[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘అంసపొది కట్టె’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ ప్రపంచానికి
నా పరివారానికి
నాతో పని లేదు
ఈ కుటీరానికి
నా కుటుంబానికి
నాతో అక్కర్లేదు
ఈ నవీనకతకి
నా చాదస్తానికి
ఏ సోపతి లేదు
ఐనా నేనిప్పటికి
ఒడలు వంగని
అంసపొది కట్టెను
బాధ్యతలను మోసే
వ్యక్తి భుజ మార్పుకు
బాసటగా జీవిస్తాను
