Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-11

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

హమామ్ సబ్బు

~

బూరకొమ్ము లాగా మునిసిపల్ నల్లా
అరగంట సేపు గురగుర శబ్దం చేస్తుంది
ఆపైన కొన్నిచుక్కల నీళ్లు వస్తాయి బయటికి

వణికే నీళ్లగొట్టాలకు స్పందిస్తూ
భవనం కంపించి మెలకువలోకి వస్తుంది
అందరూ ఒక్కుమ్మడిగా లేచి
అందుకుంటారు బకెట్లను
నల్లాలమీద దెబ్బలు వేస్తారు
దృష్టిని వాటిమీదే ఉంచుతారు

ఒక్కో చుక్క పడుతుంటే
హృదయాలు రెపరెపలాడుతై
సబ్బునురగల, తలస్నానాల,
మలవిసర్జనల సామూహిక అనుభూతిలో
ఋజువర్తనం అభినయించబడుతుంది

మణిలాల్ మేడలోని ఇరుకు దారుల్లో
తువాళ్ల తోరణాలు వెలుస్తయ్
దాని బాహుమూలం లోంచి
తాజా శ్వాసల వాసనలు వెలువడుతాయి

ఆంగ్లమూలం: ముస్తాన్సిర్ దల్వి
అనువాదం: ఎలనాగ

Exit mobile version