Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ కడుపు చల్లగా-73

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు బాగా పుంజుకున్న మాట నిజమే. అయితే ఈ కార్యక్రమాలలో సగానికి సగం మూస విధానంలోనే జరుగుతున్నాయి. ఈ విధానంతో త్వరగా పెరిగే ఒకే రకం (మోనోకల్చర్) విధానాన్ని అవలంబించడం జరుగుతోంది. ఉదాహరణ – యూకలిప్టస్, వెదురు వంటి రకాలు. ఇవి త్వరగా పెరుగుతాయి. పచ్చదనం త్వరగా ఆవరిస్తుంది. ఉపగ్రహ ఛాయా చిత్రాలలో అటవీ విస్తీర్ణం బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. రికార్డు కూడా అవుతుంది. కానీ వాస్తవంలో అక్కడ జీవవైవిద్యమేమీ తగినంతగా పెంపొందదు. 2024 అధ్యయనం ప్రకారం ఆఫ్రికాలో అటవీ పునురద్ధరణకు కేటాయించినది సవన్నాస్. ఇది చెట్లకు నప్పని వ్యవస్థ.

B.G.C.I. (బొటానికల్ గార్డెన్స్ కన్వర్వేషన్ ఇంటర్నేషనల్) సంస్థ సెక్రటరీ జనరల్ పాల్ స్మిత్. జీవవైవిద్యాన్ని పెంపొందించ గల రీతిలో పునరాద్దరణ కార్యక్రమాలు జరగటం లేదు. ఈ లోపాన్ని సరిచేయడానికి/పూరించడానికి T.G.B.S (ది గ్లోబల్ బయోరైవర్సిటీ స్టాండర్డ్ 2024) ఏర్పాటు చేయబడింది. రూథ్ కామ్నిట్జర్ దీనిని ప్రారంభించారు. ఇది రిస్టోరేషన్ పథకాలు అవీ జీవవైవిద్యాన్ని మెరుగుపరడం/ పెంపొందించడంలో తగినంత దోహదం చేసిన వాటిని సర్టిఫై చేస్తుంది. అది పర్యావరణ సంబంధిత ఫలితాలను లెక్కలేస్తుంది. ప్రాజెక్టుల ఉపగ్రహ చిత్రాలకు సంబంధించ దృశ్యాలను బట్టి భూతల సర్వేని చేపట్టి ప్రాజెక్టు ఫలితాలను అంచనా వేయడం జరుగుతుంది. పర్యావరణ వ్యవస్థ సమగ్రతను 8 అంశాల (పాయింట్ల) క్రైటీరియా ఆధారంగా లెక్కగట్టడం జరుగుతోంది (పరిరక్షణ, Stake holding). ఫలితాలు T.G.B.S సచివాలయంలో పునఃపరిశీలించబడతాయి. అప్పుడే అక్కడే రికార్డు చేయడం జరుగుతోంది. ఈ T.G.B.S సచివాలయం B.G.C.I. ఆధ్వర్యంలో నడుస్తుంది. ఒక independent third party ద్వారా నిర్ధారిత వ్యవధిలో ఆడిటింగ్ సైతం జరుగుతుంది. నిర్వహణ విధానాలు ఫలితాలు ఆధారంగా ప్రాజెక్టు స్టాండర్డ్, అడ్వాన్స్‌డ్ ప్రీమియమ్, లెవల్స్ సర్టిఫికేషన్స్‌లో నమోదు చేయబడతుంది. స్థానిక నిపుణలు సాంఘిక సందర్భాలతో బాటు తెగలు, జాతులు వంటి వాటిని కూడా సమగ్రంగా అర్థం చేసుకొని గుర్తించగలగుతారు.

ఉగాండా పశ్చిమ ప్రాంతంలో జేన్ గూడాల్ ఇన్‌స్టిట్యూట్ – బుడాంగో బుగోమా అడవులకు అనుబంధంగా ఒక వైల్డ్‌లైఫ్ కారిడార్‌ను పునరుద్ధరిస్తోంది. మొట్టమొదటి అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ఈ ప్రాజెక్టుకు లభించింది. కారణం –

ఈ ప్రాజెక్టు కృషి ఫలితంగా ఇక్కడ స్థానిక మొక్కలు/వృక్షజాతులు పెరిగాయి. అడవిపై ఎక్కువగా ఆధారపడే పక్షిజాతులూ గణనీయంగా పెరిగాయి. ఇక్కడ జరిగిన చిత్రం ఏమిటంటే అడవుల క్షీణత/degrade కు కారణం అయినవారే పునరుద్ధరణకై నడుం బిగించారు. మ్యూట్‌గెకి అన్న అధికారి పునరుద్ధరణ ఫలితాల అంచనాలలో పాల్గొన్నారు. ఇటువంటి పథకాల అమలులో సర్టిఫికేషన్ ప్రోత్సాహకారిగా పనిచేస్తుంది. సర్టిఫికెట్ లభించిన చోట్ల అది కృషికి గుర్తింపుగాను, ఫలితాలకు దృవీకరణ పత్రం గానూ ఎంచి మరింత ఉత్సాహంగా పని చేయడానికి స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రక్రియలో విఫలమైన ప్రాజెక్టులకు కూడా తిరస్కృతి లేకపోవడం విశేషం. వాటికి తగిన మార్గదర్శకత్వం చూపించడం జరుగుతోంది. ఈ సర్టిఫికేషన్ విషయంలో ఎన్ని చెట్లు, ఎంత విస్తరణ అన్నది నిమిత్తమాత్రమే! అక్కడి ప్రజలతో సహా ఎంత వైవిధ్యం, జీవకళ ఉందన్నదే లెక్క.

Exit mobile version