Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-74

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

పచ్చచారల పుచ్చకాయలు

~

వాళ్లు నక్షత్రాల కింద పొలంలో పడివుంటారు
వర్షంలో తడుస్తూ చేనులో పడివుంటారు
ఎండలో ఎండుతూ ఉంటారు

కొందరు ఇలా కూడా ఉంటారు:
పెయింటింగ్ ఉన్న ఒక కాన్వాసు కింద
మరొక పెయింటింగ్ ఉన్న మరొక కాన్వాసులా.

ఊహించని బరువు వారి పరిపక్వతకు చిహ్నం

ఆంగ్లమూలం: జేన్ హర్ష్ ఫీల్డ్
అనువాదం: ఎలనాగ

 

Exit mobile version