Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-7

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

నేనొక చెట్టును

~

నాలో ఒక చెట్టు నివసిస్తోంది
ఏకాంతంలో కూరుకుపోయిన దాని వేళ్ళు
లంగరు లాగా నా దిమ్మరి మనసును
గట్టిగా భూమిలోకి లాగిపట్టి ఉంచుతై
చిక్కుపడిన ముడులు గల దాని కాండం
నా వెన్నెముకను కరుచుకుని ఉంటుంది
దాని కొమ్మలు నా నెమరువేతల
నిగూఢ ఆకాశంలోకి విస్తరిస్తాయి
దాని ఆకులు పాట పాడే పచ్చని పదాలు
అవి మోహనత్వాన్ని నింపుకున్న
నా నీలిసిరల్లో తేలియాడుతూ
నూతనత్వపు తెమ్మెరల తాకిడికి
అలవోకగా కదలాడుతాయి
దాని అమూల్యమైన పండ్లను
గుప్త వ్యాఖ్యానాల కోసం
తెంపుతారు, తొక్క తీస్తారు

నాలోపల ఒక చెట్టుంది
నేను వృక్షాన్ని

ఆంగ్లమూలం: బీనా సర్కార్ ఎలియాస్
అనువాదం: ఎలనాగ

Exit mobile version