[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా క్రిస్ విటేకర్ రచించిన ‘ఆల్ ది కలర్స్ ఆఫ్ ది డార్క్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
క్రిస్ విటేకర్ రచించిన ‘ఆల్ ది కలర్స్ ఆఫ్ ది డార్క్’ అనే నవల అన్ని జానర్లకూ అతీతమైనది. థ్రిల్లర్, మిస్టరీ, లవ్ స్టోరీ, డొమెస్టిక్ డ్రామాల మేళవింపు ఈ నవల. ఒకే కన్నుతో జన్మించిన ప్యాచ్ మెకాలే అనే బాలుడి చుట్టూ కథ కేంద్రీకృతమై ఉంటుంది. ఆ పిల్లాడు, ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని కిడ్నాప్ నుంచి రక్షించి, తన సామర్థ్యాన్ని చాటుకుంటాడు. ఈ ఘటన మరెన్నో సంఘటనలకు దారితీస్తుంది, ఇవి ప్యాచ్ జీవితాన్ని పలు రకాలుగా ప్రభావితం చేస్తాయి.
క్రిస్ విటేకర్ రచనాశైలి ప్రేరణాత్మకంగా, ఉత్తేజకరంగా ఉంటుంది, పాఠకులను కథనంలో లీనం చేసేలా స్పష్టమైన సన్నివేశాలను చిత్రిస్తుంది. చిన్న అధ్యాయాలు, ఆకర్షణీయమైన వాక్యాల ప్రయోగం కథను ముందుకు నడిపిస్తుంది, దాంతో పుస్తకాన్ని పక్కన పెట్టడం దాదాపు అసాధ్యమవుతుంది.
ప్యాచ్ ఆప్త మిత్రురాలు సెయింట్, ఇంకా ఊహాత్మక పాత్ర గ్రేస్‌తో సహా అన్ని పాత్రలు నవలలో స్పష్టంగా చిత్రీకరించబడ్డాయి. ఇవి మరపురానివి. ప్రతి పాత్ర కథకు లోతుని, సూక్ష్మ వైవిధ్యాన్ని జోడిస్తుంది. ఈ నవల ఇతివృత్తంలో – వేదననీ, లోటునీ, మానవుల స్ఫూర్తినీ, ఓర్పునీ ప్రదర్శిస్తుంది.
‘ఆల్ ది కలర్స్ ఆఫ్ ది డార్క్’ నవల ప్రధానంగా వేదన యొక్క ‘ripple effects’ (ఒక ఘటన అనేక సంఘటనలకు దారితీయడం) పైనా, జనాలు తమ లోటుని, భయాన్ని ఎలా ఎదుర్కుంటారనేదానిపైనా లోతైన వ్యాఖ్య. తగువులమారి బాలుడి నుంచి ఓ ప్రఖ్యాత కళాకారుడిగా ప్యాచ్ ఎదిగిన వైనం పరివర్తనను సూచించగా, న్యాయం కోసం సెయింట్ అలుపెరగకుండా చేసిన పోరాటం – న్యాయం కోరటంలోని నైతికపరమైన చిక్కులని ప్రస్తావిస్తుంది. ప్యాచ్, సెయింట్‍ల బంధం ద్వారా ఈ నవల పరస్పర విశ్వాసం, పట్టుదలని ప్రదర్శిస్తుంది, తద్వారా క్రుంగదీసే కష్టాలను తట్టుకోవడంలో మానవ సంబంధాల శక్తిని వెల్లడిస్తుంది.
క్రిస్ విటేకర్
క్రిస్ విటేకర్ రచనలని లిటరరీ ఫిక్షన్‍లో మాస్టర్‍పీస్‌లుగా అభివర్ణిస్తారు, ‘ఆల్ ది కలర్స్ ఆఫ్ ది డార్క్’ ఇందుకు మినహాయింపు కాదు. ఈ నవల పాతికేళ్ళ కథాకాలాన్ని ఇముడ్చుకుని, అనేక జానర్లను మేళవించి, ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా చదివించేలా చేస్తుంది. కొన్ని నాటకీయ సన్నివేశాలు, మరికొన్ని నిశ్శబ్ద క్షణాలతో నిండిన ఈ నవలలోని కథ, పరిపూర్ణంగా ఆకట్టుకునేలా, సమతౌల్యంతో ఉంటుంది. పాఠకులలో ఎన్నో ఆలోచనలలు రేకెత్తించే కథను అల్లడంలో విటేకర్ సామర్థ్యం – ఆయన పాఠకులను చేయించే భావోద్వేగ ప్రయాణంలో స్పష్టంగా తెలుస్తుంది, ఈ నవలను ప్రత్యేకంగా చదవాల్సిన పుస్తకాలలో ఒకటిగా చేస్తుంది.
