Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-67

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

కవి వేషంలో చార్లీ చాప్లిన్

~

రగబోయే విపత్తు కోసం
సిద్ధంగా వుంది వేదిక
దేశద్రిమ్మరి అయిన బికారి బుడతడొకడు
మైక్ ను చేరుకునేందుకు
పుస్తకాల దొంతర మీద నిలబడ్డాడు
వాడి పాదాల దగ్గర తివాచీ మీద
తాళ్లతో కట్టేసిన ఒక అసలైన కవి
తనలో తాను గొణుక్కుంటున్నాడు

బుడతడు నోరు తెరిచాడు
హా, భళా, లలలా!
నోట్లోంచి పావురాలు, విద్యుత్ బల్బులు,
ప్లాస్టిక్ గులాబీలు వచ్చాయి బయటికి!
అంతే..
‘కవులను మళ్లీ కలిసేది లేదు’ అంటూ
గింజుకున్నాడు ‘షో’ ను నిర్వహించే
యువ ప్రొఫెసర్

నేలమీది రహస్య ద్వారం కోసం
ఆర్తనాదం చేశాడు విభాగ అధిపతి
అది తెరుచుకుంది

ఏమీ జరగనట్టు బుడతడు
తన పనిని కొనసాగిస్తున్నాడు
అడ్డు లేని అతని బాహువు
అనుకరిస్తోంది పక్షిరెక్కను.

ఆంగ్లమూలం: కార్నీలియస్ ఈడీ
అనువాదం: ఎలనాగ

Exit mobile version