Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-47

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

ఔట్‌పోస్ట్

~

ప్పుడు నేను వెనక్కి వెళ్లాను
ఈసారి నన్నేదీ ఆపలేదు

అదే నర్సు స్వాగతించింది నన్ను
కానీ ఈ సారి అడ్డగించకపోవడం
బలహీనంగా ఉంది

దిగుడుబావి మెట్ల మీద
మనమిద్దరం పక్కపక్కన కూచున్నాం
మనుషులు మన మధ్యంలోంచి నడుస్తున్నారు
పొగ లాగా మనం వాళ్ల లోపలికి ప్రవేశిస్తున్నాం
నాకు తెలిసిన మనుషులే ఉన్నారిక్కడ
కానీ వాళ్లు స్వేచ్ఛ లోని భాగాలు

నీ చేయి రాయిలో ఒదిగిపోయింది
అది చలికాలంలో మంచును తింటుంది
ఇక వెళ్లాల్సిన సమయం వచ్చిందా?
చలికాలం పైకి లేచింది

జ్ఞాపకం చేసుకుని, మనం
సరిహద్దు దగ్గరి ఔట్‌పోస్టుకు పోయాం –
ఈస్ట్రోజెన్ కొనేందుకు.

రాజసైనికులు తోవలో
మనను స్వాగతించారు
వాళ్లు పొగకేంద్రకం లోంచి
సుళ్లు తిరుగుతూ బయటికి వచ్చే
చిక్కనైన పొగ లాగా ఉన్నారు

వాళ్లు మన తలనీలాల వలలోకి
వీచారు దొంగతనంగా.
మనం యుద్ధంలో ఓడిపోయాం
మనం చేసిన ఒకే ఒక యుద్ధం అది
తర్వాత ఔట్‌పోస్టును చేరుకున్నాం
నేను ఎస్ట్రడియాల్ తీసుకున్నాను
నా పాదాలు నొప్పెట్టినై

ఓక్ ముద్దలు చెట్లనుండి వీస్తూ వచ్చి
నా తోవలో పడ్డాయి
నేను నేరుగా ఉన్న తోవలో
అప్పుడు ఇంటికి నడిచి వెళ్తున్నాను
ముళ్లపొద తలుపులు తెరిచాను

తర్వాత సంవత్సరాలు గడిచాయి
గడిచాయి ఏడాదులెన్నో
ఏళ్లు చాలా జరిగిపోయాయి
తర్వాత దాన్ని చేరుకునేందుకు
కొత్త శైలిలో నడిచాను
దాన్ని అంటే, కింద పడ్డప్పుడు
బహిర్ముఖ ఖడ్గం వెలువరించే
లోహశబ్దాన్ని అన్న మాట
దాని పిడిలో Z అనే అక్షరం దాగి వుంది
హోల్డర్లిన్ పుట్టింది అదే సంవత్సరంలో
అచ్చం చలికాలపు పిచ్చుక లాగానే ఉన్నాడతడు
భేదాన్ని గుర్తించలేం

ఆంగ్లమూలం: యాంగ్యు చెన్
అనువాదం: ఎలనాగ

Exit mobile version