
ప్రముఖ రచయిత, కవి, కాలమిస్ట్, ప్రవచనకర్త శ్రీ పాణ్యం దత్తశర్మ సంచిక మాసపత్రికలో నిర్వహించబోతున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.
ఉత్తమ సాహిత్యాభిరుచి గల, గుణగాములైన, సంస్కారవంతులైన సంచిక పాఠకుల కోసం పాణ్యం దత్తశర్మ ప్రత్యేకంగా వాస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.
తెలుగు, సంస్కృత సాహిత్యాలలో అద్వితీయమైన, విశ్వజనీనమైన, కావ్యాలు, ప్రబంధాలు, ఇతిహాసాలు, నాటకాలలోంచి ఒక చక్కని పద్యాన్నో, ఒక రమ్యమైన శ్లోకాన్నో తీసుకుని, దానిలోని చమత్కారాన్ని, భావ సౌకుమార్యాన్ని, భాషాసౌందర్యాన్ని, ఆలంకారిక శోభను, ప్రతిపదార్థ తాత్పర్యములతో బాటు సరళంగా వివరిస్తారు. వేదము వేంకటరాయశాస్త్రి, మల్లినాథసూరి వంటి మహోన్నతులైన వ్యాఖ్యాతలను పాఠకులకు పరిచయం చేస్తుందీ శీర్షిక.
నవ తరానికి ప్రాచీన సాహిత్య సుగంధ పరిమళాన్ని అందిస్తుందీ శీర్షిక
ప్రాచీన సాహిత్య పిపాసుల దాహం తీర్చే వీచిక ఈ శీర్షిక
పద్య ప్రేమికులకు, శ్లోకగతాభిమానులకు, సాహిత్యాభిమానులకు, నూత్నవిషయ పఠనాసక్తులకు ప్రియసఖి ఈ శీర్షిక.
***
‘అనర్ఘరత్నాలు’ – సరికొత్త ఫీచర్..
వచ్చే నెల నుంచి ప్రారంభం..
