Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-10

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

షిలాంగ్‌లో భూకంపం

~

కాంక్రీటు అందరూ అనుకునేంత
బలమైనది కాదనీ
జీవితం పరిసమాప్తమౌతుందనీ
తెలుసుకున్నాను ఇవాళ.
పెద్ద భవంతికి యజమాని ఐన
నా పొరుగింటాయన మీద
ఇప్పుడు నాకు అసూయ లేదు
అతను చెప్పులు లేని కాళ్లతో
ఇంటి బయట దుమ్ములో నిలబడి
వీధిలోని కరెంటు స్తంభాన్ని
బిత్తిరి బిత్తిరిగా చూస్తున్నాడు

ఆంగ్లమూలం: లాల్నుంసంగ రాల్టే
అనువాదం: ఎలనాగ

Exit mobile version