Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంత మాత్రంగా..

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘అంత మాత్రంగా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కాలం
ఎప్పుడు తూచినా
గ్రాము బరువు
కూడా లెక్కే.

పైకి రోజులెన్నో
తలదించుకు పోతున్నా
పట్టించుకోవడం లేదన్న
భ్రమలో ఉంచుతుంది.

కానీ
ఖచ్చితమైన
ఓ ఖాతా
తెరవబడే ఉంటుంది..

మంచి చెడ్డలను
విడగొట్టే ప్రకృతి యంత్రంలా
నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.

ఎవరికి రావాల్సింది
వారికిచ్చి
ఏమి లాక్కోవాలో
అది లాక్కొని

అర్థమైనా.. కాకున్నా

ఎవరికి ఎంత మాత్రమో
అంత మాత్రంగా
గడుపుకు పోతుంది.

Exit mobile version