Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-44

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

కార్లోస్ విలియమ్స్ కార్లోస్ కవితలు మూడు

~

1) ఊరికే చెప్తున్నాను
~
నువ్వు ఫ్రిజ్ లో ఉంచిన రేగుపళ్లను తిన్నాను
ఉదయపు ఉపాహారం కోసం
వాటిని దాచుకున్నావు బహుశా.

క్షమించు
అవి చాలా తియ్యగా,
చల్లగా, ఎంతో రుచికరంగా ఉండినై

2) గోడల మధ్య
~
ఆస్పత్రి వెనుకభాగంలో
ఏమీ మొలకెత్తదు
అక్కడ ఉన్న బూడిదలో
ఆకుపచ్చ గాజుసీసా ముక్కలు
అందంగా మెరుస్తున్నై

3) అద్భుతమైన అంకె దృశ్యం
~
వర్షమూ వెలుతురూ నిండిన రాత్రిలో
ఎర్రరంగు ఫైరింజన్ ట్రక్కు మీద
బంగారు రంగులో ఐదు అంకె!
ఆ ట్రక్కు గంటల శబ్దంతో సైరన్ మోతలతో,
చక్రాలు రొద పెడుతంటే
చీకటి నిండిన నగరాన్ని దాటింది

ఆంగ్లమూలం: కార్లోస్ విలియమ్స్
తెలుగు అనువాదం: ఎలనాగ

Exit mobile version