మిస్సోరిలోని మోంటా క్లేర్, ఓజార్క్స్‌ని కథాప్రాంతంగా ఎన్నుకోవడం కథకు గొప్ప నేపథ్యాన్ని అందించింది, ఇంగ్లాండ్‌లో విటేకర్ నేపథ్యాన్ని బట్టి అతని స్థల భావన గమనార్హమైనది. స్పష్టమైన వర్ణనలు, కవితాత్మక భాషని వాడడం వల్ల అమెరికన్ ప్రకృతి దృశ్యాలు – కూడా నవలలోని పాత్రల్లాగా మారుతాయి, కథనం గాఢమవుతుంది. నవల నిడివి పెద్దదే అయినప్పటికీ – చిన్న అధ్యాయాలు, పదునైన వాక్యాలు కథ వేగంగా సాగేలా చేస్తాయి.
వేదనని – వ్యక్తిలో పరివర్తనకు దోహదకారిగా వాడుకుంటూ, పాత్రల ఉద్దేశాలను, ప్రవర్తనలను, బంధాలను ప్రభావితం చేస్తూ సాగుతుంది నవల. నిర్దిష్టమైన వివరాలు లభించనప్పటికీ, సాహిత్యం తరచూ ‘వేదన’ని – మానసిక ఒత్తిడి, ప్రవర్తనలో మార్పులకు, తుదకు స్వస్థతకు – ఉత్ప్రేరకంగా ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. ఈ నవలలోని పాత్రలు ఆందోళనకు, నిర్లిప్తతకు గురికావచ్చు, స్వీయ-వినాశన ధోరణులను అవలంబించవచ్చు; కష్టాల నుంచి విముక్తి కోసం సడలని పట్టుదలని ప్రదర్శించవచ్చు. వ్యక్తిగత ఎదుగుదల, మద్దతు వ్యవస్థలు, సృజనాత్మక వ్యక్తీకరణ, వేదన వృత్తాంతాలు – మానవుల అనుభవాలలోని సంక్లిష్టతలను, జీవితాన్ని గాడిలో పెట్టేందుకు నడవాల్సిన బాటలని చూపుతాయి.
‘ఆల్ ది కలర్స్ ఆఫ్ ది డార్క్’ అనేది ఒక గాఢమైన భావోద్వేగాన్ని కలిగించే ఉత్కంఠభరితమైన నవల. ఇది చివరి పేజీ చదవడం పూర్తయిన తర్వాత కూడా పాఠకుల మనసులలో తచ్చాడుతుంది. రచయితగా క్రిస్ విటేకర్ నైపుణ్యానికి ఇది నిదర్శనం, అతను చాలా గాఢమైన, పాఠకులను మంత్రముగ్ధులను చేసే – ఆశ, సానుకూల భావాలతో నిండిన కథలను అల్లగలడు. ఈ నవల చదవడం, పంచుకోవడం మరియు గుర్తుంచుకోవడం అవసరం, ఏ రకం శైలిని అభిమానించే వారైనా తప్పక చదవవలసిన నవల. విభిన్న జానర్లు, మరపురాని పాత్రల ప్రత్యేకమైన మేళవింపుతో, ‘ఆల్ ది కలర్స్ ఆఫ్ ది డార్క్’ లిటరరీ ఫిక్షన్‍పై శాశ్వత ప్రభావాన్ని చూపనుంది.
***
Author: Chris Whitaker
Published By: Orion
No. of pages: 592
Price: ₹1,199
Link to buy:
https://www.amazon.in/All-Colours-Dark-Chris-Whitaker/dp/139870766X/
స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తస సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.