Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-75

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

~

1. జీను

చిన్ని నేస్తమా,
నువ్వూ నేనూ జ్ఞాపకపు జ్ఞాపకపు జ్ఞాపకంగా
మారిపోతాము

జీను తీసేసిన గుర్రం
బగ్గీ బరువును మరిచిపోయినట్టుగా.

2. కష్టం నిండిన క్షణాలు

కష్టం నిండిన క్షణాలన్నీ
జాడీలో ఊరగాయ రూపంలో ఉండే
మామిడి ముక్కల్లాంటివి
అవి గట్టితనాన్ని కోల్పోయి తమలోకి తామే
ముడుచుకుపోతాయి
సొరచేపరెక్కల రంగు నింపుకొని
గొణుగుతూ మాట్లాడుతాయి జాడీగోడలతో.
అదేవిధంగా విపత్తు విశ్రాంతిని పొందుతుంది
ఊరగాయ ముక్కలు మొదట జాడీలో ఉండి
తర్వాత అన్నంలోకి పోయినట్టుగా.

ఆంగ్లమూలం: జేన్ హర్ష్ ఫీల్డ్
అనువాదం: ఎలనాగ

Exit mobile version