంగజేబ్ క్రూరుడు. దుర్మార్గుడు….

భారతదేశ చరిత్రలో ఇంతటి రాక్షసమైన, నిర్దాక్షిణ్యమైన సుల్తాన్ మరొకరు లేరు….

శంభూజీని చిత్రహింసలు పెట్టి రాక్షసంగా చంపించాడు.

సిఖ్ఖు గురువును అతి ఘోరంగా చంపించాడు.

జీజియా పన్ను విధించాడు. మందిరాలు ధ్వంసం చేయించాడు.

దేశాన్ని ఇస్లామ్ మయం చేయాలని కంకణం కట్టుకున్నాడు.

ఔరంగజేబ్ ఎంతటి క్రూరుడంటే, అతని సమాధిని కూడా పెకిలించివేయాలి….

~

మరణించిన నాలుగువందల ఏళ్ళ తరువాత కూడా ఇంతటి తీవ్రమైన పరస్పర విభిన్నమైన భావనలను కలిగిస్తూ, ప్రజల నడుమ అడ్డుగోడలు నిర్మిస్తున్న  ఔరంగజేబ్ ఎవరు?

ఔరంగజేబ్ గొప్ప సుల్తానా? క్రూర కర్కోటక రాక్షస రాజా?

గుడులు కూల్చినవాడా? పరమత సహనం ప్రదర్శించినవాడా?

ఎవరు ఔరంగజేబ్? ఔరంగజేబ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి?

సంచికలో త్వరలో….

‘ఆలంగీర్   ఔరంగజేబ్

               అను

అబుల్ ముజఫర్ మొహి-ఉద్-దీన్-ముహమ్మద్!!!!’

తప్పక చదవండి..

చరిత్ర రచనలో ఉన్నత ప్రామాణికాలు, ఉత్తమ విలువలు పాటిస్తూ అందిస్తున్న ప్రత్యేక రచన..

‘ఆలంగీర్   ఔరంగజేబ్

               అను

అబుల్ ముజఫర్ మొహి-ఉద్-దీన్-ముహమ్మద్!!!!’

Exit mobile version