[మానస రెడ్డి గారు రచించిన ‘అనాథ’ అనే కవితని అందిస్తున్నాము.]
ఇంటి గురించి అంత అంటారు, మమతలతో అది నిర్మితమవుతుందని,
కానీ నేను పెరిగింది నిశ్శబ్దాల మధ్యలో.
నా రాత్రులలో జోలపాటలు వినలేదు,
“ఏమైందో?” అనే ప్రశ్న మాత్రమే.
నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను
కన్నీళ్లు పడకముందే మింగడం,
ఎక్కడో నాకు చోటుంది అన్నట్టు నవ్వడం,
నా పేరు ప్రతిధ్వనిగా తిరిగి రాకపోయినా.
పండుగలు రంగులతో వచ్చాయి,
కానీ అవి నా దాకా రాకముందే మసకబారిపోయాయి.
పట్టుకునే చేతులు లేవు,
“నా వాళ్లు” అనిపించే స్వరం లేదు,
కాంతి మాయమైనప్పుడు మాయమయ్యే నీడలు మాత్రమే.
ఇతర పిల్లలు ఒడిలోకి పరుగెత్తడం చూసా,
వారి బరువు, వారి వెచ్చదనం తెలిసిన ఆ ఒడులు,
అప్పుడు నేను ఆలోచించాను
ఎవరికైనా “ఎప్పటికీ” ఉండడం అంటే ఎలా ఉంటుందో?
నా కలలు చిన్నవే –
నక్షత్రాలు కాదు, దూరమైన ఆకాశాలు కాదు,
చీకటిలో ఒక చప్పున మాట మాత్రమే
“ఆందోళన పడకు, నేను ఉన్నాను.”
కొన్నిసార్లు నేను ఊహిస్తాను,
గాలి తల్లి స్పర్శలా ఉందని,
ఆకాశం తండ్రిలా వింటాడని,
నక్షత్రాలు నన్ను గుర్తుపెట్టుకున్నాయని.
కానీ రాత్రి భారంగా మారినప్పుడు,
ఆశ సన్నని దారంలా అనిపించినప్పుడు,
నా గుండె చప్పుళ్లలోనే ముడుచుకొని
దాన్నే నా ఇంటిగా పిలుస్తాను.
ఎందుకంటే ప్రపంచం నీ పేరుని మరచిపోయినప్పుడు,
నువ్వే నీ కుటుంబంగా మారడం నేర్చుకుంటావు.
పగిలిపోయినా, నిశ్శబ్దంగా ఉన్నా.. నిలబడి ఉంటావు,
ఇంకా ప్రేమ కోసం ఎదురుచూస్తూనే ఉంటావు.
‘అనాథ హృదయం’
ఆకలి బాధలో అణగారిన నిశ్శబ్దం,
అవమానం గాలిలో ఊగే జీవితం..
కన్నీటి చుక్కల్లో కరిగే రోజులు,
గాయాల జాడల్లో నడిచే అడుగులు..
నీడలు మాత్రమే తోడు అయ్యే వేళ,
నిజమైన మనసు ఎక్కడో దూరమైపోయే వేళ..
ఎదురుచూపు మాత్రమే ఆశగా మిగిలి,
ఎవరైనా నన్ను చూసే రోజుకై వేచి..
చిరునవ్వు ఒకప్పుడు నా సొంతం,
ఇప్పుడు అది ఓ కలలో కనిపించే స్వప్నం..
ప్రేమ అనే మాట నా చెవిలో పాడితే,
హృదయం మళ్లీ పూయాలని కోరుకుంటుంది నిశ్శబ్దంగా..
అనాథని అన్నా, మనసు మాత్రం మానవమే,
చిన్న ప్రేమ చాలు, అది పర్వతం లా నిలుస్తుంది నా లోపలే..
మానస రెడ్డి చిచిలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందిన కవయిత్రి. ఆమె రచించిన హైకూ మరియు టాంకా కవితలు Under the Basho, Mainichi Haiku వంటి అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆమె హైకూ 2025 సంవత్సరానికి సంబంధించిన Touchstone Award కు నామినేట్ చేయబడ్డారు. అంతేకాకుండా, ఆమె నేరుగా జపనీస్ భాషలో కూడా హైకూ రచనలు చేసారు.
