[అరుణ నిష్ఠల గారి ‘అంతర్వాణి’ అనే కవితని అందిస్తున్నాము.]
పల్లవి:
మేలమాడువారే గాని మేలాడరెవరూ అని చింతించనేల?
మేలుకోలు అంతరంగము నందే ఆవిర్భవించి మున్నే హెచ్చరించదా?
చరణం 1:
సమద లోల స్వాంతులై కర్షణములు మనసు పీడమానమైన
సమగ్ర చింతనల పర్యవసానము మతి నట్టే పొటమరించు!
చరణం 2:
అనూహ్య స్థితిగతుల అతికర్శితుడై మది గ్రువ్వి యుద్ధతినంద!
అనువైన కాల మావిర్భించి విభ్రష్టము లణగునని ఆశ్వాసన లభించు!
చరణం 3:
ఇదమిత్థమని తెలియరాని సంకట ముప్పరిల్లునని శంకించ!
నిదానమున కార్యసాధన క్రమ విశ్లేషణల ఎఱుక లభించు!
చరణం 4:
అవనాయముల బడువేళ సూక్ష్మరీతి మేల్కొలుపు మానసము!
అవధరించి ఆచరించిన అదే కదా మేలుకట్టు నారాయాణా!
~
మేలుకోలు=అవబోధము
అతి కర్శితుడు=దుఃఖితుడు
మేలుకట్టు=సోపానము
