Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-72

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

విరుద్ధస్వర విరామం

~

ఉదాత్త వ్యక్తుల ఉన్మాదం బహుశా
పాత గాథలలోని పాత ఆచారం
‘అబ్బా నేను పిచ్చివాణ్నవుతాను’
అని వెంటనే ఉన్మాదులవుతారు వాళ్లు
కప్పుకున్న మానసిక ఆరోగ్యపు దుప్పటిని తీసేసి
చలికాలపు అగచాట్లలోకి
పరుగెత్తడానికి ఉన్మాదులవుతారు

వాళ్లు అలా నేలమీద పడుకున్నప్పుడు
క్రూర జంతువులు, పక్షులు వచ్చి
భయానికి గురవుతాయి
పాఠకుడు కూడా అంతే –
రాజూ అతని సైన్యమూ ఉదయం వేళ
చిన్నగా కేక వేస్తూ వేటాడుతుంటే
స్వస్థచిత్తం అంతర్గత క్రూరశక్తికి లోనవుతుందా
అని తలపోస్తాడు

సర్ ఓర్ఫియో అడవిలో నివసించేందుకు సమ్మతిస్తాడు
మీటలను నొక్కుతూ అతడు సృష్టించే గానం
మనకు ఉపశమనాన్నిస్తుంది
తర్వాత, ‘తీగలు ప్రతిధ్వనించనీ’
అంటుంది అతని గీతం
స్వరవైరుధ్యం అని పిలువబడేది
నిజానికి అన్నివేళలా వినపడదు

మొదటి, నాలుగవ క్రమాన్ని తీసుకుంటే
ఒకప్పుడు అది స్వరసామరస్యం
కానీ నాలుగవ స్వరాలు సమాంతరంగా పునరావృతం ఐతే
‘పోటీలో తట్టుకున్నందుకు సారీ’
అని వినిపిస్తుంది నీకు
చలికాలం వెళ్లిపోయింది
డేగల యజమాని తన పక్షులకు
రుసుమును విధించాడు

ఆంగ్లమూలం: ఫ్రెడరిక్ టిబెట్స్
స్వేచ్ఛానువాదం: ఎలనాగ

Exit mobile version