Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-65

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

శీర్షికా రహితం

~

కొనసాగుతున్నట్టు అనిపించడాన్ని సాధ్యం చేస్తూ
ఖాళీ అనేది తక్షణమే, మళ్లీ
మన ఇంద్రియాలకు కేంద్రంగా పని చేస్తుంది
విషయం కూడా చాలా వరకు
అలానే తయారవుతుంది
కాబట్టి ఖాళీ,
విషయం నిండా పూర్తిగా
వ్యాపించి ఉన్నట్టు అనిపిస్తుంది
ఏ చర్యలోనైనా అది
ముఖ్యమైన భాగంగా మారుతుంది
దాన్ని ప్రధాన బిందువుగా మార్చాలనుకున్నప్పుడు
ఖాళీ అంతటా వ్యాపించి ఉందనీ,
అది ఒకే సమయంలో ఎన్నో విధాలుగా
ప్రవర్తించగలదనీ, దృష్టిని కేంద్రీకరించడంలో
ప్రాథమిక పాత్రను పోషిస్తుందనీ
జ్ఞాపకముంచుకోవాలి

 

 

 

ఇది ఖాళీని స్థాపించడానికి రూపొందుతున్న
కొన్ని పేరాగ్రాఫుల పరంపరలో ఒకటి

ఆంగ్లమూలం: అరాకావా & మాడెలిన్ జిన్స్
అనువాదం: ఎలనాగ

Exit mobile version