Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-54

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

తపాలా స్టాంపు

~

నన్ను నేను నీనుండి జాగ్రత్తగా
విడదీసుకుంటుంటే
పిల్లలు పాత పోస్టల్ కవర్లనుండి
స్టాంపులను ఊడబెరుకుతుంటారు

కొన్నిసార్లు నా అంచులు చిరుగుతాయి

నీకు దొరకనివ్వకుండా పెట్టుకున్న
నా దృఢనిశ్చయ మానసం లోని
ఎంతో కొంత తప్పకుండా ఉండిపోతుంది

కానీ నా కాగితం పల్చగా,
చాలా బలహీనంగా ఉంది
నీళ్లు పడిన నా బొమ్మ
మసక మసకగా ఉంది

ఆపైన, గాలి చూపే కనికరం మీద
ఆధారపడి ఉన్నాను నేను
ఆ గాలి నన్ను ఎలాగైనా, ఎటైనా
విసిరివేయవచ్చు

హిందీ మూలం: అనామిక
ఆంగ్లానువాదం: మణి రావు
తెలుగు అనువాదం: ఎలనాగ

Exit mobile version