Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-55

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

తాగుబోతు మాటలలోంచి

~

టాలియన్ రెడ్ వైన్ కోటు చూస్తోంది నన్ను.
ఎక్కువసార్లు తొడుక్కున్నందుకు
దాని ఉన్ని బయటికి కనిపిస్తోంది
చంకల్లో అది పిగిలిపోయింది
దాని ముందుభాగంలో బురద మరకలు
కనిపిస్తున్నాయి స్పష్టంగా.
ఎందుకంటే పొద్దున నేను పొడవైన బూట్లను
పైకి లాక్కున్నప్పుడు గానీ
సాయంత్రం హడావుడిగా వాటిలోకి
మారినప్పుడు గానీ తప్పక బొక్కబోర్లా పడతాను
నన్ను కాళ్లమీద నిలబెట్టేవి
జీవితం దాహం లాలాజలం
నా నాలుక బంగారు మౌనం కోసం తపిస్తూ,
ఉమ్మిని నిస్సిగ్గుగా కోటుమీదికి కార్చే
పెదవులను లాలిస్తుంది

నా ఇటాలియన్ రెడ్ వైన్ కోటు
అప్పుడప్పుడు ఏడ్వటం మంచి విషయమే
నువ్వు వదరుబోతుగా ఉన్నప్పుడు
నన్ను జ్ఞాపకం పెట్టుకుంటే బాగుండేది.
హిల్డా, నన్ను ఉతుకు

పోర్చుగీస్ మూలం: హిల్డా హిల్స్ట్
ఆంగ్లానువాదం: జూలియా పవర్స్
తెలుగు అనువాదం: ఎలనాగ

 

Exit mobile version