[శ్రీ పప్పు రామకృష్ణ రావు రచించిన ‘అందమే అంతటా’ అనే కవిత అందిస్తున్నాము.]
చల్లని గాలి వెచ్చగ నీవు
వెరసి లోకం బృందావనం
చల్లని గాలి..
మందహాసం నిండెను మనసు
మరచి కలతలు మురిసేను
చల్లని గాలి..
కదిలే ఆకులు కలిపెను మాటలు
పూచిన పూవులు పలకరించెను
చల్లని గాలి..
వేచిన వేకువ వెంట వచ్చెను
పక్షులు పాటలు పాడసాగెను
చల్లని గాలి..
అవును కాదు అని యిక లేదు
అందమె అంతట కానవచ్చెను
అవును కాదు అని యిక లేదు
అందమె అంతట కానవచ్చెను
చల్లని గాలి వెచ్చగ నీవు
వెరసి లోకం బృందావనం
చల్లని గాలి..
