Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ భాషను మించు అవని మీదను లేవు

[తెలుగు భాష ఘనతపై పద్య కవితలను అందిస్తున్నారు డా. బి. మల్లయా చారి.]

1.
సీ.:
అమ్మ భాషను మించు అవని మీదను లేవు
కమ్మని భావాలు కలిసి వచ్చు.
తడబాటు లేకను ఒడిలోన నేర్చినా
బుడి బుడి మాటల బుద్ది పేరుగు
తప్పటడ్గుల నాడు యొప్పిన ఈ భాష
పరిసరాలను కూడ పరుచు కొనును.
పలుక బలప మందు పలుక రించిన భాష
గురువుబోధ తోడ గుణము పెరుగు

ఆ.వె.:
పలుకు బడుల నెన్నొ కలుపు కొనుచు నీలొ
వన్నె దిద్దు కొనుచు పరుగు లిడును
పోడుపు కథలు పొడువ విడుచు మార్గాలెన్నొ
ప్రజ్ఞ నిచ్చి మనల విజ్ఞు చేయు

2.
ఆ.వె.
ఇతర భాష లెన్ని యింపుగా నున్నను .
వ్యాస రచన చేయు ధ్యాస యున్న
పోష నేంత నున్న గాస మెంతగ నున్న
ఆత్మ లోని భాష అమ్మ భాష.

సీ. :
సకల భాషల తల్లి సంస్కారమును పెంచు.
మాట మర్యాదతో మాన్యు చేయు.
కన్న ఊరు సొగసు కంఠాన నిల్వగా
పక్క భాషల మధ్య పలుకగలదు.
దేశ ప్రాంతాలందు వేష ధోరణు లందు
పదవి ప్రజ్ఞల యందు మోదమిచ్చు
కాని కష్టాలందు కనిపెట్టి బోధించు
ఆనంద సమయాన్ని ఆల కించు.

ఆ.వె.:
మాతృ భాషలోని మధు పానియము గ్రోలి
అమర శక్తి గాను అవని నుండు.
పరమ పావ నాత్మ పండితాత్ములు మెచ్చు
అమ్మ ఒడిల భాష ఆలపించు.

Exit mobile version