Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-73

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

నవ్య శుద్ధతావాదుల విహారయాత్ర

~

లోపల జోకులు వేసుకున్నది చాలు
ఈ విందును ఆరుబయటకు
నక్షత్రాల కిందికి తరలిద్దాం
నది ఒడ్డు మీద టపాసులను వింత టోపీలను
హెరోయిన్ ను కుప్ప పోయండి
చీకటి పడబోతోంది కనుక
ఒకరి చేతులను ఒకరు పట్టుకుందాం
అదిగో, పైకి చూడండి
ఒక పిడుగు ‘మీరు నా శబ్దాన్ని వింటే
నన్ను ఆపండి,’ అంటూ నింగిలోంచి
దూసుకు వస్తోంది

ఆంగ్లమూలం: ఎవరెట్ మాడాక్స్
అనువాదం: ఎలనాగ

Exit mobile version