Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెన్నెల-గీత పబ్లికేషన్స్ నుంచి అనువాద కథల ప్రచురణ – ప్రకటన

వెన్నెల-గీత పబ్లికేషన్స్ తరఫున నేను ప్రచురించదలచిన అనువాద కథల ప్రచురణ వివరాల ప్రకటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మీ కథ ఏదైనా ఇతర భారతీయ భాషల్లోకి, ఇంగ్లీష్ లోకి, పాశ్చాత్య దేశాల భాషల్లోకి అనువాదమయితే..

1) మీ మూల కథ 2).అనువాద కథ రెండూ పంపండి. అలాగే అనువాదకురాలి/అనువాదకుడి సమాచారం కూడా రాయండి.

మూడూ కలిపి వెన్నెల-గీత పబ్లికేషన్స్ నుంచి పుస్తకంగా వేయాలని అనుకుంటున్నాను.

మీ కథలు నా వాట్సాప్ నెంబర్ 8897791964కి పంపండి, bharathi27964@gmail.com అనే ఐడికి మెయిల్ చేయండి.

ముఖ్యమైన సూచనలు:

  1. ఈ మూల మరియు అనువాద కథా సంకలనంకు స్రీ పురుష రచయితలు ఇద్దరూ తమ రచనలు పంపవచ్చు. ఇది కేవలం రచయిత్రులకి మాత్రమే చెందింది కాదు.
  2. మీరు రాసిన కథ, అనువాద కథ రెండూ పంపాలి.
  3. మూల కథ + అనువాద కథ రెండూ యూనికోడ్‌లో మాత్రమే పంపాలి.
  4. అనువాద కథ యూనికోడ్ స్క్రిప్ట్ అనువాదకులను అడిగి సంపాదించవచ్చు. లేదా ఆయా భాషల్లో మళ్ళీ చేయించిన కొత్త యూనికోడ్ స్క్రిప్ట్ పంపవచ్చు. ఈ సౌకర్యం డిటిపి సెంటర్లలో ఉంటుంది.
  5. దయ చేసి పత్రికలో అచ్చయిన కథ జిరాక్స్ చేసి యాజ్ ఈజ్‍గా పంపకండి. మీరు యూనికోడ్‌లో డిటిపి చేసి పంపిన కథలు నేను పేజ్ మేకింగ్ చేసుకుని నేరుగా ప్రింటింగ్‌కి పంపుకోవాలి.
  6. కథలు ఒక ప్రతి నా మెయిల్ ఐడికి, మరో ప్రతి నా వాట్సాప్ నెంబర్‍కి పంపాలి.
  7. కథలు పంపాక నాకు కాల్ చేసి అయినా లేదా వాట్సాప్ మెసేజి అయినా ఆ సమాచారం పెట్టాలి.
  8. అనువాదకులతో వాళ్ళకి అనువాదం చేయాలనిపించేంతగా మీ కథ ఎందుకు నచ్చిందో తెలుసుకుని ఆ వివరాలు, అనువాదకుల చిరు పరిచయంతో సహా పంపాలి. అనువాదకులు అందుబాటులో లేకపోతే వదిలేయచ్చు. కానీ ప్రయత్నం చేసి అనువాదకులతో మాట్లాడి రాస్తే మరీ మంచిది.

కథలు పంపాల్సిన చివరి తేదీ మార్చి 15. 2025.

LAST DATE FOR SENDING YOUR STORIES — MARCH 15-2025

గీతాంజలి

వెన్నెల-గీత ప్రచురణలు

Exit mobile version