Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-76

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

~

మంచులో కుర్చీ

మంచులో తడిసిన కుర్చీ
తెల్లగా, మొనదేలని గుండ్రమైన అంచులతో ఉండాలి
కానీ మంచులోని కుర్చీ మంచంకన్నా టోపీకన్నా
ఇల్లుకన్నా ఎక్కువ దిగులుగా ఉంటుంది ఎప్పుడూ.

ఒక మనిషి ఎవరైనా కొంచెం సేపు
స్తిమితంగా కూర్చొని గడిపేందుకు
అనువైన ఆకారంలో ఉంటుంది కుర్చీ
ఆ వ్యక్తి బహుశా రాజు కావచ్చు

మంచునో పువ్వులనో తనలో
ఉంచుకోవడానికి ఉద్దేశింపబడలేదు కుర్చీ

ఆంగ్లమూలం: జేన్ హర్ష్ ఫీల్డ్
అనువాదం: ఎలనాగ

Exit mobile version