Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-77

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

~

1. సునోమా జ్వాల

ముదురు నారింజరంగులో నిప్పుకణికలా పెద్ద చంద్రుడు!
ఆ పరిమళమూ అంతే
ఇతరుల దుఃఖం కూడా
దూరంనుండి అందంగా కనబడుతుందా?

~

2. అన్వేషణ

జ్ఞానాన్ని కోరుకునే మనుషులారా,
లోపలి ఏకత్వం కోసం వెతకండి
అక్కడ అప్పటికే వేచివున్న
స్వచ్ఛమైన అద్దం కనిపిస్తుంది మీకు

ఆంగ్లమూలం: జేన్ హర్ష్ ఫీల్డ్
అనువాదం: ఎలనాగ

Exit mobile version